ప్రాయోజిత సమాచారం
ఎపిటీఎఫ్ 1938
Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...
👇👇👇👇👇
- 1. PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి లాస్ట్ year PAN no. తప్పు గా enter చేసి, దాదాపు చాలా మంది teacher వాళ్ల వి జనవరి TDS AMOUNT, government direct credit PRC salaries veyadam వల్ల వేరే వాళ్ళ pan card ki tax జమ కావడం జరిగింది..
- 2.) E-FILING పోర్టల్ నుండి AIR (annual information report)లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి ( FD, saving Bank account interest).
- 3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి, ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి.
- 4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి.
- 5.) House loan , joint account ఉంటే 50-50 share చేసుకోవాలి. లేక పోతే 25-75 చేసుకోవాలి.
- 6.) ఇదే సూత్రం interest మరియు, principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి.
- 7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ కూడా 80C పరిధిలో ఉంటుంది.
- 8.) NPS state government employee అయితే proof అవసరం లేదు, అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి.
- 9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి.
- 10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents సదరన్ latest ఇవ్వాలి..
- 11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి. దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ.
- 12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి..,
- 13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి..
- 14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి. తద్వారా online Form-16. Generate అవుతుంది. మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి. ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది.
- 15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి. ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి. తేడా tax కొరకు.
అలాగే.....
10E గురించి పూర్తి సమాచారం తెలుసుకుoదం ...
అసలు 10E అంటే ఏమిటి, ఎవరు File చేయడానికి అర్హులు, ఎందుకు చేయాలి. ఎలా చేయాలో తెలుసుకుందాము.
10E అంటే section 89(1) కింద tax రిలీఫ్ (refund) కోరడం.. అంటే గత సంవత్సరం లో రావాల్సిన బకాయిలను (SALARY/DA/PRC/IR HPL/ Ect...)....ఈ సంవత్సరంలో తీసుకోవడము వలన మనం కట్టె tax పరిధి 5%నుండి 20% కి & 20% నుండి 30% పెరిగిన సందర్భం లో E-filing చేసే కంటే ముందే 10E file చేయవలెను. దీనికి ముందే tax calculation ఫార్ములా ప్రకారం చేసి పెట్టుకోవాలి. దీని కోసం గత సంవత్సరం Form-16 తప్పనిసరిగా దగ్గర ఉండాలి, అప్పుడే మనం 10E చేసుకోవాలి .