APTF News..APPSC లో గ్రూప్ 1 తో సహా అన్ని పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాథ్ దాస్
ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది.