APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori SERVICE INFO
Showing posts with label SERVICE INFO. Show all posts
Showing posts with label SERVICE INFO. Show all posts
24 year scale గురించి తెలుసుకోండి

24 year scale గురించి తెలుసుకోండి

Mohan
APTF Updated at: September 11, 2022

 24 year scale గురించి తెలుసుకోండి:- 

24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే( ముఖ్యంగా 98 dsc ఉపాధ్యాయులు 2022 లో 24 సంవత్సరాల ఇంక్రిమెంటు తీసుకోవలసి ఉంటుంది. వారి  అవగాహన కొరకు*


24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...


ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది


మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు


ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి


మరో ముఖ్య విషయం


మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు


మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు


ఒక ఉదాహరణ చూద్దాం


A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం


A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.


మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి


A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు


B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం


B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు


మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు


కావున సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు

ప్రభుత్వ ఉద్యోగాల్లో  1నుంచి 100 పోస్టుల భర్తీ రోస్టర్‌

ప్రభుత్వ ఉద్యోగాల్లో 1నుంచి 100 పోస్టుల భర్తీ రోస్టర్‌

Mohan
APTF Updated at: April 30, 2022

 1నుంచి 100 పోస్టుల భర్తీ రోస్టర్‌

 

ప్రభుత్వ శాఖల్లో 1 నుంచి 100 పోస్టుల భర్తీకి అనుసరించే రోస్టర్‌ విధానం కింది విధంగా ఉంటుంది. ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టుల వారీగా రోస్టర్‌ను అనుసరిస్తారు. శాఖల వారీగా రోస్టర్‌ ఎక్కడ ఆగిపోతే తదుపరి రిక్రూట్‌మెంట్‌ సమయంలో అక్కడి నుంచే కొత్త రోస్టర్‌ ప్రారంభమవుతుంది.

 

1వ పోస్టు:ఓసీ (మహిళ)

2వ పోస్టు: ఎస్సీ (మహిళ)

3వ పోస్టు: ఓసీ

4వ పోస్టు: బీసీ -ఏ (మహిళ)

5వ పోస్టు: ఓసీ

6వ పోస్టు: విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌(మహిళ)

7వ పోస్టు:ఎస్సీ

8వ పోస్టు: ఎస్టీ (మహిళ)

9వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

10వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

11వ పోస్టు: ఓసీ

12వ పోస్టు: ఓసీ (మహిళ)

13వ పోస్టు: ఎక్స్‌సర్వీస్‌మెన్‌ /ఓసీ

14వ పోస్టు: బీసీ -సీ

15వ పోస్టు: ఓసీ

16వ పోస్టు: ఎస్సీ

17వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ)

18వ పోస్టు: బీసీ -డీ (మహిళ)

19వ పోస్టు: బీసీ -ఈ (మహిళ)

20వ పోస్టు: బీసీ (ఏ)

21వ పోస్టు: ఓసీ

22వ పోస్టు: ఎస్సీ (మహిళ)

23వ పోస్టు: ఓసీ (మహిళ)

24వ పోస్టు: బీసీ (బీ)

25వ పోస్టు: ఎస్టీ

26వ పోస్టు: ఓసీ

27వ పోస్టు: ఎస్సీ

28వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

29వ పోస్టు: బీసీ -ఏ

30వ పోస్టు: ఓసీ (మహిళ)

31వ పోస్టు: హియరింగ్‌ హ్యాండిక్యాప్డ్‌

32వ పోస్టు: ఓసీ

33వ పోస్టు: ఎస్టీ

34వ పోస్టు: ఓసీ (మహిళ)

35వ పోస్టు: బీసీ (బీ)

36వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

37వ పోస్టు: ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /ఓసీ

38వ పోస్టు: ఓసీ (మహిళ)

39వ పోస్టు: బీసీ -డీ

40వ పోస్టు: ఓసీ

41వ పోస్టు: ఎస్సీ

42వ పోస్టు: ఓసీ

43వ పోస్టు: బీసీ -డీ

44వ పోస్టు: బీసీ -ఈ

45వ పోస్టు: బీసీ – ఏ(మహిళ)

46వ పోస్టు: ఓసీ

47వ పోస్టు: ఎస్సీ (మహిళ)

48వ పోస్టు: స్పోర్ట్స్‌

49వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

50వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ)

51వ పోస్టు: ఓసీ

52వ పోస్టు: ఎస్సీ

53వ పోస్టు: ఓసీ

54వ పోస్టు: బీసీ – ఏ

55వ పోస్టు: ఓసీ (మహిళ)

56వ పోస్టు: ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్‌

57వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

58వ పోస్టు: ఎస్టీ (మహిళ)

59వ పోస్టు: ఓసీ (మహిళ)

60వ పోస్టు: బీసీ -బీ

61వ పోస్టు: ఓసీ

62వ పోస్టు: ఎస్సీ

63వ పోస్టు: ఓసీ

64వ పోస్టు: బీసీ -డీ (మహిళ)

65వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ)

66వ పోస్టు: ఎస్సీ (మహిళ)

67వ పోస్టు: ఓసీ

68వ పోస్టు: బీసీ -డీ

69వ పోస్టు: బీసీ -ఈ

70వ పోస్టు: బీసీ -ఏ

71వ పోస్టు: ఓసీ (మహిళ)

72వ పోస్టు: ఎస్సీ

73వ పోస్టు: ఓసీ

74వ పోస్టు: బీసీ -బీ

75వ పోస్టు: ఎస్టీ

76వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

77వ పోస్టు: ఎస్సీ

78వ పోస్టు: ఓసీ (మహిళ)

79వ పోస్టు: బీసీ – ఏ

80వ పోస్టు: ఓసీ

81వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

82వ పోస్టు: మెంటల్లీ హ్యాండిక్యాప్డ్‌

83వ పోస్టు: ఎస్టీ

84వ పోస్టు: ఓసీ (మహిళ)

85వ పోస్టు: బీసీ -బీ

86వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌

87వ పోస్టు: ఎస్సీ (మహిళ)

88వ పోస్టు: ఓసీ

89వ పోస్టు: బీసీ – డీ

90వ పోస్టు: ఓసీ (మహిళ)

91వ పోస్టు: ఎస్సీ

92వ పోస్టు: ఓసీ

93వ పోస్టు: బీసీ -డీ

94వ పోస్టు: బీసీ -ఈ

95వ పోస్టు: బీసీ -బీ

96వ పోస్టు: ఓసీ (మహిళ)

97వ పోస్టు: ఎస్సీ

98వ పోస్టు: స్పోర్ట్స్‌

99వ పోస్టు: బీసీ -బీ (మహిళ)

100వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ 

 


పెన్షనర్ హెల్త్ కార్డ్ లు - సమగ్ర సమాచారం

పెన్షనర్ హెల్త్ కార్డ్ లు - సమగ్ర సమాచారం

Mohan
APTF Updated at: March 19, 2022

 

 గమనిక- EHS site- Google chrom లో కన్నా మొజెల్లా ఫైర్ ఫాక్స్ లో చక్కగా పనిచేస్తుంది.


ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకూ సర్వీసులో పొందిన EHS కార్డు పై వైద్యసేవలు పొందవచ్చు. ఆరు నెలల తరువాత ఆ కార్డులు పని చేయవు. ఆరు నెలల లో

Health card కావాలంటే, ముందు mail ద్వారా ehf కు తెలిపి మీ employee health card deactivet  చేసుకోవాలి.


కొందరూ రిటైర్ అయి రెండు, మూడు సంవత్సరాల యినా పెన్షనర్ హెల్త్ కార్డులుకు దరఖాస్తు చేయనందున ప్రస్తుతం డిజిటల్ హెల్త్ కార్డులు పొందలేక పోయారు.


మనం ఏంచేయాలి? 

ఎలా దరఖాస్తు చేయాలి.?


2020 కి ముందు రిటైర్ అయిన  పెన్షనర్లు వారి PPO ID ద్వారా ehs లో ఎంటర్ అవ్వాలి .వారికి

CFMS నెంబరుతో పాటు రిటైర్ అయ్యాక ట్రెజరీవారు PPO ID allot చేసేవారు. అటువంటి వారు అనగా 2020 కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులు http://www.ehs.ap.gov.in సైట్ లో  క్రింది విధానంలో దరఖాస్తు చేస్తారు.


 2020తరువాత పదవీ విరమణ పొందినవారు  దరఖాస్తు ఎలా చేయాలనే ప్రొసీజర్ పరిశీలిద్దాం. 


 2020నుండి పదవీ విరమణ చేస్తున్న వారికి PPO ID కేటాయించ బడుటలేదు. వారి CFMS నెంబరే యుజర్ ఐ డి గా ఉంటుంది. 

మనం http://www.ehs.ap.gov.in 

 సైట్ ఓపన్ చేసి User name దగ్గర CFMS ID నెంబరు ముందు "P" పెట్టి ఎంటర్ చేయండి. (ఉదాహరణకు మన CFMS ID  04158748 అనుకుండే మన user id -  P04158748 ) Password దగ్గర మీ Cfms ఐడి (04158748 ) ఎంటర్ చేసి Login type వద్ద pensioner సెలక్ట్ చేసి  అక్కడ ఇవ్వ బడిన కేప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. 


 ముందుగా 

 1.AG ఆఫీసు నుండి వచ్చిన మన PPO స్కాన్ చేసి సేవ్ చేయాలి. 


2. పాస్పోర్ట్ సైజ్ పొటో స్కాన్ చేసి సేవ్ చేయాలి. 


3. ఆధార్ కార్డు స్కాన్ చేసి సేవ్ చేయాలి.డిపెండెంట్స్ (Spouse ,Children, Parents) ఆధార్ , పాస్పోర్ట్ సైజ్ పొటో లు స్కాన్ చేసి సేవ్ చేయాలి 


 ఓపన్ అయిన విండో లో ఎడమవైపున Registrations పై క్లిక్ చేస్తే వచ్చే options లో Initiate Health Card/ View Application పై క్లిక్ చేస్తే వచ్చిన విండోలో Aadhar number select చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Retrieve Details పై క్లిక్ చేయగానే 


 Application for Pensioner Card అనే దరఖాస్తు వస్తుంది.

Login name , Aadhar number desplay అవతాయి. 


ఆ అప్లికేషన్ లోని  వివరాలన్నీ పూర్తి చేయండి * మార్క్ ఉన్నవి ఖచ్చితంగా పూరించాలి.

Personal details లో

 Retirement type , Name , Date of Birth, Gender , Blood Group , marital status, Date of retirement,  Community, Disabled వివరాలు పూర్తి చేయాలి. 


Address details పూర్తి చేయాలి.


 Identification marks లో కనీసం ఒకట ఎంటర్ చేయండి.


 Last Posting details  అక్కడ ఉన్న సెలక్ట్ ఆప్షన్ ద్వారా సరయిన వివరాలు ఎంపిక చేయాలి.


తరువాత Pension office details select option ద్వారా కరెక్ట్ గా ఎంపిక చేసుకొని క్రింద నివ్వబడిన Save Option పై click చేసి సేవ్ చేయండి.


సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత ఇప్పటివరకూ పూర్తిచేసిన వివరాలన్నీ సేవ్ అయి క్రింద

 Family members detail option వస్తుంది . అక్కడ Add beneficiary  button పై క్లిక్ చేస్తే  మరొక విండో ఓపన్ అవుతుంది 


అక్కడ Spouse Date of Birth ఎంటర్ చేసి Submit button పై క్లిక్ చేయండి .


అక్కడ Display అయిన విండోలో Spouse Aadhar number enter చేస్తే dependent  వివరాలు వస్తాయి. అవి పూర్తి చేసి అక్కడే వారి ఆధార్ కార్డు, పొటో కూడా స్కేన్ కాపీ brouse చేసి అప్లోడ్ చేసి సేవ్ చేయాలి.


ఈ విధంగా ఎంతమంది డిపెండెంట్సు ఉంటే అంతమంది వివరాలను యాడ్ చేసి సేవ్ చేయాలి.


 మెయిన్ అప్లికేషన్ పేజీలో కూడా ఎప్పటికపుడు పూరించిన అంశాలను సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేయండి. 


అనంతరం క్రింద ఇవ్వబడ్డ Add Attachments button క్లీక్ చేస్తే ఓ విండో ఓపన్ అవుతుంది

అందులో Signed Application Form, Aadhar , Date of Birth ,Photo, PPO/Service register detals స్కేన్ కాపీలు ఒక్కోక్కటిగా upload చేయండి.

Signed Application Form తప్ప మిగిలినవి upload  చేయాలి. 

Upload చేసే స్కేన్ ఒక్కొక్క కాపీ సైజ్ 200 kb కి మించరాదు.


Signed Application Form తప్ప మిగిలినవి అప్ లోడ్ చేసి సేవ్ చేసిన అనంతరం మెయిన్ పేజీలో save తరవాత సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. ఆ పై Print Application button పై క్లిక్ చేస్తే మనం పూర్తిచేసిన Pensioner Health Card application మన పొటోతో Display అవుతుంది. 


*ఆ అప్లికేషన్ ప్రింట్

మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు

మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు

Mohan
APTF Updated at: March 07, 2022

 ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.

(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)

(ఇది మహిళా ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే G.O.)


ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.

(G.O.Ms.No.27 తేది:09-01-2004)


మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తెకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.

(G.O.Ms.No.350 తేది:30-07-1999) 


అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.

(Memo.No.17897 తేది:20-04-2000)


పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు.

(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)


ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.

(మెమో.నం.7679 తేది:14-09-2010)


మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.

(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)


మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.

(G.O.Ms.No.374 తేది:16-03-1996)


జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.

(G.O.Ms.No.03 తేది:05-01-2011)


మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.

(G.O.Ms.No.142 తేది:01-09-2018)


వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.

(G.O.Ms.No.152 తేది:04-05-2010)


మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరు చేయవచ్చు.

(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)

(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)


మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)


ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు, ఆపరేషన్ తరువాత మగ, ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)


మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసు మేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేస్తారు.

(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)


చట్టబద్దంగా గాని, అప్రయత్నంగా గాని గర్భస్రావం (Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.

(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)


మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి  మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.

(G.O.Ms.No.132 తేది:06-07-2016)

అర్ధవేతన సెలవులు     (HALF PAY LEAVES)

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

Mohan
APTF Updated at: January 17, 2022

**SERVICE RULES*

👉  ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

👉  సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)

💎 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.

అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

💎 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

1⃣ వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)

2⃣ స్వంత వ్యవహారాలపై (Private Affairs)

💎 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.
https://t.me/APEMPLOYEES
💎 ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

💎 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. {APLR 15(B) & 18(B}

💎 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975)

💎 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}

💎 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

💎 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

💎 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
https://t.me/APEMPLOYEES
                (Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)

💎 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

💎 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
(G.O.Ms.No.386 Dt:06-09-1996)
(G.O.Ms.No.449 Dt:19-10-1976)

💎 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. 

    (G.O.Ms.No.29 Dt:09-03-2011)
https://t.me/APEMPLOYEES
💎 ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు.

    (G.O.Ms.No.143 Dt:01-06-1968)

💎 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

💎 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
    (G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

AP Employees Promotion Rules - Roster Points in Promotions - Seniority in Promotions

AP Employees Promotion Rules - Roster Points in Promotions - Seniority in Promotions

Mohan
APTF Updated at: December 09, 2021

AP Employees Promotion Rules - Roster Points in Promotions - Seniority in Promotions

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు, 6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు GO.Ms.No.21 Dt. 1 8-03-2003 ద్వారా విడుదలయినవి.

అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19-10-2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt: 29-12-2008 ).
పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకానట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ - రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.

SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. ( G.O.Ms.No.18 Dt:17.2.2005 )

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST, PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

సీనియారిటీ లిష్టులు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి.

 సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు): ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%) లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి
  • SC : General : 7,16,27,41,52,62,72,77,91,97 (మొత్తం : 10) Women : 2,22,47,66,87 (మొత్తం : 5)
  • ST : General : 25,33,75,83 (మొత్తం : 4) Women : 8, 58 (మొత్తం : 2)
  • PHC : 6 ( అంధత్వం లేదా తక్కువ చూపు ) , 31 ( చెవుటి లేక మూగ ) , 56 ( అంగవైకల్యం ).
  • Total Roaster Points : 24

మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST,PH అభ్యర్ధులు అందరూ మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది.

