రాష్ట్రంలో ఆరు రకాల పాఠశాలల పేరుతో నామ ఫలకాలను (బోర్డు) ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 2021-22 నుంచే ఆరు రకాల పాఠశాలలను తీసుకొచ్చినా అవి కాగితాల్లోనే ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోనే బోర్డులు ఉన్న విషయం విదితమే. ఇప్పుడు ... పూర్వప్రాథమిక విద్య(పీపీ)-1,2 ఉండే వాటిని అంగన్ వాడీలను శాటిలైట్ ఫౌండేషనల్ పాఠశాలగా, పూర్వప్రాథమిక విద్య-1,2తో పాటు ఒకటి, రెండు తరగతులను ఫౌండేషనల్ స్కూల్‌గా, పీపీ-1,2, ఒకటి నుంచి ఐదు తరగతులను ఫౌండేషనల్ స్కూల్ ప్లస్‌గా, మూడు నుంచి ఏడు లేదా ఎనిమిది తరగతులు ఉండే వాటిని ప్రీ హైస్కూల్‌గా, 3-10 తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలుగా, 3-12తరగతులు ఉంటే హైస్కూల్ ప్లస్‌గా పిలుస్తారు. ఆ మేరకు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.