★ రాష్ట్రంలో ఈ నెల ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు నిర్వహించాల్సిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి తెలిపారు.
★ ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
★ టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షల్లో డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సుల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు జరగనున్నాయి.
★ వీటికి సంబంధించి థియరీ పరీక్షలు 26 నుంచి 29 వరకు, హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్ పరీక్షలు 27 నుంచి మే ఆరో తేదీ వరకు జరగనున్నాయి.
★ డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షల అన్ని పేపర్లు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి.
★ హ్యాండ్లూమ్ వీవింగ్ థియరీ పేపర్ 1 పరీక్షలు 26న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నాయి.
★ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్
హయ్యర్ గ్రేడ్ పరీక్షలు 26 నుంచి 28వ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని సుబ్బారెడ్డి వివరించారు.