ఇక కమిటీ ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత , కమిటీ కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్లను సమీక్షించడం , సవరించడానికి వీల్లేదు . కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల ఫలితాలకు లోబడి ఉత్తర్వుల్లో షరతును చేర్చాలి . బదిలీ ఆర్డర్లు అందిన తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం నుండి తక్షణమే రిలీవ్ అవుతారు .. తదుపరి తేదీన వారు కొత్త పాఠశాల్లో చేరాలి . పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ( సబ్జెక్ట్ టీచర్లతో సహా ) పనిచేస్తూ బదిలీని పొందినట్లయితే , ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయరాదు . అలాగే , ఇతర స్థానాల విషయంలో కూడా ప్రత్యామ్నాయం తర్వాతే రిలీవ్ చేస్తారు . తప్పుడు సమాచారమిచ్చి , మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్తో పాటు క్రమశిక్షణా చర్యలు తప్పవు . తప్పుడు సమాచారంపై సంతకం చేసిన హెచ్ఎం ఇతర అధికారులపైనా ఇవే చర్యలు ఉంటాయి . బదిలీ ఉత్తర్వులు అందిన అనంతరం ఎటువంటి ఆలస్యం లేకుండా పోస్టింగ్ స్థానంలో చేరాలి . అనధికారికంగా గైర్హాజరైతే మార్గదర్శకాల ప్రకారం క్రమశిక్షణా చర్యతో పాటు ' నో వర్క్ నో పే ’ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .