CSE instructions Rc No 151 dt 23.6.2021 on issue of T.Cs
TC / Record Sheet లేకపోయినా New school లో Admit చేసికొనాలి. TC కొరకు insist చేయరాదు.30 రోజుల్లో ఇవ్వవచ్చును .New Schools లో చేరతామన్నవారికి HMs T.C ఇవ్వాలి
టీసీల పై వివరణ
- పాఠశాలల్లో ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థులను, వారి తల్లిదం డ్రులను ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ( టీసీ ) ల కోసం ఒత్తిడి చేయకుండా వెంటనే ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని,
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు బుధవారం జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు సూచనలు జారీ చేశారు.
- కోవిడ్ కారణంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు టీసీల సమర్పణకు 30 రోజులు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
- కొత్తగా చేరే స్కూళ్లలో టీసీలు సమర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అర్జీలు ఇస్తే అప్పటివరకు చదువుతున్న స్కూళ్ల యాజమాన్యాలు వెంటనే టీసీలను ఇవ్వాలని స్పష్టం చేశారు.
- కోవిడ్ కారణంగా టీసీలు ఇవ్వడానికి 30 రోజుల గడువు ఇస్తున్నందున ఆలోగా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు జారీ చేయకుంటే విద్యాహక్కు చట్టం కింద వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
- రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్లిన, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలకు ఎలాంటి టీసీలు, రికార్డు షీట్లతో సంబంధం లేకుండా విద్యాసంస్థల్లో 1 నుంచి 10 వతరగతి వరకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు.