ఐటి ఐ డి ఎల్ టి ల రాష్ట్ర సదస్సులో వందల మంది ఉద్యోగులు పాల్గొన్న సమావేశంలో సభా వేదికపైన లక్షలాది మంది నిరుద్యోగులకు , కాంటాక్ట్ , ఔట్ సోర్సింగ్ , ఉపాధ్యాయ , ఉద్యోగ , పెన్షనర్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు ఐ.వెంకటేశ్వర రావు ను అవమానపరచిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అహంకారపూరిత వైఖరిని ఏపిటీఫ్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్సులు జి హృదయరాజు కె.కులశేఖర రెడ్డి పేర్కొన్నారు . పీఆర్సీ అమలు , కాంటాక్ట్ ఉద్యోగుల సమస్యలు , డీఎ ల మంజూరు , సీపీస్ రద్దు లపై తీవ్రమైన జాష్యంపై ప్రశ్నించిన ఎమెల్సీకి సమాధానం ఇవ్వాల్సింది పోయి లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిందిపోయి అసహనం వ్యక్తం చేయడం సరైన విధానం కాదన్నారు . బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జిహృదయ రాజు , కె.కులశేఖర రెడ్డి డిమాండ్ చేశారు .

MLC ఐ.వెంకటేశ్వరరావు గారి పైన , జరిగిన సభా అమర్యాద కు నిరసన తెలియజేస్తూ, అటువంటి చర్యలను APTF తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని APTF- 1938 జిల్లా కార్యదర్శి వి.బహేశ్వర ఆధ్వర్యంలో విరామ సమయంలో నల్లబ్యాడ్జ్ లతో నిరసన తెలియచేయడం జరిగింది.
- V. బహేశ్వర, జిల్లా కార్యదర్శి,
APTF:1938 అనంతపురం జిల్లా