రాష్ట్రంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో తత్సమాన కోర్సు ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేయా లని సూచించారు. విజయవాడలోని పీఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, కడపలోని రాయల సీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, గుం టూరులోని వావిలాల సంస్థను శిక్షణా కేంద్రా లుగా ఎంపిక చేశామన్నారు. వచ్చే నెల 1 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను శిక్షణ కేంద్రాల ప్రిన్సిపాల్స్కు అందజేయాలని సూచించారు.