23.9.2021 నంద్యాల:
సి.పి.యస్ ను రద్దు చేయాలి: ఏ.పీ.టీ.యఫ్
ముఖ్యమంత్రి తన ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీ మేరకు సి.పి.యస్.ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఏ.పీ.టీ.ఎఫ్.1938 రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎ.పి.జే.ఏ.సి.సెక్రేటరీ జనరల్ జి.హృదయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం స్థానిక ప్రాంతీయ కార్యాలయం, నంద్యాల లో జిల్లా అదనపు కార్యదర్శి నగిరి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో హృదయరాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ , ఉద్యోగులకు రావలసిన పి.ఆర్.సిని డి.ఏ.లను సకాలంలో చెల్లిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ మేరకు పి.అర్.సి. ని పెండింగ్ లో ఉన్న ఐదు డి.ఏ.లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లా గౌరవవాధ్యక్షులు ఎ.కమలాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు 302 ను పునరుద్ధరించి అర్హత కలిగిన పాఠశాల సహాయకులకు 40 శాతం జూనియర్ లెక్చరర్స్ గా పదోన్నతులు కల్పించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐ.మరియానందం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ల భారాన్ని తగ్గించాలని. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పజెప్ప రాదని, వారిని బోధనకే పరిమితం చేసి పేద విద్యార్థులకు గుణాత్మక మైన విద్య అందేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సాంబశివుడు మరియు డివిజన్ నాయకులు బత్తుల రవి కుమార్,యం.పుల్లయ్య. యం.రవి. రవి ప్రకాష్, కృష్ణమూర్తి,రషీద్, నీలగిరి.వెంకటేశ్వర్లు, మహాబూబ్ బాషా, ఆవుల.మునిస్వామి..యం పవన్.తదితరులు పాల్గొన్నారు.