APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APSEC
Showing posts with label APSEC. Show all posts
Showing posts with label APSEC. Show all posts

NEP 2020 , రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ APSEC ఆధ్వర్యంలో నిరసన : నంద్యాల

Mohan
APTF Updated at: April 09, 2022

 జాతీయ విద్యా విధానం (యన్.ఈ.పీ.) 2020 ని, రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ.పీ.టీ.ఎఫ్.1938. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సాంబశివుడు, జిల్లా అదనపు కార్యదర్శి నగిరి.శ్రీనివాసులు మాట్లాడుతూ యన్.ఈ.పీ.అమలు లో బాగంగా ప్రాథమిక పాఠశాలలను విడదీసి 3.4.5.తరగతులను 3. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు అంతదూరం వెళ్ళలేక డ్రాపౌట్సు గా మారే ప్రమాదం ఉందని కాబట్టి దీనికి సంబంధించిన జి.ఒ.నెంబర్ 85   ను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను బలహీన పరుస్తూ 4674 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబర్  37 ను వెంటనే రద్దు చేయాలని ఉన్నత పాఠశాలలో విధిగా తెలుగు మీడియం ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీనియర్ నాయకులు యం.పుల్లయ్య, యం.రవి.మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులతో డీ.ఎస్సీ.ని ప్రకటించి, భర్తీ చేయాలని, వివిధ రకాల యాప్ లను తొలగించి ఉపాధ్యాయులకు బోధనచేసే స్వేచ్ఛ ను కల్పించాలని, అలాగే రాష్ట్రంలో సి.బి.యస్.ఈ. సిలబస్ ను అమలు చేయవద్దని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్న"నూతన జాతీయ విద్యా విధానం 2020" ని  రాష్ట్రం లో అమలు చేయకూడదని వారు డిమాండ్ చేశారు.

విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని కోరారు.

కావున ప్రభుత్వం వెంటనే విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో చర్చించి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.




ఈ నిరసన కార్యక్రమం లో గోపాల్ రావు, వై.విజయ కుమార్, యస్.వెంకటరమణ, డి.మౌలాలి. మద్దిలేటి,. రాంప్రసాద్,.యన్.రమణ., బత్తుల రవి కుమార్, యం.పవన్., కృష్ణమూర్తి., AISF సీటీ కన్వీనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.



ప్రాధమిక పాఠశాలలను ముక్కలు చెయ్యవద్దు. APSEC డిమాండ్ :: టెక్కలి

Mohan
APTF Updated at: April 09, 2022

        జాతీయ విద్యా విధానం 2020 అమలు పేరుతో రాష్ట్రం లోని ప్రాధమిక పాఠశాల లను ముక్కలు చేయవద్దని ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం టెక్కలిలో జరిగిన ప్రదర్శన లో 3,4,5 తరగతుల పిల్లలను మూడు కిలోమీటర్ ల దూరం లోని ఉన్నత పాఠశాలలకు తరలించడం తో డ్రాపౌట్ లు పెరుగుతాయని, అలాగే 1,2 తరగతుల పిల్లలను అంగన్వాడీలకు అప్పగించి ఇంటర్మీడియట్ విద్యార్హత గలవారితో బోధన చేయించే ఆలోచన విరమించాలని ఏపీటీయఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవసరమైన 25 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరుతుంటే అదిచేయకుండా ఉన్న యస్ జీ టీ పోస్టులను తరలిస్తూ ఉత్తర్వులను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమం ఉన్నత పాఠశాలల లో కోనసాగించాలని డిమాండ్ చేశారు.

        విద్యారంగ మేధావులు,విద్యా పరిరక్షణ కమిటీ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించి విద్యాప్రగతి కి దోహదపడాలని హితవు పలికారు.

           ఈ కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ మరియు ఏపి టీయఫ్ నాయకులు వై శేషగిరిరావు,కే.సూర్యనారాయణ, గున్న ప్రసాదరావు, యన్ సురేష్ కుమార్, వజ్జ ఆదినారాయణ, కళ్యాణ్ చక్రవర్తి, బమ్మిడి క్రిష్ణారావు, కే చిన్నారావు, శివానంద్, కాంతమ్మ,చిట్టెన్న, ఫల్గుణరావు, నారాయణరావు,వానయ్య,లోకు,నారాయణమూర్తి, మాధవరావు, బీ రామారావు, యం నారాయణమూర్తి, జీ శ్రీనివాసరావు, ఫల్గుణరావు, బీ నారాయణరావు, నాయుడు మోహన్, నాగరాజు, బీ వెంకటరావు తదితరులు కూడా పాల్గోన్నారు

        వివిధ రకాల యాప్ ల నిర్వహణ తో ఉపాధ్యాయులకు పనిభారం పెరగడంతో బోధనకు అవకాశం తగ్గినందున ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు.








ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు...APSEC & APTF బొబ్బిలి

Mohan
APTF Updated at: April 09, 2022

 ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు... విద్యా పరిరక్షణ సమితి ఏ పి టి ఎఫ్ బొబ్బిలి....... అప్రజాస్వామిక ,విద్యా ప్రతిబంధక నూతన విద్యా విధానాన్ని 2020 ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ వ్యతిరేకిస్తుంది .ఈరోజు బొబ్బిలి విద్యావనరుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 నిరసన తెలియజేసింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చప్పా వెంకటరమణ మాట్లాడుతూ 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల వరకు తరలించే జిఓ నెంబర్ 85 ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 ఉండాలని,  ఉన్నత పాఠశాలలో  రెండు మాధ్యమాలను కొనసాగించాలని, 4674 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 37 రద్దు చేయాలని ,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యను ఉన్నది జాబితానుంచి రాష్ట్ర పరిధిలోకి వచ్చేటట్టుగా రాష్ట్ర చట్టసభల్లో తీర్మానం చేయాలని అన్నారు ప్రాథమిక పాఠశాల ముక్కలు చేస్తే తల్లిదండ్రులతో, ప్రజలతో ప్రజాతంత్ర పోరాటం చేయడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదనంతరం మండల విద్యాశాఖ అధికారి చల్ల లక్ష్మణ రావు గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట సత్యనారాయణ, బొబ్బిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తేంటుభాస్కర్ రావు ,కోట గోపాలకృష్ణ, ఎం ప్రసాద్ రావు చిన్ని కృష్ణ, సింహాచలం, వెంకటేశ్వరరావు చక్రధర్ పాల్గొన్నారు






AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన

Mohan
APTF Updated at: April 07, 2022

 



AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ నేడు ప్రారంభ రోజు విజయవాడ లెనిన్ సెంటర్ లో డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది. ఏప్రిల్ 7,8,9 తేదీల్లో APSEC భాగస్వామ్య సంఘాలు నిర్దేశించుకున్న మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా శాఖలకు తెల్పడమైనది.         ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సంఘాలు APTF:1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: హృదయ రాజు, కులశేఖర రెడ్డి DTF రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: కృష్ణయ్య , రెండు PDSU రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు రవిచంద్ర, రామకృష్ణ, రాజేష్ , APTF రాష్ట్ర కౌన్సిలర్ బిన్నీ, PDSU నాయకులు పాల్గొన్నారు


ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి!

Mohan
APTF Updated at: October 21, 2021


ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలింపును నిరసిస్తూ  రాష్ట్రంలో ఖళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని  అనంతపురం  డి ఆర్ ఓ గారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా కన్వినర్ జి. రవీంద్ర, ఎపిటిఎఫ్1938, జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యం.వెంకటసుబ్బయ్య, జిల్లా అదనపు ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్, నాయకులు నాగిరెడ్డి, షమీవుల్లా, డి టి ఎఫ్ నాయకులు జార్జి, సాలవేముల బాబు తదితరులు పాల్గొన్నారు.

APSEC ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో నూతన జాతీయ విద్యావిధానం అమలును నిరసిస్తూ నిర్వహించిన బ్యానర్ ప్రదర్శన కార్యక్రమం.

Mohan
APTF Updated at: October 02, 2021

 నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ వద్ద APSEC ,నెల్లూరు ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యానర్ ప్రదర్శన కార్యక్రమం







పై కార్యక్రమంలో పాల్గొన్న APTF,DTF, PDSU,AISF, PDSU కార్య కర్తలు కు ధన్యవాదాలు APSEC,Nellore


------------------------------------------

ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణకమిటీ,ఎపిటిఎఫ్1938,డి టి ఎఫ్ ,పి డి యస్ యు,ఏ ఐ యస్ ఎఫ్,పిడియస్ యు,సమ్యుక్త భాగస్వామ్యంలో స్థానిక్ టవర్ క్లాక్ గాంధీ విగ్రహం ముందు ప్రజా వ్యతిరేక నూతన జాతీయ విద్యావిధానం అమలును నిరసిస్తూ బ్యానర్ ప్రదర్శన జరిపారు.ఈ కార్యక్రమానికి ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కులశేఖరరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ...
‌1)ప్రజా వ్యతిరేక నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయరాదు.
‌2)రాష్ట్రంలో కాళీగా వున్న 23000 ఉపాద్యాయ ఖాళీలు భర్తీ చేయాలి.
3)ప్రాథమిక పాఠశాలల విభజన ఆపేయాలి.  తదితర డిమాడ్లు నినదించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అనంతపురం జిల్లా కన్వీనర్ జి.రవీంద్ర నాయకులు విశ్వనాధరెడ్డి,వెంకటరెడ్డి,వెంకటసుబ్బయ్య,పి.వ ప్రసాద్, శ్రీనివాసనాయక్,గంగిరెడ్డి,ఆంజనేయులు నాయక్,నరసింహులు ,అంకిరెడ్డి,వజీర్,ఆదినారాయణ, పిడుగు శ్రీనివాసులు,నారాయణరెడ్డి, లక్ష్మి నారాయణ ,నాగసైనారెడ్డి, ఫక్రుద్దీన్, రమేష్ రెడ్డి, గోవిందరెడ్డి, రాజ మోహన్ డిటి ఎఫ్ నాయకులు జార్జి,చలివేముల బాబు,పురుశోత్తం,ఫిడి యస్ యు నాయకులు వీరేంద్ర,శంకర్ ఏ ఐ యస్ ఎఫ్ నాయకులు మనోహర్,ఆనంద్ పాల్గొన్నారు


----------------------------------------------------------------------------

ఈ రోజు అనగా 02-10-2021గాంధీజయంతి రోజు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ సమితి పిలుపు మేరకు గిద్దలూరు గాంధీ బొమ్మ కూడలిలో ఏ. పి . టి. ఎఫ్. 1938 రాష్ట్ర కార్యదర్శి యల్లా. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  ఎన్. ఇ. పి. 2020 విద్యా విధానం అమలు చేయరాదని, 23వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలలు విడదీయరాదని డిమాండ్ చేశారు. 







 ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యల్లా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు యస్ హెచ్ కబీర్, జిల్లా కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, మండల నాయకులు వి. రవిశంకర్ డి. వి. పిచ్చయ్య, జి. పాండు, టి. పాండు రంగస్వామి, యం. వి. రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.







ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు-  APSEC  కన్వీనర్ & APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు- APSEC కన్వీనర్ & APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

Mohan
APTF Updated at: August 12, 2021

ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు- బలోపేతం చేయాలి! పువ్వల.ధనంజయ రావు, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణా కమిటీ కన్వీనర్ మరియు APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి
 


నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠశాలలను నిర్వీర్యం చేయడం  మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రాథమిక పాఠశాల నుండి  3 ,4, 5 తరగతుల ను విడదీసి ముక్కలు చేయవద్దని,ప్రాథమిక పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. అంతేకాక  ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 8880 ఉన్నాయని వాటిల్లో ఉపాధ్యాయులను  నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత స్థాయి వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగాలని, సమాంతర మాద్యమాలను కొనసాగించాలని తెలిపారు. కుల వ్యవస్థను ప్రేరేపించే జాతీయ విద్యా విధానాన్ని అందరూ తిరస్కరించాలని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో ఆరు రకాల పాఠశాలను ఏర్పాటు చేయడం, అందులో పాఠశాలను ముక్కలు చేయడం ద్వారా ప్రైమరీ విద్యార్థులు దూరంగా ఉన్న  ఉన్నత పాఠశాలలకి వెళ్ళ లేక బడి మానేసే ప్రమాదం ఉందని తెలిపారు.3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం వల్ల వేరు వేరు సమయ పట్టిక అమలు వలన పరిస్థితి చాలా గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలో కలపడాన్ని, ఉన్నత పాఠశాలలో +2(ఇంటర్మీడియట్)  విద్యను ప్రవేశపెట్టడాన్ని, ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.  పాఠశాలల్లో 20:1 చొప్పున విద్యార్థి  ఉపాధ్యాయ నిష్పత్తి ఉండేలా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని, మెమో 172ను  సవరించాలని కోరుతూ విజయనగరం లో కోట వద్ద  APSEC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో APSEC జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు APTF జిల్లా అధ్యక్షులు డి ఈశ్వర రావు, జిల్లా APTF బాధ్యులు  ఎన్ వి పైడి రాజు, దామోదర నాయుడు, ఎ వి శ్రీనివాస్, పి రాజశేఖరం, శ్రీనివాసరావు, కె మధుసూదన రావు,N కూర్మా రావు ,I Ch. సత్యనారాయణ, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను జయప్రదం చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా శాఖ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాము.

2020 జాతీయ విద్యా విధానం అమలు చేయొద్దు!

Mohan
APTF Updated at: August 12, 2021


కృష్ణాజిల్లా
జాతీయ విద్యావిధానం అమలును నిలుపుదల చేయాలని APSEC నిరసన ప్రదర్శన- కృష్ణాజిల్లా కలెక్టరేట్...ఎదుట
ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చెయ్యొద్దు!
25 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్...

NEP 2020 పై ఏపీ సెక్ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన

Mohan
APTF Updated at: August 12, 2021


ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న APTF రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు,

నేడు (12.8.21) ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ (APSEC) కమిటీ & అఖిల భారత విద్యా హక్కు వేదిక (AIFRTE) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్న APTF రాష్ట్ర అధ్యక్షులు & ఏపిసెక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయరాజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపి లో ప్రాథమిక తరగతులు 3,4,5 లను దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు తరలించడాన్ని మానుకొని ప్రాథమిక విద్యను అన్ని రకాలుగా బలోపేతం చేయాలని... ఒరియా, తమిళ్, కన్నడ, ఉర్దూ, హిందీ తదితర భాషలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో పారాలాల్ మీడియం లను కొనసాగించాలని, ఇప్పటికే ఉన్న ఖాళీలు, పెరిగిన విద్యార్థుల ఎన్రోల్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని 30 వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయుటకు నూతన DSC నోటిఫికేషన్ ను జారీ చేయాలని డిమాండ్ చేశారు.                                              

జి.తిమ్మప్ప ఏపిసెక్ జిల్లా కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో APTF జిల్లా గౌరవాధ్యక్షులు కమలాకర రావు ,జిల్లా ప్రధానకార్యదర్శి ఇస్మాయిల్, APTF నాయకులు రామకృష్ణ,మరియానందం, శేషయ్య, రాంభూపాల్ రెడ్డి,రాఘవరెడ్డి, నరేంద్ర, శ్రీనివాసరెడ్డి,DTF రాష్ట్ర నాయకులు రత్నం యోసేపు, మద్దయ్య, PDSU భాస్కర్, PDSU రాజేష్, IFTU వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఏపి సెక్ భాగస్వామ్య సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

NEP 2020 విద్యారంగంపై దుష్ప్రభావాలపై చిత్తూరు జిల్లా ఏపీటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం

Mohan
APTF Updated at: August 12, 2021


నూతన విద్యా విధానం పై తిరుపతి డివిజన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న జిల్లా సహా అధ్యక్షులు ఎస్ వెంకట ముని పాల్గొన్న తిరుపతి డివిజన్ కన్వీనర్ రవీంద్ర మరియు ఉపాధ్యాయులు

నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద APSEC ఆధ్వర్యంలో NEP2020 ని అమలు చేయవద్దు అని నిరసన

Mohan
APTF Updated at: August 11, 2021

ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద APSEC ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో NEP2020 ని  అమలు చేయవద్దు అని, ఖాళీగా ఉన్న 25000 ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ విద్యార్థులు నిష్పత్తి 1:20 గా ఉండాలని మాతృ భాష లో ప్రాధమిక విద్య భోధన జరగాలి అనే డిమాండ్ల సాధన కు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారి లో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి గారు ,APTF Ex రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ K.వెంకటేశ్వరరావు గారు DTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమణయ్య గారు APTF రాష్ట్ర కార్యదర్శి శ్రీ S.చిరంజీవి గారు Advocate శ్రీ శివశంకర్ గారు PDSU సంఘం నాయకులు శ్రీ సునీల్ గారు APSEC జిల్లా కన్వీనర్ M.పిచ్చి బాబు, APTF మాజీ జిల్లా అధ్యక్షులు G.రమణయ్య గారు మరియు APTF నాయకులు sk.సుభాన్ గారు, Y జనార్ధన్ రావు గారు B.కోటేశ్వరరావు గారు, S.వెంకటేశ్వర్లు గారు, B.గణపతి గారు,Sk.ఖాదర్ భాష గారు, R. రఘు గారు శ్రీ నరసింహ రెడ్డి గారు.O. శ్రీనివాసులు గారు శ్రీ రామ మోహన్ గారు A.శ్రీనివాసులు గారు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.

పోరాట యోధుడు వై ఆర్ కె ప్రసాద్ .. సంతాప సభలో వక్తలు

Mohan
APTF Updated at: June 24, 2021

ప్రభుత్వం విడుదల చేసిన 172 సర్క్యులరును రద్దు చేయాలి :: APSEC డిమాండ్.

Mohan
APTF Updated at: June 15, 2021


    ప్రాథమికవిద్యను సర్వనాశనం చేస్తున్న 172 సర్క్యులరును రద్దుచేసి ప్రాథమిక తరగతులను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా విద్యా శాఖ అధికారికి, జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈకార్యక్రమములో కర్నూల్ జిల్లా కన్వీనర్ గట్టుతిమ్మప్ప, కొకన్వీనర్ ఇస్మాయిల్, ఎపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, జిల్లాప్రధానకార్యదర్శి మాధవస్వామి, డిటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రత్నం ఏసేపు, పత్రిక సంపాదకులు కిషోర్, పిడిఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్,APTF నాయకులు గఫార్,జి. శ్రీనివాసరెడ్డి, హబీబుల్ల, యస్.శ్రీనివాస రెడ్డి లు పాల్గొన్నారు

NEP:20 ను వ్యతిరేకిస్తూ వివిధ జిల్లాల్లో APTF , APSEC నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాలు

Mohan
APTF Updated at: December 01, 2020

 

విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు నూతన జాతీయ విద్యా విధానంలోని సవరణలు కోరుతూ పొట్టిశ్రీరాములు కూడలి శ్రీకాకుళం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీటీఎఫ్ శ్రేణులు

చిత్తూర్ జిల్లా పుత్తూరు డివిజన్ లో NEP:20 ని వ్యతిరేకుస్తూ APTF కార్యకర్తలు

ప్రకాశం భవన్ ఎదురు నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్,పాల్గొన్న ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నాయకులు



అఖిలభారత విద్యా హక్కుల వేదిక (AIFRTE) పిలుపుమేరకు నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సాయంత్రం గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏపిటిఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరసింహారావు జిల్లా ఉపాధ్యక్షులు పి రమేష్ కుమార్ నగర ప్రధాన కార్యదర్శి ఏ జోజప్ప, PDSU గని తదితరులు.



ఆర్ట్స్ కళాశాల వద్ద NEP:20 వ్యతిరేకంగా APSEC, AIFRTE ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలోAPTF(1938) DTF,PDSU,AISF, PDSU సంఘాలకు సంబంధించిన పలువురు కార్యకర్తలు తమ నిరసనను తెలియజేశారు.నూతన విద్యా విధానము భవిష్యత్ అవసరాలను తీర్ఛలేదని, విశ్వవిద్యాలయాల హక్కులను నిర్వీర్యం చేస్తుందని APTF జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వి.వి.సత్యనారాయణ గారు అన్నారు. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు శ్రీ Y.R.K. ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రమోషన్లలో సీనియారిటీని గుర్తించాలని, రిజర్వేషన్లను కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి శ్రీ అప్పయ్య శాస్త్రి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్ధి వ్యతిరేఖ విధానాన్ని విడనాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో M. సత్యనారాయణ గారు,K.B.R.V.శాస్త్రి గారు, రామలింగ శాస్త్రి గారు,N.G.శంకర్ గారు,S.రామారావు గారు, డేవిడ్ లివింగ్ స్టన్ గారు,ఉదయ బ్రహ్మం గారు పాల్గొన్నారు....












నూతన జాతీయవిద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద ఎపిసెక్ నిరసన

Mohan
APTF Updated at: November 29, 2020

నూతన జాతీయవిద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద ఎపిసెక్ నిరసన, పాల్గొన్న ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.వెంకటేశ్వర రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మోహన్ దాస్,రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజివి,ఎపిసెక్ జిల్లా కన్వీనర్‌ ఎం.పిచ్చిబాబు,జిల్లా గౌరవాధ్యక్షులు శివరామిరెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుల్ఫికర్ అలీ,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బి.తిరుపతి రెడ్డి, జిల్లా అకాడమిక్ కమిటీ సభ్యులు ఖాదర్ భాషా రాష్ట్ర కౌన్సిలర్లు వై.వెంకటేశ్వర్లు,ఎం.శీనయ్య,ఎ‌.రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి గణపతి ఆర్ సుధాకర్ ఇంకా అనేక మంది ఫెడరేషన్ కార్యకర్తలు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు

ప్రొll ఆనంద్ తేల్దుంబ్డే అరెస్టును ఖండిస్తూ వారి వారి గృహాలలో నిరసన తెలియజేస్తున్న APTF , APSEC

Mohan
APTF Updated at: April 06, 2020

ప్రొఫెసర్llఆనంద్ తేల్దుంబ్డే పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని,ఈరోజు వారి అరెస్టును ఖండిస్తూ వారి వారి గృహాలలో నిరసన తెలియజేస్తున్న ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారు.ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావుగారు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.హృదయరాజుగారు మరియు రాష్ట్ర గౌllఅధ్యక్షులు ఎ.సదాశివరావుగారు

ఏపిటిఎఫ్ రాష్ట్ర గౌllఅధ్యక్షులు ఎ.సదాశివరావుగారు


ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావుగారు


ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.హృదయరాజుగారు


ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారు


APSEC  కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు


APSEC Response to Draft NEP 2019 (Kasturirangan Report) on School Education Section

APSEC Response to Draft NEP 2019 (Kasturirangan Report) on School Education Section

Mohan
APTF Updated at: August 03, 2019


Andhra Pradesh Save Education Committee is a forum of students’, teachers’ organisations and interested individuals to achieve constitutional goals in the field of education. We have been working for four decades and a foundig member organisation of All India Forum for Right to Education. We would like to submit few lines as our response to ‘Draft NEP – 2019’.

The report though speaks about equality and equal opportunity, very conspicuously, the entire report does not find place for two critical words ‘secularism and socialism’. Though they were not in the original constitution, they are very much now in the constitution. Those ideas were product of long drawn reform and independence movements of this country. The reform movement was against casteism and patriarchy. Working class movement for socialism was a very strong component of our independence struggle. Commission cannot wish away this whole history. Further, though the report recommended for quality education to all social sections, it has conspicuously avoided the popular phrase ‘social justice’ reducing the whole concept of social justice to one of benevolent act of good rulers. Though the report speaks of diversity in culture and language widely, in certain areas of the report, it sounds clearly, as if India has a monolithic, something static and unchanged culture for ages and throughout the length and breadth of the nation and for rulers and ruled.. This idea could effectively lead to fascist regimentation of thought. The report speaks of traditions without any qualifications. Many old traditions were built on the basis of caste system, hierarchy and patriarchy. The report also seeks highest centralization of power. We appeal to the government to reject all recommendations that lead to centralization of power and regimentation of thought and we suggest that our education system should include all diversities and exclude all inequalities and stand for constitutional values – liberty, freedom, equality, equal opportunity, democracy, secularism, socialism and social justice - firmly.
1.      The report invited philanthropic organisations to establish and administer educational institutions while opposing commercialization of education. But the report allowed collection of fee, enhancement of fee time to time and opposed any possible regulation by the government. We request government to make proper demarcation between ‘for profit’ bodies and philanthropic organisations. This is possible only when collection of tuition fee and charges against goods and services that are being provided in educational institutions is completely banned. We appeal the government to establish fully funded public education system from KG to PG on the basis of constitutional values.

