ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి కి APTF ప్రాతినిధ్యం
రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన 26 జిల్లా కేంద్రాల్లో 2022 పదో తరగతి పరీక్షా పత్రాల స్పాట్ వాల్యూయేషన్ జరపాలని ఆ మేరకు నేటి నుంచి ఏర్పాట్లు చేయాలని APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, కె. కులశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా మహమ్మారి కారణంగా 2021 - 22 విద్యా సంవత్సరం ఆలస్యమయ్యి పది పబ్లిక్ పరీక్షల అనంతరం మే 13 నుండి విపరీతమైన ఉష్ణోగ్రతల్లో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహిస్తున్న కారణంగా ఉపాధ్యాయుల శ్రేయస్సు దృష్ట్యా పాత 13 జిల్లా కేంద్రాలు కాకుండా ఇప్పటికే విభజన చేయబడిన వాటితో పాటు అన్ని 26 జిల్లాల కేంద్రాల్లో పది మూల్యాంకనం నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవనంద రెడ్డి గారికి APTF ప్రాతినిధ్యం చేసింది.