👆 *APTF(1938) VZM*
గత కొన్ని రోజుల నుండి రైతులకు ,కార్మికులకు బకాయిలు చెల్లింపు మరియు ఫ్యాక్టరీ కొనసాగింపు విషయమై విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ncs sugars వద్ద రైతు సంఘాల , శ్రీరామ సుగర్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూనే ఉన్నాయి.
ఈ రోజు (19.12.2021) ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 విజయనగరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పువ్వల ధనుంజయ రావు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా శిబిరాన్ని ఉద్దేశించి యాజమాన్యం, ప్రభుత్వం కలగజేసుకుని రైతులు, ఉద్యోగులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని ,ఫ్యాక్టరీని కొనసాగించాలని తెలియజేయడమైనది. ఈ శిబిరానికి సంఘీభావం తెలియజేయడమైనది.