2.      We strongly oppose the recommendation of the report to allow the religious organizations to establish and administer schools and colleges except for exemptions as provided in the constitution. Religions cannot serve any program to spread knowledge. The epoch making modern writer Gurajada Apparao told a century ago that education and religion cannot go together. To paraphrase …  “All religions would perish and knowledge would flourish”

3.      The report while has recommended for the widening of the Right To Education Act to cover both pre-school and secondary school, ie from age 3 to 18 years did not take care to cleanse the Act from the muck of provisions that allow non philanthropic bodies to establish and administer schools. Further, the recommendations which may weaken the provisions for infrastructure play grounds, amenities, PTR, vicinity norms may be rejected by the government. The ‘outcome’ approach - which replace ‘inputs’ by ‘outcomes’ and played havoc with education in different countries according to the UNESCO Report 2017 -  may be rejected.

4.      We welcome the recommendation of the report which suggested that all necessary student support measures including food, accommodation, health services and remedial coaching for 100% enrollment and 100% retention of children up to age 18 or class 12.

5.      We also welcome continuation of non-detention policy at elementary level along with census examinations.

6.      We welcome the recommendations of the report to abolish contract system and appoint teachers only on regular basis and not to involve teachers in non-academic work.

7.      The report suggested that there shall be 5 + 3 + 3 + 4 school system. Actually there is nothing wrong with the existing 10+2 system. With addition of Pre-School, it shall become 3 + 10 + 2. The sub division in school education may be left to states. Further the 10 years may be considered as elementary education with all compulsory subjects and the 2 years may be considered as secondary education where students shall have choice between cognitive, technical, industrial and vocational courses while all will have social science component. 

8.       The recommendation of the Kasturirangan Report to introduce optional papers and vocational courses from class IX is not suggestible. Not only that it would become impractical but also deny sufficient knowledge in necessary subjects like social sciences, natural sciences and mathematics to the children who opt vocational courses or studies in extra languages. Further the combination of optional papers and vocational courses may lead to early class division in the students where the poor and disadvantaged opt for or pursued to opt for vocational courses while the rest opt cognitive papers.

9.      The recommendation to introduce semester system as early as in class IX is neither suggestible. It would prove highly restrictive and causes loss of freedom for the teacher and student to choose among pedagogical practices and planning of academic and non academic activities.

10.  It is to be recognized that the eligibility of child to learn languages is limited to the languages in the neighborhood. The over ambitious recommendation to teach many a languages to the child may be rejected. Mother tongue and English suffice for the students. The students from tribal families, whose mother tongue is not listed in Schedule VIII have an additional burden of learning regional language which is not their mother tongue.

11.  Imposition of Hindi in non Hindi speaking states could cause disunity among the people of the country. Further, introduction of Sanskrit, Pali, Arabic and other classical languages and foreign languages as optional subjects is neither useful nor suggestible. Again, the two years course in languages between class 6th and 8th is neither suggestible at this age.  The student shall not be burdened to learn more languages which are not in their neighborhood.

12.  The Kasturirangan Report recommended for mother tongue as a medium of education minimum up to class 5 and if possible up to class 8. We strongly recommend for implementation of mother tongue as the medium of education up to class 12. If the language of the child is not listed in Schedule VIII, regional language may be used as medium of education from class 3. However, we welcome the recommendation to introduce English technical words in parallel from class 6.

13.   Education shall be reverted to state list.

14.  We strongly oppose the recommendation of the Kasturirangan report which suggests central curricula and central text books. States (governments and people) shall have the right to formulate their own curricula and write text books for their schools. NCERT may produce a model curricula and text books. The states shall have the right to develop curricula and text books for themselves. All that is contradictory in the Kasturirangan report to these federal rights of the states may be rejected.

