శ్రీహరికోట, న్యూస్టుడే: స్పేస్ టెక్నాలజీ, సైన్సు, అప్లికేషన్లపై ప్రాథ మిక జ్ఞానాన్ని అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)-2022కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖా స్తులను ఏప్రిల్ 10వ తేదీలోగా పంపాల్సి ఉంది. యువికా వేసవి సెల వుల్లో మే 16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మార్చి ఒకటి 2022 నాటికి 9వ తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థులను కార్య క్రమానికి ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు isro.gov.in వెబ్సై ట్ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు