ప్రముఖ కవి, సంస్కర్త యోగివేమన జయంతిని ఏటా జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, జిల్లా కలెక్టరేట్లలో యోగివేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించి అన్ని శాఖలకూ పంపించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖను ఆదేశించింది