AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ నేడు ప్రారంభ రోజు విజయవాడ లెనిన్ సెంటర్ లో డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది. ఏప్రిల్ 7,8,9 తేదీల్లో APSEC భాగస్వామ్య సంఘాలు నిర్దేశించుకున్న మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా శాఖలకు తెల్పడమైనది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సంఘాలు APTF:1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: హృదయ రాజు, కులశేఖర రెడ్డి DTF రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: కృష్ణయ్య , రెండు PDSU రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు రవిచంద్ర, రామకృష్ణ, రాజేష్ , APTF రాష్ట్ర కౌన్సిలర్ బిన్నీ, PDSU నాయకులు పాల్గొన్నారు