- ఉపాధ్యాయ బదిలీల్లో పోస్టుల బ్లాక్
- కేటగిరీ -1 , 2 , 3 లలోని ఖాళీ పోస్టులు వెబ్ఐచ్చికాల్లో కనిపించవు
- ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులకు పాయింట్ల తొలగింపు
- ఆన్లైన్ దరఖాస్తులు 14 నుంచి ప్రారంభం
- సంక్రాంతి వరకు బదిలీలు
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది . ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు , ఫౌండేషన్ , ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేందుకు బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసింది . ఈ నెల 14 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు . ఈ బదిలీల్లో ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేయనున్నారు . మంజూరైన పోస్టులు కాకుండా .. ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో అన్ని ఖాళీలనే చూపుతారు . కేటగిరీ- 1 , 2 , 3 పోస్టులను బ్లాక్ చేస్తారు . దీంతో ఎక్కువమంది ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది . జనవరి 2 నుంచి 10 వరకు | సమ్మెటివ్ -1 పరీక్షలు జరగనున్నాయి . ఈ పరీక్షలు పూర్తయి , మార్కులను ఆన్లైన్ అప్లోడ్ చేశాకే బదిలీ అయినవారు కొత్త
స్థానాలకు వెళ్లాలి . 3-10 తరగతులకు 7,928 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది . వీటిని పదోన్నతులు , సబ్జెక్టు కన్వర్షన్ తో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది . పరిపాలన అవసరాల కింద బదిలీ , సర్దుబాటు చేసే అధికారం కమిషనర్కు కల్పించింది . పురపాలక , గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తారంది .