గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఐదు పాయింట్లు కేటాయించగా .. జిల్లాస్థాయి నాయకులకు తొలగించారు . గతంలో వీరికీ ఇచ్చేవారు .
ఖాళీలు బ్లాక్ .. బదిలీల్లో కేటగిరీ -1 , 2 , 3 లోని ఖాళీలను బ్లాక్ చేస్తారు . ఉదాహరణకు ఒక ఉమ్మడి జిల్లాలో 5 వేల ఎస్జీటీ పోస్టులు ఉండగా .. వీటిల్లో 4,500 మంది పనిచేస్తుంటే .. మిగతా 500 పోస్టులను బ్లాక్ చేస్తారు . ఆగస్టు 31 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను బదిలీలకు ప్రామాణికంగా తీసుకుంటారు .
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ( గ్రేడ్ -2 ) బదిలీలకు ప్రాంతీయ స్థాయిలో కమిటీ ఉంటుంది . జిల్లా పరిషత్తు ప్రధానోపాధ్యాయులకు జిల్లా పరిషత్తు చైర్మన్ లేదా ప్రత్యేక అధికారి చైర్మన్ గా ఉంటారు . జడ్పీ సీఈఓ , డీఈఓ సభ్యులుగా , ఆర్జేడీ కన్వీనర్గా వ్యవహరిస్తారు . ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు కలెక్టర్ లేదా జేసీ ఛైర్మన్ గా ఉంటారు .