15.  We strongly oppose the idea of strengthening of National Testing Agency. This would create a centralizing effect. We suggest that the available opportunities in prestigious institutions established and administered by central government may be distributed among states on some legitimate basis and the selection of the students shall be on the basis of the qualifying examination in the state or a competitive exam conducted by the state.

16.  We strongly appeal the government to introduce common school system up to class 12. It shall be publicly funded, managed in a decentralized and participative democratic mode and it shall include all diversities and excludes all inequalities. The common school shall provide equal and quality education to all children without any cost whatsoever. All necessary student support measures be taken up to ensure 100% enrolment and retention of the children. It shall be built on constitutional values of the land for the enlightenment of the child (not only career) and progress (not only GDP growth) of the county. School education shall have the first right on the public exchequer.

We demand the government to reject the Kasturirangan ‘Draft national Education policy 2019’ which is based on centralization of power, cultural hegemony in all dimensions of caste, community, language, culture, gender while allowing commercialization of education from the back door. We demand the subject education be shifted back to State List where the states will have the right to formulate their education policy on the basis of constitutional values.

Thanking you,
Sincerely yours,


D. Ramesh Patnaik,          Convener, APSEC


K Venkateswara Rao,       President, APTF (1938)


N. V Ramanaiah               Gen. Secretary, DTF


M. Ramakrishna                President         PDSU


G. Ranganna                     State Secretary, AISF


A Ravichandra                  President         PDSU             




విద్యారంగ పరిరక్షణపై రమేష్ పట్నాయక్ గారు రాసిన ఈ వ్యాసాన్ని ఉపాధ్యాయ, సామాజిక అభ్యుదయ వాదులు, మిత్రులందరూ చదవాల్సిన అవసరం వుంది.

Mohan
APTF Updated at: July 11, 2019


2019 .2020 సంవత్సరాన్ని విద్యా సామర్ధ్యాల హామీ సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించాలి విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమ రాష్ట్ర సమన్వయకర్త డి ప్రకాష్ పిలుపు

Mohan
APTF Updated at: April 23, 2019

2019 .2020 సంవత్సరాన్ని విద్యా సామర్ధ్యాల హామీ సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించాలి
విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమ రాష్ట్ర సమన్వయకర్త డి ప్రకాష్ పిలుపునిచ్చారు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో లో టి పి టి ఎఫ్ ఉపాధ్యాయ భవనంలో లో జిల్లా విద్యా సామర్ధ్యాల సాధన ఉద్యమ సంస్థ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లో రాష్ట్ర సమన్వయకర్త డి ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 20 సంవత్సరాన్ని హామీ విద్యా సంవత్సరం గా ప్రకటించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో లో విద్యార్థుల కు విద్యా సమర్థులు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం వన్ సర్వే సర్వే ఆధారంగా అ సర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లో 80% పిల్లలకు తరగతి వారీగా విద్యా సామర్థ్యాలు లేవు అన్నారు విద్యా సామర్థ్యాలు లోపిస్తే మరెంతో అసమానతలకు పెరిగే అవకాశం ఉందన్నారు రాష్ట్రస్థాయిలో విద్యా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు స్వయంప్రతిపత్తిగల విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ జన వాని సంస్థ   డైరెక్టర్ జెర్రీ ప్రతాప్ సి ఎల్ వో జిల్లా కన్వీనర్ అంజమ్మ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి  పెద్ద లింగన్న గారి శంకర్ గారు డి బిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముత్యాల భూపాల్ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి బైరి చంద్రశేఖర్ హారతి సంస్థ అధ్యక్షురాలు జంగ విజయ రెడ్డి డి బిఎఫ్ జిల్లా నాయకులు వినయ్ కిరణ్ రవి శేఖర్ సి సి జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్ పాల్గొన్నారు

కామన్ స్కూల్ సిస్టమ్ కొరకు డిల్లీ లో హూంకార్ ర్యాలీ

Mohan
APTF Updated at: February 18, 2019

HUNKAR RALLY & DHARNA PICS IN DELHI  TODAY 18 -2-2019 AGAINST CENTRAL GOVERNMENT EDUCATION STRATEGY. PARTICIPATION OF APTF CADRE AS SHARE HOLDER ORGANISATION






















Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |