APTF:1938 KNL
మొదటి వేవ్ కరోనా సమయంలో స్కూల్ అసిస్టెంట్ & APTF జిల్లా కార్యదర్శి లాన్సీ నాగభూషణం గారు కరోనా చికిత్స నిమిత్తం శ్రీ సాయి సత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్నూలు లో ఉద్యోగుల హెల్త్ కార్డ్ (EHS)వుందని చెప్పినా క్యాష్ లేష్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా డబ్బులు కట్టించుకోవడం జరిగింది.
దీనిపై EHS స్టీరింగ్ కమిటీ లో సభ్యసంఘంగా వున్న APTF:1938 జిల్లా శాఖ జిల్లా EHS కో - ఆర్డినేటర్ & రాష్ట్ర నాయకత్వానికి ప్రాతినిధ్యం చేశారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు & కె.వెంకటేశ్వర రావు గార్లు నిబంధనలు పాటించని హాస్పిటల్ నుండి రికవరీ చేయాలని వైఎస్సార్ ట్రస్ట్, సీఈఓ గుంటూరు వారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. రాష్ట్ర & జిల్లా నాయకత్వం కృషి మేరకు నేడు శ్రీ సాయి సత్య హాస్పిటల్ యాజమాన్యం నుండి రూ 92,000/- రికవరీ అమౌంట్ ను నాగభూషణం గారికి ఇప్పించడం జరిగింది.
ఇట్లు:
జిల్లా గౌరవాధ్యక్షులు: ఏ.కమలాకరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: బి.మాధవ స్వామి, యస్.ఇస్మాయిల్, APTF:1938, కర్నూలు జిల్లా