2021-22 నాటికి ప్రధానోపాధ్యాయులు ఐదు , ఉపాధ్యాయులు ఎనిమిది విద్యాసంవత్సరాల సర్వీసు పూర్తిచేస్తే తప్పనిసరిగా బదిలీ ఉంటుంది .
* 2024 ఆగస్టు 31 కి ముందు పదవీవిరమణ పొందే ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది .
జీరో సర్వీసు ఉన్నవారు అభ్యర్థన ( రిక్వెస్ట్ ) బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు
బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు . అక్కడ ఉపాధ్యాయినులు లేకపోతే 50 ఏళ్లు దాటినవారినే నియమిస్తారు .
* పాఠశాలలో ఖాళీ పోస్టు ఉండి , హేతుబద్ధీకరణలో మిగులుగా తేలితే ఇతర ఉపాధ్యాయులపై ప్రభావం ఉండదు . పాఠశాలను మ్యాపింగ్ చేసి , హేతుబద్ధీకరణలో పోస్టు మిగులుగా గుర్తిస్తే మొదట సీనియర్ టీచర్కు బదిలీకి అవకాశం కల్పిస్తారు . లేదంటే అందరికంటే జూనియర్ టీచర్ను బదిలీ చేసి , వారికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు .
2020 లో బదిలీ అయ్యి , ఇప్పుడు హేతుబద్ధీకరణకు గురవుతున్న వారికి పాత పాఠశాల పాయింట్లు ఇస్తారు .
ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచే ఎయిడెడ్ టీచర్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు .
హేతుబద్ధీకరణకు గురయ్యేవారిలో 80 % కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఉంటే సీనియర్ను బదిలీ చేస్తారు .
80 % కంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది . దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు .
* * 2021 అక్టోబరు 14 న పదోన్నతులు పొందినవారు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి . వారి పోస్టులను ఖాళీగా చూపుతారు . ** * ఐటీడీఏయేతర ప్రాంతంవారు ఐటీడీఏ ప్రాంతంలో పనిచేస్తుంటే బదిలీలకు అనుమతిస్తారు . కానీ , ఆ స్థానానికి ఎవరైనా వస్తేనే రిలీవ్ చేస్తారు . ఐటీడీఏ ప్రాంతంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉంటే బదిలీలు పూర్తయ్యాక జూనియర్ టీచర్ను డిప్యూటేషన్పై వేస్తారు . బదిలీలు పూర్తయిన వారంరోజుల్లో పని సర్దుబాటు పూర్తిచేస్తారు