 అడక్వసీ అంటే "ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PHఅభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు". అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు. (G.O.Ms.No. 2 dt: 9.01.2004 ) and  ( G.O.Ms.No. 18 dt: 17.02.2005 )

వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు - విధివిధానాలు
 భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం

ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలి.

పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.

ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్నవారికే ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహయింపు ఉండదు.

అంగవికలురు పనిచేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలుపరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి.

పదోన్నతులలో వికలాంగుల 6,31,56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.

ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కేడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడేవరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపివేయాలి.
పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము (G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి.

ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించవచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించనవసరం లేదు .

పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించుకోవాలి.

ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును.

పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.

ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకకపోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరకపోతే చెవిటి, మూగవారికి, వారుకూడా దొరకపోతే OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.

అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటివారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశమివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగవైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయవచ్చును.

ఇట్టే 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసియున్ని. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశమివ్వాలి. వారు కూడా దొరకకపోతే సీనియారిటీ ప్రకారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశమివ్వాలి.


Related GOs & Proc :  ( Click on G.O to Download)

  • G.O.Ms.No.5 dt:14.2.2003 Reservation in Promotions for SC , ST

  • G.O.Ms.No. 2 dt: 09.01.2004 Policy of Providing Rule of Reservation in Promotions in favor of SCs & STs

  • G.O.Ms.No. 21 dt: 18.03.2003 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs

  • G.O Ms 16 , Dt 17.02.2005 Policy of providing Rule of Reservationin Promotions in favour of SCs/STs - Modification

  • G.O.Ms.No. 18 dt: 17.02.2005 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates

  • G.O.Ms.No.154 , Dated.30–7-2008 Rule of Reservation in promotions –Comprehensiveguidelines issued – Amendment to guidelines 

  • G.O.Ms.No. 42 dt: 19.10.2011 Providing Reservations in Promotions to the Differently Abled Employees

  • G.O.Ms.No. 23 dt: 26.05.2011 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories

  • G.O.Ms.No. 748 dt: 29.12.2008 Promotion to the higher posts - Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher categories – 5 years time allowed

పదోన్నతులు ఎలా ఇస్తారు.... కొంత వివరణ... కొన్ని ఉత్తర్వులు

పదోన్నతులు ఎలా ఇస్తారు.... కొంత వివరణ... కొన్ని ఉత్తర్వులు

Mohan
APTF Updated at: October 16, 2021

పదోన్నతులు ఎలా ఇస్తారు తెలుసుకుందాం

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు,  6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు GO.Ms.No. 21 Dt. 1 8.03.2003 ద్వారా విడుదలయిన
అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు  చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19.10.2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt:  29.12.2008).  

పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ - రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.

SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. (G.O.Ms.No.18 Dt:17.2.2005)

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST,  PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

 సీనియారిటీ లిష్టులు మెరిట్  కమ్  రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా  ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH  అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .

సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు): 

ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు  ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

ప్రమోషన్సు రిజిస్టర్:

 ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%)  లకు  రోష్టరు పాయింట్లు  అడక్వసీ నిబంధనలకు లోబడి  వర్తిస్తాయి.

SC :General : 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97 (మొత్తం : 10)    
Women : 2,22,47,66,87 (మొత్తం : 5)
ST :General : 25, 33, 75, 83 (మొత్తం : 4)    
Women : 8, 58 (మొత్తం : 2)
PHC :6 (అంధత్వం  లేదా తక్కువ చూపు ), 31 (చెవుటి లేక మూగ  ), 56 ( అంగవైకల్యం).
Total Roaster Points : 24

     మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి 

ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST, PH అభ్యర్ధులు అందరూ మెరిట్  కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, 
SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క  రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. 
ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది. 


అడక్వసీ అంటే  


"ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC, ST, PHC అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే , ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు". అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు. అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.
(G.O.Ms.No. 2 dt: 9.01.2004)
(G.O.Ms.No.18 dt: 17.02.2005)

వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు - విధివిధానాలు

భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 
ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు  ఇవ్వాలి.

 పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.
 ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్నవారికే ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహయింపు ఉండదు.

 అంగవికలురు పనిచేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలుపరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి.

పదోన్నతులలో వికలాంగుల 6, 31, 56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.

 ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కేడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడేవరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపివేయాలి.

పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము:

 (G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో  సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి  పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. 

ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించవచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించనవసరం లేదు.
 
పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించుకోవాలి.

ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి.  

మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును. 

పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును. 

 ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి  సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకకపోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరకపోతే చెవిటి, మూగవారికి, వారుకూడా దొరకపోతే OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.

అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటివారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశమివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగవైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయవచ్చును. 

ఇదే విధంగా 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసియున్ని. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశమివ్వాలి. వారు కూడా దొరకకపోతే సీనియారిటీ ప్రకారము వైకల్య0 లేని అభ్యర్థికి అవకాశమివ్వాలి.

Related GOs & Proc : 

G.O.Ms.No.5 dt:14.2.2003 Reservation in Promotions. 

G.O.Ms.No. 2 dt: 09.01.2004 Policy of Provding Rule of Reservation in Promotions in favaour of SCs & STs.

G.O.Ms.No. 21 dt: 18.03.2003 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs .

G.O.Ms.No. 18 dt: 17.02.2005 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates.

G.O.Ms.No.16 dt: 17.02.2005 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs - Modification Orders.

G.O.Ms.No. 42 dt: 19.10.2011 Providing Reservations in Promotions to the Differently Abled Employees.

G.O.Ms.No. 23 dt: 26.05.2011 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories.

G.O.Ms.No. 748 dt: 29.12.2008 Promotion to the higher posts - Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher 
Categories – 5 years time allowed

సేవాపరమైన సందేహాలు- సమాధానాలు

సేవాపరమైన సందేహాలు- సమాధానాలు

Mohan
APTF Updated at: September 28, 2021

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
 భార్య & భర్త ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి, వారిలో భర్త మరణిస్తే, అవివాహితుడు అయిన వారి సోదరుడికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వుటకు వీలుపడుతుందా?

జవాబు:
రూల్స్ ప్రకారం అలా వీలు లేదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఏ విధమైన ఆదాయ వనరులు లేనప్పుడు మాత్రమే కారుణ్య నియామకం వీలుంటుంది.


2. ప్రశ్న:
 విధులకు ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా? తెలుపగలరు.

జవాబు:
ఏ ఉపాధ్యాయుడి పైన ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా విధులకు ఆటంకం కలిగించినా దాడి చేసినా IPC186.189,353 ప్రకారం 2yr జైలు శిక్ష ఉంటుంది.


3. ప్రశ్న:
మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా? మూడవ కూతురికి వివాహం కాలేదు. How to process

జవాబు:
(1) ముందుగా మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలి. (2) ఆ మెడికల్ ఇన్‌వాలిడేషన్ తో కారుణ్య నియామకానికి ధరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటిది సాధించవచ్చు కాని రెండవ దానికి గ్యారంటీ లేదు.


ప్రశ్న:

ఒక టీచర్ 22 రోజులు మెడికల్ లీవ్ లో ఉన్నాడు
23 rd day జనరల్ హాలిడే 
24 th day సెకండ్ satur day 
25 th day sunday 

ఈ సందర్భంగా 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా?
23 రోజులకు తీసుకు రావాలా ?
Prefix ,suffix మెడికల్ లీవ్ లకు వర్తిస్తాయా?
GO లు తెలుపగలరు

జవాబు:
ఈ కేసులో Fitness ఎప్పుడు పొందేరో ఇంపార్టెంట్. 

(1) *22 రోజులకు Fitness Certificate ఇస్తే, 22-రోజులకు లీవ్ మరియు 3-రోజులకు suffix చేసుకోవచ్చు. 22-రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.

(2) *25 రోజులకు Fitness Certificate ఇస్తే, suffix ఉండదు. 25 రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.
FR 68; FR 71 మరియు AP Leave Rules ను చూడండి.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |