రాష్ట్రంలో ప్రభుత్వ పరిధి లోని యూనివర్సిటీల్లో ఆర్థిక వ్యవహారాలు అకౌంటింగ్, ఆడిట్ వ్యవహారాలపై సమీక్షిం చేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఉన్నత విద్యాశాఖ, ఆడిట్ డిపార్టుమెంటు ప్రతినిధులు సభ్యులుగా, ఉన్నత విద్యామండలి ప్రతినిధి మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. సంబంధిత వర్సిటీ రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్లు ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై ఆయా వర్సి టీల ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలను సమీక్షిస్తుంది.