ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు... విద్యా పరిరక్షణ సమితి ఏ పి టి ఎఫ్ బొబ్బిలి....... అప్రజాస్వామిక ,విద్యా ప్రతిబంధక నూతన విద్యా విధానాన్ని 2020 ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ వ్యతిరేకిస్తుంది .ఈరోజు బొబ్బిలి విద్యావనరుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 నిరసన తెలియజేసింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చప్పా వెంకటరమణ మాట్లాడుతూ 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల వరకు తరలించే జిఓ నెంబర్ 85 ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 ఉండాలని, ఉన్నత పాఠశాలలో రెండు మాధ్యమాలను కొనసాగించాలని, 4674 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 37 రద్దు చేయాలని ,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యను ఉన్నది జాబితానుంచి రాష్ట్ర పరిధిలోకి వచ్చేటట్టుగా రాష్ట్ర చట్టసభల్లో తీర్మానం చేయాలని అన్నారు ప్రాథమిక పాఠశాల ముక్కలు చేస్తే తల్లిదండ్రులతో, ప్రజలతో ప్రజాతంత్ర పోరాటం చేయడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదనంతరం మండల విద్యాశాఖ అధికారి చల్ల లక్ష్మణ రావు గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట సత్యనారాయణ, బొబ్బిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తేంటుభాస్కర్ రావు ,కోట గోపాలకృష్ణ, ఎం ప్రసాద్ రావు చిన్ని కృష్ణ, సింహాచలం, వెంకటేశ్వరరావు చక్రధర్ పాల్గొన్నారు
