ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు నిర్దేశిత వెబ్సైట్ ద్వారా బదిలీ కోసం దరఖాస్తు చేసు కోవాలి . ఇలా అందిన దరఖాస్తులను మాత్రమే బదిలీకి పరిగణిస్తారు . " ఆన్లైన్ సమర్పించాక దరఖాస్తుదారులు నిర్దిష్ట వెబ్సైట్ నుండి అప్లికేషన్ ప్రింటు తీసుకోవాలి . వాటిపై సంతకంచేసి మండల విద్యాధికారి , హైస్కూల్ హెడ్మాస్టర్ , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు అందజేయాలి . ఆ దరఖాస్తుల స్వీకరణ తర్వాత , సంబంధిత అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబి తాలను ప్రదర్శించాలి . ఆ అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించాలి . అవి పరిష్కరించిన తర్వాత , అధికార వెబ్సైట్లో తుది సీనియారిటీని ఎన్లైటిల్మెంట్ పాయిం తో చూపించాలి . ఆ తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు అన్ని ఆప్షన్లను ఎంచుకోవాలి . ఇలాంటి హెచ్ఎం , టీచర్లు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోకపోతే 3 , 4 కేటగిరీల్లోని పాఠశాలల్లో ఉన్న ఖాళీలకు బదిలీచేస్తారు . | దరఖాస్తు చేసి ఆపై వారికి సమర్పించకపోతే , క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు . ఆన్లైన్లో రూపొందించిన తుది జాబితాల ఆధారంగా సం బంధిత కమిటీల ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి