పాఠశాలలతో సహా ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరుపై అధ్యయన
కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళ వారం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జిఓ నెంబరు 52ను విడు దల చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఏటా ప్రవేశాల శాతం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అధ్యాయనానికి ఈ కమిటీ వేస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కమిటీకి చైర్ పర్సన్ గా తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రత్నకుమారి వ్యవహరించనున్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ డబ్ల్యు రాజేంద్ర, విశాఖపట్నం ఎయు ప్రొఫెసర్ గొల్ల జ్ఞానమణి, ఎపి హైకోర్టు అడ్వకేట్ సి.సుదేశ్ ఆనంద్, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు డైరెక్టరు కె. వెట్రి సెల్వి, కాలేజ్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెంబర్లుగానూ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు