ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని ఈ రోజు పాఠశాల విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారితో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రతినిధి బృందం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రితో మాట్లాడి సాధ్యాసాధ్యాలపై నిర్ణయిస్తామని చెప్పారు.
ముఖ్య కార్యదర్శి శ్రీ రాజశేఖర్ ఐఎఎస్ గారిని కలసి
అంతర్గత మూల్యాంకనంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.
అవార్డు టీచర్లు ఏడాది సర్వీస్ పెంపు, వారి పదవీవిరమణ వయస్సుపై స్పష్టత ఇవ్వాలని,
డిఈఓ పూల్ లో ఉన్న వారికి శాశ్వత పాఠశాలలు కేటాయించాలని కోరడమైనది. ఆమేరకు అప్పటికప్పుడు అధికారులను పిలిపించి మార్గదర్సనం చేశారు.