మిగులు అందరికీ ప్రత్యేక పాయింట్లు
దివ్యాంగులకు మరిన్ని వెసులుబాట్లు
తాజా మార్గదర్శకాలు ఇవే
ఉపాధ్యాయుల పునర్విభజన కారణంగా మిగులుగా తేలిన వారందరికీ ఐదు ప్రత్యేక పాయింట్లు కేటాయించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం హైస్కూళ్లలో 3,4,5 తరగతుల విలీనం కారణంగా మిగులుగా తేలిన టీచర్లకు మాత్రమే ఈ పాయింట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఉపాధ్యాయుల్లో ఆందోళనతో మిగులుగా తేలిన అందరికీ ఈ పాయింట్లు వర్తింపు చేస్తున్నారు.
దివ్యాంగుల్లో కొందరికి మినహాయింపు
బదిలీల్లో తాజా మార్గదర్శకాల్లో దివ్యాంగ టీచర్లకు ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు ప్రకటించింది. 40 అంతకంటే ఎక్కువ దృష్టిలోపం ఉన్నవారు, 80శాతంపైన శారీరక అంగవైకల్యం కలిగిన వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే బదిలీ కోసం రెండు లోపాలున్న టీచర్లు దరఖాస్తు చేసుకుంటే వారికి లభించే పాయింట్లు లేదా ప్రాధాన్యత కేటగిరీల్లో స్థానాలు కోరుకొనే అవకాశం కల్పించారు.
ఉద్యోగోన్నతి పొందిన వారికి ఊరట
తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారికి కూడా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. 2021 అక్టోబరులో ఉద్యోగోన్నతి పొందిన హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. వారందరూ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే తాజాగా వీరికి ప్రత్యేక పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీ వర్తింపజేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట జారీచేసిన ఉత్తర్వుల్లో వీరికి ఎటువంటి రాయితీలు లేవు. ప్రస్తుతం కల్పించారు. వీరికి 2021 అడ్‌హక్ ఉద్యోగోన్నతుల్లో ఇచ్చిన స్థానాలను ఖాళీగా ప్రకటించమన్నారు. వీరిలో 2024 ఆగస్టు 31లోపు పదవీ విరమణ చేసే హెచ్‌ఎంలు, ఎస్‌ఏలకు ప్రస్తుత బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చి వారు కోరుకున్న స్థానాల్లోనే కొనసాగిస్తారు.
హైస్కూళ్లకు ప్రాధాన్యం
కోర్టుకు వెళ్లిన వారికి ఊరట