APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori INCOME
Showing posts with label INCOME. Show all posts
Showing posts with label INCOME. Show all posts
పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

Mohan
APTF Updated at: February 19, 2023

 ఆదాయ పన్ను సమాచారం


పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు




♦️ ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.



♦️ అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది

March-May  15%

Jun-Aug 45%

Sep-Nov  75%

Dec-Feb 100%



అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.



♦️ ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.



♦️ ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.

 


♦️ కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

 

♦️ ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచోఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.



♦️ DDO లకు సూచనలు

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)



♦️ DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.



♦️ లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)



♦️ DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.



♦️ TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.


♦️ లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.



♦️ TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.



♦️ ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.



♦️ పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు...

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

Mohan
APTF Updated at: January 04, 2023

 ప్రాయోజిత సమాచారం

ఎపిటీఎఫ్ 1938


 Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు... 


👇👇👇👇👇

  •  1. PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి  లాస్ట్ year PAN no. తప్పు గా enter చేసి,  దాదాపు చాలా మంది teacher వాళ్ల వి జనవరి TDS AMOUNT,  government direct credit PRC salaries veyadam వల్ల వేరే వాళ్ళ pan card ki tax జమ కావడం జరిగింది..

  •  2.) E-FILING పోర్టల్ నుండి AIR (annual information report)లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి ( FD, saving Bank account interest). 

  •  3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి,  ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి. 

  •  4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి. 

  •  5.) House loan ,  joint account ఉంటే 50-50 share చేసుకోవాలి.  లేక పోతే 25-75 చేసుకోవాలి. 
  •  6.) ఇదే సూత్రం interest మరియు,  principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి. 
  •  7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ కూడా 80C పరిధిలో ఉంటుంది.  


  •  8.) NPS state government employee అయితే proof అవసరం లేదు,  అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి. 


  •  9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి. 


  •  10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents సదరన్ latest ఇవ్వాలి.. 


  •  11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి.  దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ. 


  •  12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.., 


  •  13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి.. 


  •  14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి.  తద్వారా online Form-16. Generate అవుతుంది.  మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి.  ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది. 


  •  15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి.  ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి.  తేడా tax కొరకు.


అలాగే..... 


10E గురించి పూర్తి సమాచారం తెలుసుకుoదం ...


అసలు 10E అంటే ఏమిటి,  ఎవరు File చేయడానికి అర్హులు,  ఎందుకు చేయాలి.  ఎలా చేయాలో తెలుసుకుందాము.


10E అంటే section 89(1) కింద tax రిలీఫ్ (refund) కోరడం.. అంటే గత సంవత్సరం లో రావాల్సిన బకాయిలను (SALARY/DA/PRC/IR HPL/ Ect...)....ఈ సంవత్సరంలో తీసుకోవడము వలన మనం కట్టె   tax పరిధి 5%నుండి 20% కి  & 20% నుండి 30% పెరిగిన సందర్భం లో E-filing చేసే కంటే ముందే 10E file చేయవలెను. దీనికి ముందే tax calculation ఫార్ములా ప్రకారం చేసి పెట్టుకోవాలి.  దీని కోసం గత సంవత్సరం Form-16 తప్పనిసరిగా దగ్గర ఉండాలి,  అప్పుడే మనం 10E చేసుకోవాలి .

Income Tax FY 2022-23 AY 2023-24 Income Tax Act - IT FY 2022-23 New and Old Tax Slab Rates

Income Tax FY 2022-23 AY 2023-24 Income Tax Act - IT FY 2022-23 New and Old Tax Slab Rates

Mohan
APTF Updated at: December 09, 2022

 


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై  అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ

2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ

Mohan
APTF Updated at: December 09, 2022

 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల యొక్క ఆదాయపన్ను మినహాయింపు, గణన, స్లాబ్ రేట్స్, వచ్చిన మార్పులుపై  అధికారిక సర్కులర్ 24/2022 జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ


December 07, 2022, circular no.24/2022 


 Taxpayer/STO/DTO/DDO లు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు..... 


1.DDO లు తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల సేవింగ్స్ వివరాలు అన్ని కూడా..12BB form  లో తీసుకోవాలి,  income tax లో మినహాయించి మిగిలిన వాటికి tax cut చేయాలి.. (page 14).


 The DDO shall also ensure furnishing of the evidence or particulars in Form No. 12BB in 

 respect of deduction of interest as specified in Rule 26C read with section 192 (2D).


2.) HOUSE LOAN, లేదా HRA లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించాలి. 


3.) పని చేస్తున్న place ఇంటికి దూరంగా ఉంటే/ఇంట్లోలేకపోతే,  HRA మాత్రమే Claim చేయాలి, (page-14). 

i. 

the deduction is allowed only in case of house property which is owned and is in the 

occupation of the employee for his own residence. In case the house property is not 

occupied by the employee in view of his place of the employment being at other place, 

then his residence in that other place should not be in a building belonging to him.

3.) Topup loan 30000 వరకు చూపవచ్చు .proof submit చేయాలి..


4. Section 192(2D) with Rule 26C. Own house unte,

a.*Interest pay certificate 

b.name, aadhar, pan card physical. compulsury తీసుకోవాలి*.  (page 15)


5.)Form 24Q, (TDS ,,మే 31 లోపు ఎటువంటి పరిస్థితుల్లోనూ complete చేయాలి. ఆ తర్వాత 500/- per day. Penalties విధించ బడుతుంది. (Page 18).

6. ) ప్రతి DDO తన పరిధిలోని employees కి,  tds certificate (Form-16) ని,  విధి గా,  డిజిటల్ signatures తో authentication చేసి ఇవ్వాలి.  కానీ చాలా మంది DDO లు ఎవరికి కూడా DSC లేదు., లేకపోతే కొన్ని టెక్నికల్ problems రావచ్చు.  (Page-23)


7.)DDO లు compulsury గా HRA evidence/proof.(FORM-12BB) .Employee నుండి తీసుకోవాలి. (page-24)

8.)income tax section ప్రకారం total Tax ఎంత deduct చేయాలి అనేది DDO గారె ఫైనల్... Here STO role is zero.. సో అందరూ సెంట్రల్ government సర్క్యులర్ (24/2022) క్షుణ్ణంగా చదవవలసినది....

9) ఏదైనా తప్పుగా CALCULATE చేస్తే,  271H ప్రకారం శిక్ష అర్హులు..(page-27)

10.) ఎవరినయినా LTC leave travel concessions,  మీకు,  మీ DDO ఇచ్చి ఉంటే మాత్రమే,  10(5) కింద మినహాయించు కోవాలి. (Page-41.)


10.)80DD మరియు 80U కింద మినహాయింపు కోరే self/ఫ్యామిలీ person with challenges , తమ తమ ఒరిజినల్ documents కలిగి ఉండాలి,  Treatment/INSURANCE paper లు, /health  insurence.. ect.. 80U కోసం latest disability %certification ఉండాలి...


#INCOME_TAX


Click Here to Download Circular on Incometax



 కొత్త ఏడాదికి కొత్త ఐటీ  రిటర్న్‌ ఫారంలివే

కొత్త ఏడాదికి కొత్త ఐటీ రిటర్న్‌ ఫారంలివే

Mohan
APTF Updated at: April 04, 2022

🌻న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ ఫారంలు 1-5ను నోటిఫై చేసింది. కార్పొరేట్లు, ట్రస్టులకు వర్తించే ఐటీఆర్‌ 6,7 తదుపరి నోటిఫై చేస్తారు. కొత్త ఫారంల ప్రకారం విదేశాల్లో అందుకున్న రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, ఏడాదికి రూ.2.5 లక్షల పైబడిన పీఎఫ్‌ ఖాతాలపై సమకూరే వడ్డీ ఆదాయాలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. సీబీడీటీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ సంఖ్యలో ఉండే చిన్న, మధ్యశ్రేణి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్‌), ఐటీఆర్‌ ఫారం 4 (సుగమ్‌) రెండింటినీ మరింత సరళం చేశారు.


