'ఆంధ్ర అభ్యసన పరివర్తన'
★ పాఠశాల విద్యలో ' ఆంధ్ర అభ్యసన పరివర్తన ' ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ .1,860 కోట్ల రుణం అందిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
★ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఈ మేరకు భారత డైరెక్టర్ జునైద్ కమల్ లేఖ రాశారని వెల్లడించారు.
★ విద్యారంగంలో అమలవుతున్న పథకాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన ప్రపంచబ్యాంకు బృందం ఈ రుణాన్ని మంజూరు చేసిందన్నారు.
★ ఈ ప్రాజెక్టులో భాగంగా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేసి, ఉపాధ్యాయలు విద్యార్థుల మధ్య సంబంధాలను మెరుగుపర్చనున్నట్లు వెల్లడించారు.
★ 2021- 22 నుంచి 2026-27 వరకు ఈ ప్రాజెక్టు అమల్లో ఉంటుందన్నారు.