ఆంధ్రప్రదేశ్
లోని 164 మోడల్
స్కూల్స్ 2020–2021 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో
విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు
కోరబడుతున్నాయి
ప్రవేశ
అర్హతలు :-
- వయస్సు: ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి., యస్.టి. కులాలకు
చెందిన విద్యార్థులు 11-09-2006 మరియు 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.
- సంబంధిత
జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా
సంవత్సరములు చదివి ఉండాలి.
- 2019-20 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ
ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
- దరఖాస్తు
చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడవచ్చు
దరఖాస్తు
చేయు విధానము
- తేది. 06-07-2020 నుండి 25.07.2020 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్
రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.
- ఆ
జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో www.cse.ap.gov.in / apms.ap.gov.in సైట్ లో Online లో దరఖాస్తు చేసుకొనవలయును
- దరఖాస్తు
చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/-
- SC మరియు ST లకు : రూ. 50/-
- ప్రవేశములు
లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల
ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల
విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు