ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆ సంఘ అధ్యక్షుడు హృదయరాజు, నెల్లూరులో జరిగిన నిరసనలో ప్రధాన కార్యదర్శి చిరంజీవి పాల్గొన్నారు. ధర్నాల్లో వారు మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదు’ అని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన దృశ్యాలు