పెండింగ్ బకాయిలు విడుదల చేయించండి
నూతన సంవత్సర సందర్భంగా మంత్రి కాకాణిని కలిసిన ఎపిటీఎఫ్ శ్రేణులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎపిటీఎఫ్(1938) శ్రేణులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల విషయాన్ని మాజీ APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K.వెంకటేశ్వరరావు మంత్రి దృష్టికి తెచ్చారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించి ఆర్ధిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూడాలని కోరగా ఆయన అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ మోహన్ దాస్,Y. జనార్దన్ రావు ,యు సురేంద్ర,B, కాంతారావు ,ఎస్డి ఖాదర్బాషా, టీ .మస్తానయ్య మొదలగు వారు పాల్గొన్నారు