నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
- జి.హృదయ రాజు, రాష్ట్ర అధ్యక్షులు, ఏపిటీఎఫ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కార్మిక కోడ్ లను రద్దు చేయాలని, ప్రైవేటు విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పోరేట్ లకు అప్పజెప్పరాదని తదితర కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కార్యక్రమం నేడు రైతుసంఘాల సమన్వయవేదిక & వామపక్ష నేతల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు బారీ ర్యాలీ జరిగింది.
ర్యాలీ అనంతరం నిర్వహించిన సభకు ఆం.ప్ర. రైతుసంఘం నాయకులు జగన్నాథం అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయరాజు మాట్లాడుతూ కేంద్రం రైతులు, కార్మికుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని, సేవ రంగాలను అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగం 30 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్డ్ అయితే CPS విధానంలో నెలకు 700/- రూ లు పెన్షన్ వస్తుందని ఇది కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన పథకం అని అన్నారు. వెంటనే పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని , నూతన జాతీయ విద్యా విధానం (NEP) - 2020 ను సింహ భాగం సవరించాలని కోరారు. భారత్ బంద్ కార్యక్రమంలో APTF నాయకులు ఏ.కమలాకర రావు, ఐ.మరియానందం, టీవీ రామకృష్ణ, యస్ ఏ గఫార్, తిమ్మప్ప, పెద్దస్వామి, రాఘవ రెడ్డి, సుబ్రమణ్య శర్మ, హబిబుల్ల, రాంగోపాల్ రెడ్డి, నరేంద్ర, రాంప్రసాద్ రెడ్డి, హమీద్, శ్రీరాములు , రవి, POP నాయకులు జీ. భార్గవ్ తదితరులు పాల్గొన్నారు
భారత్ బంద్ లో పాల్గొని మద్దతు ప్రకటిస్తున్న APTF రాష్ట్ర అధ్యక్షులు: జి.హృదయ రాజు
కర్నూలు జిల్లా APTF శ్రేణులు
POP నాయకులు భార్గవ
APTF అభిమాని కొత్తపల్లి ఎమ్ ఈ వో శ్రీరాములు