విద్యాశాఖా మాత్యులు వారిచే మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ - APTF
ఈ రోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు
శ్రీ ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయం, మార్కాపురం నందు వారి చేతుల మీదుగా APTF ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 5000 కరోనా మాస్క్ లు మరియు శానిటైజర్స్ ను ఆవిష్కరించడం జరిగింది. APTF సేవా కార్యక్రమాలను మంత్రిగారు అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కోరారు. అక్కడ పనిచేస్తున్న పోలీస్ మరియు ఇతర సిబ్బందికి మంత్రిగారే స్వయంగా మాస్క్ లను, శానిటైజర్స్ ను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు PV సుబ్బారావు గారు, జిల్లా అధ్యక్షులు KVG కీర్తి, ఏపిటిఎఫ్ జిల్లా నాయకులు A. అమ్మయ్య, A V రావు, A. గురులింగం, K. రవీంద్ర రావు లు పాల్గొన్నారు. పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏపిటిఎఫ్ కార్యకర్తల ద్వారా పంచుతున్నట్లు సంఘ నాయకులు తెలియజేశారు.