ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలింపును నిరసిస్తూ రాష్ట్రంలో ఖళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అనంతపురం డి ఆర్ ఓ గారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా కన్వినర్ జి. రవీంద్ర, ఎపిటిఎఫ్1938, జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యం.వెంకటసుబ్బయ్య, జిల్లా అదనపు ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్, నాయకులు నాగిరెడ్డి, షమీవుల్లా, డి టి ఎఫ్ నాయకులు జార్జి, సాలవేముల బాబు తదితరులు పాల్గొన్నారు.