పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఎంవీ రాజ్యలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కృష్ణా జిల్లా డీఈవోగా పని చేస్తున్న రాజ్యలక్ష్మిని ఆ పోస్టు నుంచి తప్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆమెను పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన కోర్టు కేసుల పర్యవేక్షణ విధుల్లో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న తాహెరా సుల్తానాను కృష్ణా జిల్లా డీఈవోగా నియమిస్తూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మరో జీవో విడుదల చేశారు.