రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పెన్షనర్లకు స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లా ట్రెజరీ కార్యాలయాల డిప్యూటీ డైరెక్టర్లు స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వీటిని అందించి, ఆయా పెన్షనర్ల నుంచి అందినట్లు రశీదు తీసుకోవాలని ఆదేశించారు.