♦ఎవరెవరికీ ఏ ఫారం...? సహజ్‌ (ఫారం-1): రూ.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వేతనం, ఇంటి ఆస్తి, ఇతర వనరుల (వడ్డీలు, ఇతరం) ఆదాయం పొందే వారు.


♦ఐటీఆర్‌-2: వ్యక్తిగత అసెసీలు, హెచ్‌యూఎ్‌ఫలు ఈ ఫారం దాఖలు చేయాలి. ఏడాదికి రూ.2.5 లక్షలకు పైబడి పీఎఫ్‌ ఖాతాల్లో పెడుతున్న పెట్టుబడులపై వచ్చే వడ్డీని వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే డివిడెండ్‌ ఆదాయం, ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం (డీటీఏఏ) కింద పన్ను పరిధిలోకి వచ్చే డివిడెండ్‌ ఆదాయం వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది.


♦ ఐటీఆర్‌-3: వ్యాపారాలు/వృత్తిపరమైన కార్యకలాపాల నుంచి లాభంగా ఆదాయం పొందే వారు.


♦సుగమ్‌ (ఫారం-4): రూ.50 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, వృత్తినిపుణులు.


♦ఐటీఆర్‌-5: ఎల్‌ఎల్‌పీలుఐటీఆర్‌-1: స్థూలంగా గత ఏడాదిలో ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే నికర వేతనాన్ని మదింపు చేయడం కోసం విదేశాల్లో నిర్వహించే రిటైర్మెంట్‌ ప్రయోజనాల ఖాతాకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వాలన్నది కొత్త మార్పు. అలాగే ఐటీ చట్టం 89-ఎ లో నోటిఫై అయిన దేశంలోనే ఆ ఖాతా ఉన్నదా అనే అంశం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 89-ఎ సెక్షన్‌ కింద వారు మినహాయింపులు కూడా కోరవచ్చు.

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...

Income tax (preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...

Mohan
APTF Updated at: February 08, 2022

  1. PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి 


 2.) E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి FD, saving Bank account interest (10వేల వరకు మినహాయింపు ఉంటుంది). 


 3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి,  ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి. 


 4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి. 


 5.) House loan ,  joint account ఉంటే 50-50 share చేసుకోవాలి.  లేక పోతే 25-75 చేసుకోవాలి. 


 6.) ఇదే సూత్రం interest మరియు,  principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి. 


 7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ kuda 80C పరిధిలో ఉంటుంది.  


 8.) NPS state government employee అయితే proof అవసరం లేదు,  అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి. 


 9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి. 


 10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి.. 


 11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి.  దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ. 


 12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.., 


 13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి.. 


 14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి.  తద్వారా online Form-16. Generate అవుతుంది.  మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి.  ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది. 


 15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి.  ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి.  తేడా tax కొరకు.


Tax Exemption for Expenditure on COVID treatment and received Ex-gratia due to Corona deaths

Tax Exemption for Expenditure on COVID treatment and received Ex-gratia due to Corona deaths

Mohan
APTF Updated at: June 26, 2021

 Tax Exemption for Expenditure on COVID treatment and received Ex-gratia due to Corona deaths


Click here to Download Copy




 Income Tax Returns ఫైల్ చేస్తున్నారా.. ?      ఈ ఏడాది వ‌చ్చిన మార్పులు తెలుసుకోండి.

Income Tax Returns ఫైల్ చేస్తున్నారా.. ? ఈ ఏడాది వ‌చ్చిన మార్పులు తెలుసుకోండి.

Mohan
APTF Updated at: June 16, 2021


    ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం ఫైల్ చేయాల్సిందే.  అయితే టాక్స్-పైల్లింగ్ చేసే విధానంలో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌తీ సంవ‌త్స‌రం కొన్ని మార్పులు చేస్తుంటుంది. ప‌న్ను చెల్లింపుదారులు త‌ప్పులు లేకుండా ఐటీ రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేంద‌కు ఈ మార్పుల‌ను తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. 


    మ‌దింపు సంవ‌త్స‌రం.. ఏవై22 కోసం రిట‌ర్ను ఫారాలను ఐటీ శాఖ నోటిఫై చేసింది.  ఐటీఆర్ దాఖ‌లు గడువును కూడా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ప‌న్ను దాఖ‌లుకు కావ‌ల‌సిన‌ ప‌త్రాల‌ను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఫైల్‌ చేయడం మంచిది. దీంతో మీ వైపు లోపాలు ఎత్తి చూపే అవ‌కాశాలు త‌గ్గ‌డంతో పాటు, రిఫండ్‌ల ప్రాసెస్ ప్ర‌క్రియ కూడా వేగంగా పూర్తిచేసేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది. అయితే,  ప‌న్ను దాఖ‌లు ప్రాసెస్‌ను ప్రారంభించేముందు ఈ నాలుగు విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి. 


1. కొత్త vs పాత ప‌న్ను విధానం.


కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2020 బ‌డ్జెట్‌లో కొత్త ప‌న్ను విధానాన్ని తీసుకొచ్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.   అయితే పాత ప‌న్ను విధానాన్ని ర‌ద్దు చేయ‌లేదు. ఆర్థిక‌ సంవ‌త్స‌రం..ఎఫ్‌వై21 నుంచి  వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు పాత, కొత్త ప‌న్ను విధానాల‌లో త‌మ‌కు అనుకూలంగా ఉండే ప‌న్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. కొత్త విధానంలో త‌క్కువ స్లాబ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పాత విధానంలో ప్ర‌కారం వ‌ర్తించే త‌గ్గింపులు, మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు కొత్త ప‌న్ను పాల‌సీలో వ‌దులుకోవ‌ల‌సి ఉంటుంది.



ఏ విధానాన్ని ఎంచుకున్నా.. సంవ‌త్స‌రం ప్రారంభంలోనే ఎంచుకోమ‌ని  స‌ల‌హా ఇస్తున్నారు నిపుణులు. పాత ప‌న్ను విధానంలో వ‌ర్తించే త‌గ్గింపులు, మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలకు అనుగుణంగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పెట్టుబ‌డులు చేయనివారు  కొత్త ప‌న్ను విధానాన్ని ఎంచుకోవ‌డం మంచింది. దీంతో త‌క్కువ స్లాబ్‌కి వ‌స్తారు కాబ‌ట్టి ప‌న్ను త‌గ్గుతుంది. 


వ్యాపార‌స్తులు మ‌రింత జాగ్ర‌త్తగా స‌రైన ప‌న్ను విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కార‌ణం ప‌న్నువిధానాన్ని ఎంచుకున్న‌ త‌రువాత ఒక‌సారి మాత్ర‌మే మార్చుకునేందుకు వీల‌వుతుంది. అయితే జీతం, ఇంటి ఆస్తి, ఇత‌ర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చుకోవ‌చ్చు. రెండు విధానాల‌లోనూ వ‌ర్తించే నిబంధ‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌న్ను లెక్కించి, ఏ విధానం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుందో నిర్ణ‌యించుకోవాల‌ని ఆదాయ‌పు ప‌న్ను ఫైల్లింగ్ పోర్ట‌ల్ ట్యాక్స్‌2విన్‌.ఇన్‌ (Tax2win.in) స‌హా వ్య‌వ‌స్థాప‌డ‌కుడు సీఈఓ అభిషేక్ సోని తెలిపారు. 


2. తేది పొడిగింపు, వ‌డ్డీ ఉప‌శ‌మ‌నం లేదు.


ఐటీఆర్ దాఖ‌లుకు సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు గ‌డువు పొడిగించారు. అయితే ప‌న్ను లైబిలిటీలో మాత్రం ఎలాంటి ఉప‌శ‌మ‌నం ఇవ్వ‌లేదు. ముందుస్తు ప‌న్ను(అడ్వాన్స్ ట్యాక్స్‌) చెల్లింపులు చేయ‌నివారు పెనాల్టీ వ‌డ్డీ చెల్లించాలి. అందువ‌ల్ల ప‌న్ను చెల్లించి వీలైనంత త్వ‌ర‌గా ఐటీఆర్‌ను దాఖ‌లు చేయ‌డం మంచిది. 


సెక్ష‌న్ 234ఏ కింద పెనాల్టీ వ‌డ్డీకి సంబంధించి కేంద్ర ప్ర‌త్యక్ష ప‌న్నుల విభాగం..సిబిడిటి కొంత స‌డ‌లింపు ఇచ్చింది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన ప‌న్ను చెల్లింపుదారుల‌ స్వీయ‌-అంచ‌నా ప‌న్ను (టీడీఎస్‌, అడ్వాన్స్ టాక్స్ మొద‌లైన‌వి చెల్లించిన‌ త‌రువాత‌) రూ. ల‌క్ష‌కు మించ‌కుంటేనే ఈ స‌డ‌లింపు వర్తిస్తుంది. ఇది రూ.1ల‌క్ష కంటే ఎక్కువ ఉంటే సెక్ష‌న్ 234ఏ కింద ఉప‌శ‌మ‌నం ల‌భించ‌దని ఆర్ఎస్ఎమ్ ఇండియా వ్య‌వ‌స్థాప‌కుడు సురేష్ సురానా అన్నారు. 


ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డంలో ఆల‌స్యం జ‌రిగితే సెక్ష‌న్ 234ఏ కింద 1శాతం చొప్పున నెల‌వారీ వ‌డ్డీని వ‌సూలు చేస్తూరు. ప‌న్ను విభాగం నిర్ణ‌యించిన తేదిల‌లోపు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అడ్వాన్స్ ప‌న్ను చెల్లించ‌డంలో విఫ‌లం అయిన ముంద‌స్తు ప‌న్ను చెల్లింపుదారుల‌కు సెక్ష‌న్ 234బి, 234సి వ‌డ్డీ చార్జ్ చేస్తారు. 



ప‌న్ను చెల్లింపుదారుడు ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌పోయినా, ప‌న్ను అంచనాలో 90 శాతం కంటే తక్కువ మొత్తాన్ని జ‌మ చేసినా.. బ‌కాయి ఉన్న మొత్తంపై సెక్ష‌న్ 234బి ప్ర‌కారం 1 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. 


సాధార‌ణంగా అడ్వాన్స్ ట్యాక్స్ త్రైమాసికంగా చెల్లించాలి. వీటికి ఆదాయపు ప‌న్ను శాఖ కొన్ని తేదీల‌ను నిర్ణ‌యిస్తుంది. ఈ తేదికి ముందే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించని వారికి సెక్ష‌న్ 234సి కింద వ‌డ్డీ పెనాల్టీ ప‌డుతుంది. 


అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే గ‌డువు..


జూన్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 15శాతం అడ్వాన్స్ చెల్లించాలి, 


సెప్టెంబ‌ర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 45శాతం అడ్వాన్స్ చెల్లించాలి. 


డిసెంబ‌ర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్ప‌టికే క‌ట్టిన ముంద‌స్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి. 


మార్చి 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్ను 100శాతం నుంచి అప్ప‌టికే క‌ట్టిక ముందస్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి. 


వ్యాపారం ద్వారా ఆదాయం లేని సినియ‌ర్ సిటిజ‌న్ల‌కు ముందుస్తు ప‌న్ను నుంచి మిన‌హాయింపు కల్పించారు. 


3. ప‌న్ను ఫారంల‌లో మార్పులు..

ప‌న్నులు చెల్లించ‌డంలో వ‌చ్చిన మార్పుల‌కు అనుగుణంగా ప్ర‌తీ సంవ‌త్సరం కొత్త ఐటీ ఫారంల‌ను రూపొందిస్తుంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. స‌రైన ఫారంను ఎంచుకునేందుకు ఈ మార్పుల‌ను తెలుసుకోవ‌డం అవ‌స‌రం.  ఈ సంవ‌త్స‌రం కూడా ఐటీఆర్‌-1 అర్హ‌త ప్ర‌మాణాల‌లో కొన్ని మార్పులు చేశారు. దీనిని సాధార‌ణంగా జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ప‌న్ను చెల్లింపుదారులు ఉప‌యోగిస్తారు.  సెక్ష‌న్ 194ఎన్ కింద న‌గ‌దు విత్‌డ్రా కోసం టీడీఎస్ డిడ‌క్ట్ చేసిన వ్య‌క్తులు లేదా య‌జ‌మాని నుంచి ఎంప్లాయిస్ స్టాక్ ఆప్ష‌న్‌(ఈఎస్ఓపీ)పై డిప‌ర్డ్ ట్యాక్స్ పొందిన వారు ఐటీఆర్ 1 ను దాఖ‌లు చేయ‌కూడ‌దు. ఈ మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని ఫారంల‌ను ఎంచుకోవాలి. 


4. క్లెయిమ్ చేయని తగ్గింపులు..

ప‌న్ను మిన‌హాయింపు పెట్టుబ‌డుల‌(జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటివి)కు సంబంధించిన ఫ్రూఫ్‌ల‌ను య‌జ‌మానికి ఇవ్వ‌డంలో విఫ‌లం అయితే ప‌న్ను డిడ‌క్ట్ అవుతుంది. అయితే దీన్ని గురించి ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు. ఐటీఆర్ దాఖ‌లు చేసేప్పుడు ఈ త‌గ్గింపుల‌ను క్లెయిమ్ చేసి, చెల్లించిన ప‌న్నును వాప‌సు పొంద‌వ‌చ్చు. అయితే వీటికి సంబందించి ఒక కాఫీని మీ వ‌ద్ద భ‌ద్ర‌ప‌ర‌చ‌డం మంచిది. 



ఈ సంవ‌త్సరం వ‌డ్డీ  ఆదాయం, అందుకున్న డివిడెండ్‌, మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్ల‌పై వ‌చ్చిన‌ మూల‌ధ‌న లాభాలు వంటి వాట‌న్నింటికి సంబంధించిన స‌మాచారం ఐటీఆర్ ఫారంల‌లో నిక్షిప్తం చేస్తుంది ఐటీశాఖ‌. త‌ప్పులు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈ స‌మాచారాన్ని మీ వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌తో పోల్చి చూడండి.  ఇందుకోసం ఫారం 16, ఫారం 26ఏఎస్ వంటి ప‌త్రాల‌ను, బ్యాంకు స్టేట్‌మెంట్ల‌ను ఐటీఆర్ ఫైల్లింగ్‌కు ముందే సేక‌రించి పెట్టుకోవాలి. 


టీడీఎస్‌(మూలం వ‌ద్ద ప‌న్ను), టీసీఎస్‌(మూలం వ‌ద్ద సేక‌రించిన ప‌న్ను) వంటివి ఫారం 26ఏఎస్‌లో జులై 15వ తేది నాటికి వారి వారి ఫారం 26ఏఎస్‌లో అప్‌డేట్ అవుతాయి. అప్ప‌టి వ‌ర‌కు మ‌దింపుదారులు వేచి ఉండ‌మ‌నేది నిపుణుల స‌లహా. టీడీఎస్‌, టీసీఎస్ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేది జూన్‌30 వ‌ర‌కు పొడిగించారు. అందువ‌ల్ల జులై 15 లోపు ఫారం 26ఏఎస్‌లో అప్‌డేట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని  క‌న్స‌ల్టింగ్ సంస్థ టాక్స్ క‌నెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ ఎల్ఎల్‌పీకి చెందిన వివేక్ జ‌ల‌న్ తెలిపారు. 


ఐటీఆర్‌ను ధృవీక‌రించే వర‌కు ప‌న్ను దాఖ‌లు ప్ర‌క్రియ పూర్తికాదు. ఐటీఆర్ దాఖ‌లు చేసిన 120 రోజుల్లో ఇది జ‌ర‌గాలి. ఆన్‌లైన్ ద్వారా గానీ, సంత‌కం చేసిన‌ ఐటీఆర్ -V ను పోస్ట్ చేయ‌డం ద్వారా గానీ ధృవీక‌రించ‌వ‌చ్చు.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |