APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori CPS INFO
Showing posts with label CPS INFO. Show all posts
Showing posts with label CPS INFO. Show all posts
 CPS PARTIAL WITHDRAWAL     చిన్న విశ్లేషణ

CPS PARTIAL WITHDRAWAL చిన్న విశ్లేషణ

Mohan
APTF Updated at: November 26, 2022


👉 విత్డ్రావాల్ చేస్తే ఎంత వస్తుంది?


మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా


Example-A అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలుఉన్నవిఅనుకుంటే


ఇందులో రెండు లక్షలు cps  ఎర్నింగ్స్ అనుకో


మిగతా 8 లక్షల లో  A అనే ఎంప్లాయి వాట నాలుగు లక్షలు ప్రభుత్వ వాటా నాలుగు లక్షలు.


A అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్డ్రా చేసుకోవచ్చు.( A అనే  ఎంప్లాయ్ వాటాలో 1% నుంచి మాక్సిమం 25% వరకు విత్ డ్రా చేసుకునే  అవకాశం ఉన్నది).


👉 *సి పిఎస్ ఎంప్లాయిస్ విత్డ్రా

చేసుకోవచ్చా!* 


1. ప్రభుత్వాలు  సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు


2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యి ,ఏదారి దొరకనప్పుడు


ఎందుకంటే 


ఈ విత్డ్రా ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అంటే సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న అందుకు,

ఏదో సిపిఎస్ ఉద్యోగులకు మంచి చేస్తున్నట్టు ఇచ్చారు.


Gpf వారికి జిపిఎఫ్ లో విత్డ్రా అవకాశం ఉంది కాబట్టి మనకు ఇచ్చారు.కానీ జిపిఎఫ్ వారికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మన సి పి ఎస్ ఎంప్లాయిస్ కి మన పెట్టుబడే మన ఫెంక్షన్.


మన  అమౌంట్( 10%+10%)షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.


ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది.

ప్రైవేట్ employees కి 200000 లక్షల వరకూ,  tax benefits అంటే,  40000 వరకు పన్ను ఆదా...

NPS కూడా mutual funds మాదిరి గానే.....మనం monitor చేయవలసిన అవసరం లేదు,  fund మేనేజర్ లు చూసుకుంటారు., కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధత కన్పిస్తోంది..ఇది పూర్తిగా pension plan, atal పెన్షన్ యోజన. లాగా,  NPS అదనపు benefits ఏమిటి అంటే,  80CCD(1B)..


మన పెట్టుబడిని  ఉపసంహరణ ఇస్తే ఆ మేర earnings(భవిష్యత్తులో CPS ద్వార వచ్చే పెన్షన్)  కూడా తగ్గుతాయి.


తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు

చనిపోయిన సిపియస్ ఉద్యోగుల నామినీలకు CPS amount చెల్లించుటకు ట్రెజరీ ఆఫీసర్స్ కు సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన DTA.

Mohan
APTF Updated at: December 28, 2021

 సర్వీసు నుంచి రిటైర్ అయి సిపిఎస్ ఫండ్స్ విత్ డ్రా చేసుకోకుండా చనిపోయిన సిపియస్ ఉద్యోగుల నామినీలకు CPS amount చెల్లించుటకు ట్రెజరీ ఆఫీసర్స్ కు సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన DTA.








CPS :: Enhancement of Lump sum Withdrawal limit on Exit..

Mohan
APTF Updated at: September 28, 2021

Subject: Enhancement of Lump sum Withdrawal limit on Exit..

CPS ఉద్యోగి అనారోగ్య కారణం చేత మధ్యలో పదవీ విరమణ చేసినప్పుడు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పుడు PRAN ఖాతాలో జమ అయిన మొత్తం 2.00 - 50.00 లక్షల లోపు ఉంటే  అమౌంట్ మొత్తం తీసుకోవచ్చని PFRDA/ NSDL సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది.
PFRDA/2021/41/SUP-ASP/06 DT:21-09-2021

AP Family Pension latest Instructions

AP Family Pension latest Instructions

Mohan
APTF Updated at: November 17, 2020

   .AP Family Pension latest Instructions


Click Here to Download .AP Family Pension latest Instructions




జిల్లాల వారీగా  అసంపూర్తి వివరాలు గల CPS ఖాతాదారులు లిస్టు

జిల్లాల వారీగా అసంపూర్తి వివరాలు గల CPS ఖాతాదారులు లిస్టు

Mohan
APTF Updated at: August 24, 2020

 13 జిల్లాల వారీగా CPS ఖాతాదారులు వివరాలు

  1. జిల్లాల వారీగా జాబితా ఈ కింది లింకు నందు కలవు
  2. ఈ జాబితా లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోగలరు
  3. వీటిని సరిచేసుకోవడానికి S2 ఫారం ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది


▪️ ఈ జాబితా లో మీ పేరు ఉన్నదో చెక్ చేసుకొనుటకు కింది లింకుల పై నొక్కండి


  • బ్యాంకు ఎకౌంటు లేని వారివి

  • మొబైల్ నెంబర్ లేనివారు 

  • E Mail ID లేని వారివి

  • PAN Number జతచేయని 

  • Nomination లేనివి

  • S2 Form

CPS/ NPS Subscribers have to update PAN number in PRAN ACCOUNT

CPS/ NPS Subscribers have to update PAN number in PRAN ACCOUNT

Mohan
APTF Updated at: July 12, 2020


As per the amendments made under Prevention of Money-Laundering (Maintenance of Records) Second Amendment Rules, 2019, PAN or Form 60 is mandatory under NPS. Accordingly, All CPS Subscribers have to update PAN or Form 60 (for the current Financial Year) in their NPS/CPS account. Detailed step by step guide on How to update PAN or Form 60 or Offline Method for Updating PAN / Form 60 in CPS NPS PRAN ACCOUNT is given below.

CPS/ NPS Subscribers have to update PAN number in PRAN ACCOUNT
There are three methods of updating the PAN Number in CPS-PRAN Account. 1. Online by accessing CRA Website and updating. 2. Updating Form 60 in PRAN account and 3. Offline Mode.
Update PAN or Form 60 in your PRAN either through Online Mode (instantly in a paperless manner by accessing CRA system) or through Offline Mode (by submission of physical request to Nodal Office/POP). Steps for both the alternatives are mentioned below:

A. Online by accessing CRA Website
I. Steps for updation of PAN:
  1. Login to CRA website (www.cra-nsdl.com) using login credentials (PRAN as User ID & Password).
  2. Click on ‘Update Personal Details’ under ‘Demographic changes’ menu and select ‘Add/ Update Permanent Account Number (PAN)/Form-60’.
  3. Select ‘Permanent Account Number (PAN)’ under ‘Add/ Update PAN/Form-60’ option.
  4. Enter PAN and click ‘Generate OTP’. OTP will be sent on the registered mobile number.
  5. Enter the OTP and submit the details. On submission of correct OTP, the details registered under NPS will get authenticated with details available with Income Tax Department (ITD).
  6. On successful authentication, PAN will get updated/seeded under NPS.
II. Steps for updation of Form 60:
In case, you do not have PAN, you need to update Form 60 (for the current Financial Year) by following below mentioned steps:
  1. Login to CRA website (www.cra-nsdl.com) using login credentials (PRAN as User ID & Password).
  2. Click on ‘Update Personal Details’ under ‘Demographic changes’ menu and select ‘Add/ Update Permanent Account Number (PAN)/Form-60’.
  3. Select ‘Form-60’ under ‘Add/ Update PAN/Form-60’ option.
  4. Upload Form-60 documents as per requirement provided in “Notes Section” and click on ‘Generate OTP’ button. OTP will be sent on the registered mobile number.
  5. Enter the OTP and submit the details. On submission of correct OTP, Form 60 will be updated in the CRA.
B. Physical request to Nodal Office/POP (Offline)
Submit physical request (i.e. ‘Annexure – S2’ Form, mentioning PAN details) to your associated Nodal Office/Point of Presence (POP). Annexure S2 can be downloaded from the ‘Forms section’ of CRA website (www.npscra.nsdl.co.in). On receipt of physical request, the Nodal Office/POP will update PAN in the CRA system.



New Mobile app for CPS holders ( To maintain your CPS Account)

New Mobile app for CPS holders ( To maintain your CPS Account)

Mohan
APTF Updated at: November 28, 2018



New Mobile app for CPS holders ( To maintain your CPS Account)

The APP gives better user experience and provides additional functionality such as
1. View current holdings
2. Request for Transaction Statement for the year on your email ID.
3. Submit Contribution for Tier I / Tier II
4. Change Scheme Preference
5. Aadhaar seeding
6. Modify address using Aadhaar
7. Initiate withdrawal from Tier II account
8. View your Account details.
9. View Last 5 contribution transactions carried out
10. Change contact details like Telephone, Mobile no. and email ID.
11. Change your Password / Secret Question
12. Regenerate password using secret question / OTP
13. Get notifications related to NPS.

Click Here to Download App 

CPS : ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఎందుకివ్వాలి ??

CPS : ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఎందుకివ్వాలి ??

Mohan
APTF Updated at: August 12, 2018

ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఎందుకివ్వాలి ??

           ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి  సర్వీసు లో ఉండగా కేవలం జీతం మీదే  ఆధారపడి బ్రతకాలి .   పదవిలో ఉండగా తాను గాని, కుటుంబ సభ్యులు కానీ ఏ విధమైన వ్యాపారాలు కానీ ఇతర డబ్బు సంపాదించే వ్యవహారాలు చేయకూడదు. ఆస్తులు సమకూర్చుకోకూడదు. 5,000 రూపాయల పైబడి వస్తువులను ,ఆస్తులను కొన్నా , ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒక ఉద్యోగి తన జీవితంలో అనుకోని కారణాల వలన మరణించినా లేదా పదవీ విరమణ అనంతరం తనకు ,తన పైన ఆధారపడిన కుటుంబానికి సామాజిక ,ఆర్థిక భద్రత కొరకు ,వృద్దాప్యంలో సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అప్పటివరకు వచ్చిన జీతo ఆగిపోతుంది.
              
పెన్షన్ గురించి సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది ??    
         1952 సం!!రం లో , సుప్రీంకోర్టు లో జరిగిన DS నటారా vs govt of india మధ్య జరిగిన పెన్షన్ కేసులో   ఇలా తీర్పు ఇచ్చింది. భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 11, 14,16 ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కని, మూడు దశాబ్దాలుపైగా ప్రభుత్వానికి సేవలు చేసిన ఉద్యోగికి ఇచ్చే విలువగా చూడాలని,అది ఉద్యోగికి ఇచ్చే కాంపెన్షషన్ కాదని ,ఉద్యోగికి ఆర్థికంగా సామాజికంగా  భద్రతను కల్పించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టంగా  చెప్పటం జరిగింది.
         
పాత పెన్షన్ విధానం స్థానంలో నూతన పెన్షన్ విధానo(CPS)ఎందుకు వచ్చింది. ???
         భారతీయుల సగటు జీవితకాలం పెరిగినందున పెన్షనర్లకు పెన్షన్ చెల్లించడం కష్టమై ఆర్థిక వ్యవస్థపైభారం పడుతుందని పెన్షన్ విధానాన్ని సంస్కరించి ప్రైవేటీకరించాలని , అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత ప్రభుత్వానికి (IMF) సూచించింది. దానికనుగుణంగా అప్పటి NDA ప్రభుత్వం, 2001-02 సంవత్సర౦ పెన్షన్ విధా నంలో మార్పు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది.  కమిటీ ప్రతిపాదనలను తేదీ 23.08.2003 రోజున ఆమోదించారు,  డిసెంబర్ 2003 లో PFRDA బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది.

CPS ఎలావుంటుంది.??
     నూతన పెన్షన్ ప్రకారం Basic,DA పైపది శాతం గా వాటా కట్చేసి అంతే మొత్తానికి సమానమైన వాటాను ప్రభుత్వం  CPS ఖాతాలో నిధిగా జమ చేస్తుంది.  ఈనిధిని షేర్ మార్కెట్ లో ఫండ్ మేనేజర్లు ద్వారా నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్  (NSDL )ద్వారా పెట్టుబడి పెడతారు.

NSDL నిర్వహణ-పనితీరు ఎలా ఉంది ??
     మొదట్లో సిపిఎస్ ఖాతా నిర్వహణకుఉద్యోగి ట్రెజరీ ఐడీ పై నిధిని జమ చేసేవారు. కానీ 2009 తర్వాత సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ (CRA) మరియు  NSDL  రూపొందించిన పర్మినెంట్ రిటైర్మెంట్ ఎక్కౌంట్  నెంబర్ PRAN ప్రాన్ ఖాతాలోనిధిని జమ చేయటం జరుగుతుంది. 

CPS ద్వారా జీతంలో కట్ చేసిన మొతాన్ని ఏంచేస్తారు ??
      NSDL లో SBI కిచెందిన 15 రకాల,LIC కి చెందిన 10రకాలు,HDFC, ICICI, వంటి వివిధ రకాల మ్యూచవల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం వసూలైన డబ్బును ప్రభుత్వం వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతూదానిపై వచ్చే లాభనష్టాలు ఆధారంగా ఉద్యోగస్థులకు పింఛన్ ని నిర్ణయించడం జరుగుతుంది.

NSDLలోపాలు ఏమిటి ??
1) దరఖాస్తు చేసిన  వారికి PRAN కార్డ్ సకాలంలో రాకపోవటం
2) ఉద్యోగుల సంప్రదింపులకు అందుబాటులో లేకపోవటం
3) ఖాతాదారుల వివరాలను మార్పు చేయకపోవటం
4) ప్రభుత్వo,ఉద్యోగి  యొక్క మ్యాచింగ్ గ్రాంట్ను నెల నెలా ఉద్యోగ ఖాతాలో సరిగా జమ చేయకపోవడం
5)  ఖాతాలో జమ అయ్యే మొత్తంలో అధిక  తేడాలు ఉండటం
6) తమ తమ ఖాతాలో నిధులు సరిగ్గా జమకావడం లేదని ఎన్నిసార్లుఫిర్యాదు చేసినా తిరిగిమళ్లీ జమ చేయలేకపోవడం
7) చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకు వారి ఖాతాలో ఉన్న నిధిని సకాలంలో ఆదించలేకపోవడం
8) స్థానికంగా కార్యాలయాలు లేకపోవడం
9) దాదాపు 530కోట్ల రూ,ఉద్యోగుల సొమ్ము మాయం కావడం
10)  సిపిఎస్  కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం లలో మాత్రమే ఉన్నాయి.
         
CPS విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్రమా ??  కేంద్రమా ??
      CPS విధానాన్ని  రద్దు చేయాల్సింది  ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే!!  పాత పెన్షన్ అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వమే  నిర్ణయం తీసుకోవాలని విధానంలో కొనసాగాలన్న స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ఆర్థిక శాఖ ఏనాడో స్పష్టంగా చెప్పడం జరిగింది. పశ్చిమబెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో ఈ నాటికీ కూడా పాత పెన్షన్ విధానమే కొనసాగుతుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, ఇతర 4,5 రాష్ట్రాలు పాత పెన్షన్ విధాన పునరుద్ధరణకు కమిటీలు వేసి అధ్యయనం చేస్తున్నాయి

సిపిఎస్ విధానం లోని నష్టాలు ??     
1. ఉద్యోగి పెన్షన్ కు ప్రభుత్వం  ఎటువంటి గ్యారంటీ కానీ హామీ గానీ బాధ్యత తీసుకోదు                 
2. ఉద్యోగి మూలవేతనం +కరువు భత్యం  పై పది శాతం నగదు ను కత్తిరిస్తుంది. 
3.  షేర్ మార్కెట్  జూదంపై ఆధారపడటం.  
4. గ్రాట్యూటీ లేదు.     
5 . ఫ్యామిలీ పెన్షన్ లేదు.
6. పెన్షన్ నిధి పై పది శాతం పన్ను ఉంటుంది.                
7. కమ్యుటేషన్ ప్రస్తావన లేదు (OPS లో40% కమ్యూటేషన్) .                        
8. విరమణ అనంతరం హెల్త్ కార్డ్ సదుపాయం లేదు .         
9. అత్యవసర లోఆదుకునే GPF లొన్ వంటి  సదుపాయం లేదు.              
10. పదవీ విరమణ సమయంలో  60%పోను,మిగిలిన 40శాతం నిధిని మళ్లీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ రోజు ఉన్న మార్కెట్ పై పెన్షన్ని నిర్ధారించడం,ఒకవేళ మార్కెట్లో నష్టాలు వస్తే పెన్షన్ అమాంతం పడిపోవడం.               
11. (DA డీర్ నెస్ అలెవెన్స్ )  కరువు భత్యం  సదుపాయం లేకపోవడం.
12. PRC లలో పెరుగుదల లేకపోవడం.
13. PFRDAచట్టంలో లోని సెక్షన్ 12, సబ్సెక్షన్ 4,5 ప్రకారం 2004సం,, కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారి కి కూడా నూతన పెన్షన్ విధానాన్ని విస్తరించే ప్రమాదం పొంచి ఉండటం.
14. పాత పెన్షన్ విధానంలోఉద్యోగి మరణించిన ఒక్కరోజులోనే అతనికి సంబంధించిన అన్ని బెన్ఫిట్స్ క్లైమ్ ఆవుతయీ. కానీ సిపిఎస్ విధానం అసలు క్లైం చేసుకునే విధానం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది వీటిపై ఉద్యోగస్తులకు కూడా పూర్తి అవగాహన లేదు.ఉద్యోగికి సంబంధించిన అన్ని బెన్ ఫిట్స్ రావడానికి దాదాపు2-3సంవత్సరాలు పడుతుంది.
15) ఖాతా నిర్వహణకు చార్జెస్ వర్తిస్తాయి.. పాత పెన్షన్ లో  ఎటువంటి చార్జెస్ ఉండవు.

CPS పెన్షన్ చెల్లింపులు ఎలా ఉంటాయి. ??
1) స్వచ్ఛంద పదవీ విరమణ సమయంలో...
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలో ఇరవై శాతం నిధిని చెల్లిస్తారు. మిగతాఎనభై శాతం ను నెలవారీ పెన్షన్గా ఇవ్వడానికి వివిధ రకాల పథకాలలో పెట్టుబడి పెడతారు.    
 2) సాధారణ పదవీ విరమణ సందర్భంలో...
ఉద్యోగి సాధారణ పద విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలోఅరవై శాతం నిధిని చెల్లిస్తారు మిగతా నలభై శాతం లో వివిధ రకాలపథకాల్లో పెట్టుబడి పెట్టి పెన్షన్ అందజేస్తారు.
3) అకాల మరణం చెందినపుడు.....
ఉద్యోగి ఖాతాలో ఉన్న 100% నామినీకి చెల్లిస్తారు.

CPS - PRAN Complete information

CPS - PRAN Complete information

Mohan
APTF Updated at: February 22, 2018

CPS-PRAN Information -Forms


To Know Your CPS FUND Value Click Here

Detild Information
CPS AND PRAN: CONTRIBUTORY PENSION SCHEME (CPS)
INTRODUCTION: G.O.Ms.No.653 Finance (Pen-I) Dept. Dt:22.09.2004, State Government have introduced CPS to all the employees recruited on or after 01.09.2004 on the same lines of Government of India’s New Pension System. The scheme is applicable to all the organizations covered under A.P. Revised Pension Rules, 1980. Accordingly, each employee who is recruited on or after 01.09.2004 shall pay a monthly contribution of 10% of the basic pay and DA from the salary and State Government will make a matching contribution for each employee who contributes to the scheme.
PFRDA:The Central Government has constituted the Pension Fund Regulatory and Development Authority (PFRDA) to act as regulator for the pension sector of the entire Nation and also to protect the interest of the subscribers of pension fund and for matters connected herewith or incidental thereto.
NSDL (CRA) : The PFRDA has appointed the National Securities Depository Limited (NSDL), Mumbai as the Central Record Keeping Agency (CRA) to maintain the records of Contribution and its deployment in various pension fund schemes for the employees
Pension Fund Managers (PFMs) : The SBI, LIC and UTI have been selected as Pension Fund Managers (PFMs)for investing the CPS funds at the rates of 40%,31% and 29% respectively. NPS Trust has been set up as Trustee for CPS funds and the Bank of India has been appointed as Trustee Bank. 
PFMs=Pension Fund Managers
LIC Pension Fund-31%
SBI Pension Fund-40%
UTI Retiremnt Solution-29%
85% FD & 15% Eqity Shares
Tyre-I & Tyre-I
Final payment procedure :  At the time of retirement, the employee would be required to invest 40% of the pension wealth to purchase an annuity which will provide pension for life time to the employees and in the event of his death to his dependent parents/spouse. The remaining 60% pension wealth would be paid to the employee at the time of his retirement to utilize in any manner.
Clarification regarding payment of Family pension to the spouse of CPS employee while in service : Family pension under New Pension Scheme shall be paid in death cases provisionally pending framing of rules regulating such cases and the payment made on such a provisional basis shall be adjusted against the payment to be made in accordance with the new rules to be framed. Thus, the adjustment of the payment arises only after Government announces the Rules regulating such cases under New Pension Scheme.
Role of DTA : The DTA, AP, Hyderabad on behalf of Govt. of A.P. entered into an agreement with the CRA i.e. NSDL on 21.11.2008 and NPS Trust on 15.09.2009. Nodal officers such as DDOs have to deduct CPS contribution from the monthly pay bills of employees. The treasuty Officer have to upload the CPS contributions to the CRA i.e. NSDL and the corresponding amounts have to be transferred to Trustee bank i.e Bank of India. From the Pension Trust, the funds transferred to the Pension Fund Managers for investing the funds in various schemes.
Registration Procedure : As per NSDL norms, the employees and the nodal officers of the state who have to make transactions of CPS are necessarily be registered with NSDL by submitting relevant forms. Initially, DTA by submitting N1 form has got registered with NSDL and subsequently registered all the DTOs/PAOs with NSDL by submitting N2 forms. Subsequently, DDOs were registered with NSDL by submitting N3 forms. For employees registration with NSDL, each employee has to submit S1 form to NSDL.
CPS applicability to State Autonomous Bodies: Government vide Circular Memo No.41/01/A2/Pen.I/2012 Dt:18.06.2012 have issued operational guidelines for implementation of CPS for the State Autonomous bodies and all other institutions whose pay and allowances were drawn form Consolidated fund of the State or not but covered under A.P.R.P.Rules, 1980. The DTA will function as facilitator and the organizations have to be registered with NSDL through DTA by forwarding N2 and N3 forms. After this each DDO under the treasury has to be registered with NSDL by submitting N5 and N6 forms. For subscribers registration S1 form has to be submitted for allotment of Permanent Retirement Account Number (PRAN).
PRAN/CPS Head office Mumbai  :
NSDL e-Governance Infrastructure Limited (CIN U72900MH1995PLC095642), 
1st Floor, Times Tower, Kamala Mills Compound,

Senapati Bapat Marg, Lower Parel, Mumbai -400 013.
Tel : (022) 2499 4200
Fax : (022) 2495 2594/ 2499 4974
Email: info.cra@nsdl.co.in
Toll Free Number : 1800222080

Hydarabad Address :

Karvy Consultation Limited

8-2-60/K,Avenue H
Street No.1,Road No.10,
Opp Bank of Baroda,
Near HSBC,Banjara Hills,
Hydarabad -040-23512454

CPSEmployees Imp. Websites

  1. New Pension Scheme Official Website 
  2. Tracking the IRA status for PRAN
  3. Subscriber Registration Request Status
  4. District & STO Wise CPS PRAN LIST

CPS Withdrawal Forms


Form for Withdrawal on attaining 60 years of age

Form for Withdrawal before attaining 60 years of age

Form for Withdrawal by Claimant due to Death of Subscriber 

Pension Fund Regulatory and Development Authority

Subscriber Registration & Modification forms


Form N1 : DTA Registration

Form N2 : DTO Registration

Form N3 : DDO Registration

Form N4 : DTO Covering Letter for DDO Registration

Form S1 : Subscriber Registration

Form S2 : Subscriber Details ( also Nominee ) Change

Form S5 : DDO Covering Letter for Subscriber Registration

Form S6 : DTO Covering Letter for Subscriber Registration

Form S7 : Subscriber's Photo and Signature Change

Form S8 : Covering Letter of DDO for Change in Photo and Signature of Subscriber

CPS :: Clarifications about  CPS

CPS :: Clarifications about CPS

Mohan
APTF Updated at: November 20, 2017

ఏపీటీఎఫ్
మోహన్ దాస్
--------------------------------------------------------------------------------------------------------
సీపియస్ విధానంలో అన్నిటికీ గండే

పదవీ విరమణ అనంతరం దక్కే పెన్షన్‌ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు కొండంత ఆశతో ఎదురు చూస్తుంటారు.

ఓ ఇల్లు కొనాలన్నా, పిల్లల చదువులు పూర్తి కావాలన్నా, భవిష్యత్తు సాఫీగా గడిచిపోవాలన్నా ఎంతో మందికి అదే ఆధారం. ఓ ఉద్యోగి జీవితంలో అనుకోని ఉపద్రవాలు సంభవించినా ఆ కుటుంబాన్ని చివరకు ఆదుకునేది కూడా అదే.

తమ ఆశలను ఛిద్రం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌  విధానం (సీపీఎస్‌)పై రాష్ట్రవ్యాప్తంగా 1.84 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు.

తమ భవిష్యత్తును అంధకారం చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌) స్థానంలో పాత పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. .

💦బెంగాల్, త్రిపురలో నేటికీ పాత విధానమే...

2004 జనవరి 1వతేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్‌ విధానాన్ని వర్తింపచేశారు.

‘‘రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయడం, చేయకపోవడం వాటి ఇష్టం’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానం చాలా లోపభూయిష్టమైనదని, ఉద్యోగుల చరమాంక జీవితానికి ఏమాత్రం భరోసా ఇవ్వదని  పార్లమెంటులో గొంతెత్తిన వామపక్షాలు వాటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో నూతన పెన్షన్‌ విధానాన్ని అమలు చేయలేదు.

పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ఇప్పటికి పాతపెన్షన్‌  విధానమే అమలవుతుండటం గమనార్హం.


💦ఉద్యోగుల ప్రయోజనాలకు గండి.

ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్‌ 10 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌)విధానాన్ని వర్తింపచేశారు.

ఉద్యోగులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 1980 నాటి పెన్షన్‌ నిబంధనలు, వాటిలోని ప్రయోజనాలు సీపీఎస్‌ విధానంలో వర్తించవు.

1980 పెన్షన్‌ నిబంధనల ప్రకారం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనే సదుపాయం, మరణానంతర ప్రయోజనాలనేకం ఉద్యోగులకు సమకూరాయి.

కొత్త పెన్షన్‌ విధానం వల్ల పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల జీవితం గాలిలో దీపంలా మారనుంది.

💦రూ. వందల్లోకి పెన్షన్‌ కుదింపు..

ఉదాహరణకు పాత పెన్షన్‌ విధానంలో ఓ ఉద్యోగి బేసిక్‌ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 66,330 ఉంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 33,165 పెన్షన్‌గా అందుతుంది.

40 శాతం కమ్యూటేషన్‌ చేసినా మిగిలిన మొత్తం రూ. 19,899తో పాటు డీఏ, మెడికల్‌ అలవెన్సులు కలిపితే రూ. 27,398 పెన్షన్‌గా అందేది. అదే కొత్త పెన్షన్‌ విధానంలో ఒక ఉద్యోగి పెన్షన్‌ ఖాతాలో అక్టోబర్‌ నెలలో రూ. 4,93,564 ఉన్నాయనుకుంటే ఆ మొత్తం పెట్టుబడిగా పెడితే  నెల చివరికి రూ. 4,95,888 అవుతోంది.

అంటే పెరిగిన ఆదాయం రూ.2,324 మాత్రమే. ఈ లెక్కన ఉద్యోగికి వచ్చే పెన్షన్‌ నెలవారీ వందల్లోనే తప్ప అంతకు మించి అందదు.

ఇక ఎవరైనా ఉద్యోగి చనిపోతే షేర్‌ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌ రాదు.

పాత పద్దతిలో అయితే  చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం + దానిపై డీఏ వచ్చేది. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్‌ విధానంతో తమ కుటుంబాలు ఎలా బతకాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

కుటుంబ పెన్షన్‌ లేకపోవడం, కమ్యూటేషన్‌ తొలగించటం, ఇతర ప్రయోజనాలను కూడా లేకుండా చేయడంతో వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏమిటని ఆక్రోశిస్తున్నారు.

💦పాత పెన్షన్‌ విధానంలో ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవీ

 ప్రతి నెలా జీతం నుంచి సొమ్ము చెల్లించకున్నా రిటైర్‌ అయిన తర్వాత నిర్ధిష్టమైన పెన్షన్‌ నెలనెలా అందుతుంది. ఏటా వచ్చే డీఏ, పీఆర్సీ ఇతర సదుపాయాలను అనుసరించి ఇది ప్రతినెలా పెరుగుతుంది. ఉద్యోగి బతికి ఉన్నంతవరకు పెన్షన్‌ ఇవ్వటంతోపాటు చనిపోయిన తరువాత ఉద్యోగి భార్యకు పెన్షన్‌ చెల్లిస్తారు. ఆ పెన్షన్‌  బాధ్యత ప్రభుత్వానిదే.

ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతడి కుటుంబంలో అర్హులైన వారికి దామాషా ప్రకారం జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌  చెల్లిస్తారు ఇది కూడా ప్రతినెలా పెరుగుతుంది.

ఉద్యోగి అవసరాలకోసం ప్రతినెలా జీతంలో కొంతభాగం జీపీఎఫ్‌ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సొమ్ముపై ప్రతి నెలా నిర్దిష్ట వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగికి డబ్బు అవసరమైతే వడ్డీలేని రుణంగా పొందవచ్చు. సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు.

పదవీ విరమణ అనంతరం ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం హెల్త్‌ కార్డుల సదుపాయం ఉంది.

 తన శక్తి సామర్ద్యాలను ప్రభుత్వ సేవకి వినియోగించినందుకు పదవీ విరమణ సమయంలో బహుమానంగా దామాషా  ప్రకారం గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. పీఆర్సీ ప్రకారం ఇది పెరుగుతుంది.

పదవీ విరమణ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తనకు వచ్చే పెన్షన్‌లో దామాషా ప్రకారం 40 శాతం వరకు ముందుగానే తీసుకోవచ్చు. ఈ సొమ్మును పెన్షన్‌ నుంచి ప్రతి నెలా మినహాయిస్తారు. దీన్నే కమ్యుటేషన్‌ అంటారు.

ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి పన్ను విధించరు.

💦కొత్త విధానంలో అన్నిటికీ కోతే.

 పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ గురించి ఉద్యోగే చూసుకోవాలి. దీనికోసం ఉద్యోగి తన సర్వీసు ప్రారంభం నుంచే జీతంలో ప్రతి నెలా 10 శాతం సొమ్ము పొదుపు చేసుకోవాలి.

దీనికి ప్రభుత్వం అంతే మెత్తం జమచేసి ఎన్‌ఎస్‌డీఎల్‌ అనే సంస్థ ద్వారా షేర్‌ మార్కెట్లలో వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. పదవీ విరమణ సమయంలో లాభనష్టాలు పోనూ మిగిలిన సొమ్ములో 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు. దీనిపై ఉద్యోగి పన్ను చెల్లించాలి.

మిగిలిన 40 శాతం సొమ్ము మళ్లీ షేర్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలతో పెన్షన్‌  ఇస్తారు. ఇది ఎంత అనేది నిర్ధిష్టంగా ఉండదు. షేర్‌ మార్కెట్లలో నష్టాలు వస్తే పెన్షన్‌ తగిపోతుంది. ఒకవేళ పెన్షన్‌ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఫ్యామిలి పెన్షన్‌ అందదు. ఆ కుటుంబం వీధుల పాలు కావాల్సిందే.

ఉద్యోగి తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి అంకితం చేసినందుకు పదవీ విరమణ సమయంలో ఇచ్చే గ్రాట్యుటీ సదుపాయం లేదు. అయితే దీన్ని ఇచ్చేందుకు ఇటీవలే ప్రభుత్వం అంగీకరించి జీవో ఇచ్చింది.

రిటైరయిన తరువాత ఉద్యోగి హెల్త్‌ కార్డులపై స్పష్టత లేదు.

ఉద్యోగులకు కమ్యుటేషన్‌ సదుపాయం లేదు.

పాత పెన్షన్‌ విధానంలో మాదిరిగా ఆపదలో ఆదుకోనే జీపీఎఫ్‌ లోన్‌ సదుపాయం ఉద్యోగులకు లేదు.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |