మల్లాది.. బెదిరింపులొద్దు: ఫ్యాప్టో
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తే.. మల్లాది విష్ణు భరించలేకపోవడం ప్రజాస్వా మ్యంలో సరైన పద్ధతి కాదని రాష్ట్ర వ్యాప్టో చైర్మన్ సీహెచ్ జోసఫ్ సుదీర్ బాబు, సెక్రటరీ జనరల్ సీహెచ్ శరత్చంద్ర మరో ప్రకటనలో ఖండించారు. ఉద్యోగుల కోసం ప్రశ్నించే శాసనమండలి సభ్యులను బెదిరించడం మానుకో వాలని హితవు పలికారు. ఇలాంటివి పునరావృతమైతే ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత మూడున్నరే ళ్లుగా పీఆర్సీని అమలు చేయలేదని, పెండింగ్ 5 డీఏలను ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పలేకపోతున్నారని, 7 రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీ ఎస్ నేటికీ రద్దు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపా య పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు