APTF:1938:Info. మిత్రులారా!
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దాదాపు గంట సేపు మన డైరెక్టర్ శ్రీ చినవీరభద్రుడు గారు, JD ప్రతాపరెడ్డి గారితో అధ్యక్షుడు హృదయరాజు గారు, ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి గారు, మాజీ GS శ్రీ వెంకటేశ్వర రావు గారు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి గారు అనంతపురం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి సమావేశమై అనేక సమస్యలపై చర్చించడం జరిగింది.
ముఖ్యంగా రేపు నెల మొదటి వారంలో SA లుగా, HM లు ప్రమోషన్స్ ఇస్తాము అన్నారు.
అదేవిధంగా అర్హతలు కలిగిన PS HM లను SA లు గా Converstion కు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు NEP మీద మనకున్న అనేక సందేహాలను అమలులో
దానిలోని సాధ్యాసాధ్యాలను అడ్డంకులను లోపాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.NEP ని అమలులో భాగంగా మొదటి దశను అమలు చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. NEP లో భాగంగా ప్రాథమిక పాఠశాలలలోని 3,4,5, తరగతులను విడదీయరాదని APTF:1938 స్పష్టం చేయడం జరిగింది.
--అధ్యక్షులు హృదయరాజు గారు,
ప్రధాన కార్యదర్శి కె. కులశేఖర రెడ్డి