అఖిల భారత విద్యా హక్కు వేదిక
(ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ (AIFRTE) ) & ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF)
27న భారత్ బంద్ కు మద్దతు ప్రకటన
27 సెప్టెంబర్ 2021తేదీన సంపూర్ణ , శాంతియుత భారత్ బంద్ ను పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపునకు అఖిల భారత విద్యా హక్కు వేదిక సంపూర్ణ మద్దతును ఇస్తోంది.
300 మందికి పైగా రైతు సంఘాలు , కార్మికులు, గిరిజనులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయుల కోసం పనిచేసే సంస్థల ప్రతినిధులు ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి కట్టుబడి ఉన్నారు.
AIFRTE భాగస్వామ్య సంఘాలు, సోదర సంస్థలూ తమ సొంత బ్యానర్‌ల కింద బంద్ కోసం ఉత్సాహంగా ఉద్యమించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని వారు కోరుకుంటే AIFRTE బ్యానర్‌ని కూడా ఉపయోగించుకోవాలని తౄలియజేస్తున్నాం.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయండి!
విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు అన్ని రంగాల శ్రమజీవులైన ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజల ఐక్యత దిశగా అడుగులు వేద్దాం రండి ....
ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్
డాక్టర్ వికాస్ గుప్తా
(చైర్‌పర్సన్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ, AIFRTE)
ఫ్రెండ్స్!
27 సెప్టెంబర్ దేశవ్యాప్త బంద్ కు APTF సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ మేరకు ఆ రోజు జరిగే సమావేశాలు, ర్యాలీ ల్లో పాల్గొని మద్దతు సందేశాలను ఇవ్వాలని APTF సబ్ కమిటి సమావేశం 18 సెప్టెంబర్ న తీర్మానం చేయడం జరిగింది.
- గౌరవ అధ్యక్షులు: ఏ. సదాశివరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: జి.హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి, APTF