గడచిన 3 సంలుగా గిరిజన ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులకు ప్రాతిని ధ్యం చేసినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కానందుకు నిరసనగా డిసెంబర్ 12న యుటియఫ్ ఆధ్వర్యంలో అన్ని ఐటిడిఏ కార్యాల యాల ముందు ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమం చేస్తున్నామని, ఉపాధ్యాయ, సీఆర్, భాషా వాలంటీర్లు విజయవంతం చేయాలని యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కె.ఎస్. ఎస్. ప్రసాద్ పిలుపునిచ్చారు. జీవో 3కి చట్ట బద్దత కల్పించాలని, పం డిట్, సిఆర్డిలను రెగ్యులర్ చేయా లనిఅధికారులకు పదే పదే ప్రాతిని ధ్యం చేసినా, పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందిం చకపోవడం గిరి జన విద్యకు అన్యాయం చేసినట్లేన ని విమర్శించారు.