పర్యవేక్షణకు అధికారులు
★ పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న పథకాల అమలు పర్యవేక్షణ, పరిశీలన కోసం విద్యాశాఖ ప్రతి జిల్లాకూ ఓ ప్రత్యేక అధికారిని నియమించింది.
★ ఇందుకు సంబంధించిన మెమోను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు.
★ శ్రీకాకుళం జిల్లాకు విశాఖపట్నం ఇన్ఛార్జి ఆర్జేడీ జ్యోతి కుమారి,
★ విజయనగరం జిల్లాకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు ఎ. సుబ్బారెడ్డి,
★ విశాఖపట్నానికి సమగ్ర శిక్ష ఎఎస్పిడి - 1 మధుసూదన రెడ్డి,
★ తూర్పు గోదావరి జిల్లాకు కాకినాడ ఆర్డి నరసింహారెడ్డి,
★ పశ్చిమ గోదావరికి సమగ్ర శిక్ష సైమాట్ డైరెక్టరు విఎన్ మస్తానయ్య,
★ కృష్ణాకు సమగ్ర శిక్ష ఎఎస్పిడి - 2 ఎం. కాలెబ్,
★ గుంటూరు జిల్లాకు గుంటూరు ఆర్ డి రవీంద్రనాథ్ రెడ్డి,
★ ప్రకాశం జిల్లాకు ఆర్ఎంఎస్ఎ డైరెక్టరు పి. పార్వతి,
★ నెల్లూరుకు పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టరు ప్రసన్న కుమార్,
★ కర్నూలుకు మోడల్ స్కూల్స్ కార్యదర్శి మధుసూదనరావు,
★ కడప జిల్లాకు కడప ఆరెడి వెంకట కృష్ణారెడ్డి,
★ చిత్తూరుకు టెట్ డైరెక్టరు ఆర్. నాగేశ్వరరావును నియమించారు.
విద్యాశాఖలో అమలవుతున్న
★ జగనన్న విద్యాకానుక,
★ నాడు నేడు,
★ మధ్యాహ్న భోజన పథకంతో
పాటు ఇతర పథకాల అమలు తీరుపై తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
★ జిల్లాలో వివిధ డివిజన్ మండలాలలో కచ్చితంగా ఆరు పాఠశాలలను పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరారు.