FAPTO-కృష్ణాజిల్లా:
రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఈరోజు మచిలీపట్నంలో కలెక్టరేట్ లో DRO గారిని కలిసి ప్రభుత్వం అమలుచేయనున్న నూతన జాతీయ విద్యా విధానం-2020 ఉత్తర్వుల్లో మార్పు చేయాల్సిన అంశాలను ప్రస్తావించి మెమోరాండం సమర్పించడమైనది.
ఈ కార్యక్రమంలో FAPTO జిల్లా నాయకులు సెక్రటరీ జనరల్ తమ్ము నాగరాజు,కో ఛైర్మన్లు జె.లెనిన్ బాబు,కొమ్ము ప్రసాద్,కోశాధికారి A.R.అస్లాం,కె.ఎస్.ఆర్ పాల్గొనడమైనది.
సమర్పించిన. FAPTO డిమాండ్స్:
- 1.ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు అనుసంధానం చేయాలి.ఆ తరగతులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి.రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రాథమిక తరగతుల బోధన మాత్రమే ఉండాలి.
- 2.ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను హైస్కూల్స్ కి తరలించకూడదు.
- 3.ప్రతి ప్రాథమిక పాఠశాలకు PS HM పోస్టు మంజూరు చేయాలి.
- 4.N.E.P లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ,ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలన్నింటిలో మాతృభాష మాధ్యమం అమలుచేయాలి.
- 5.హైస్కూల్స్ లో సమాంతర మాధ్యమం కొనసాగించాలి.
- 6 400 పైబడి విద్యార్థులున్న హైస్కూల్స్ లో ఇంటర్మీడియట్ ప్రారంభించాలి.
- 7. విద్యా ప్రమాణాల కోసం ఖాళీగా ఉన్న 26 వేల ఉపాధ్యాయ పోస్టుల ను భర్తీ చేయాలి.