KGBV 6TH CLASS AND
INTERMEDIATE ADMISSION NOTIFICATION-2020 DETAILS
రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల(కేజీబీవీ)లో 2020-21 విద్యా
సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష ఎస్‌పీడీ
వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. జూలై 10 నుంచి జూలై 23 వరకు ఆన్ లైనులో
దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్
(మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా
వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు. ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్
ద్వారా పొందవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం
అందించబడుతుందని తెలిపారు. సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా
వెబ్ సైట్ https://ssa.ap.gov.in/SSA/ లోనూ చూసుకోవచ్చన్నారు.