న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమ్మాయిలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 సైనిక్ స్కూళ్లున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా 2018-19లో మిజోరామ్ లోని సైనిక్ స్కూల్ చింగ్ చిప్లో అమ్మాయిలకు అడ్మి షన్ కల్పించామని, ఇది విజయవంతం కావడంతో అన్ని సైనిక్ స్కూళ్లలో ఆబ్బాయిలతోపాటు అమ్మాయిలను చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్ సభలో తెలిపారు.