APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori LEAVE FAQ
Showing posts with label LEAVE FAQ. Show all posts
Showing posts with label LEAVE FAQ. Show all posts
సెలవులు - మంజూరు అధికారాలు

సెలవులు - మంజూరు అధికారాలు

Mohan
APTF Updated at: March 21, 2022


G.O.Ms.No.58 విద్య తేది:22-04-2008  ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి, కాలక్రమేణ ఆ నియమాలను సవరిస్తూ G.O.Ms.No.70* విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు  చేయాలో తాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:

ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు  మించకుండా మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:

ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

ప్రసూతి సెలవు(Maternity Leave):

 మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు  G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

మండల విద్యాధికారులు:

తన పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ప్రాథమికోన్నత  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

ఉప విద్యాధికారి:

తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

జిల్లా విద్యాధికారి:

జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/అర్ధవేతన, కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం॥ వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సం॥ వరకు అన్ని రకాల సెలవులు మంజూరు  చేస్తారు.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:

మండల విద్యాధికారులకు/ఉన్నత/ ప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సం॥ నుండి 4 సం॥ వరకు సెలవు మంజూరు చేస్తారు.

 కొన్ని ముఖ్యాంశాలు:

  • సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.
  • సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.
  • నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4వ కేటగిరీకి బదిలీచేస్తారు.
  •  అధికంగా వాడుకున్న సెలవును  FR-18 ప్రకారం  అనధికార గైర్హాజరుగా భావించి డైస్ నాన్ గా ప్రకటిస్తారు

ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల గురించి తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు.

ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల గురించి తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు.

Mohan
APTF Updated at: September 30, 2021


వివరాలు

  • సాధారణ సెలవులు (CL) వరుసగా 10 రోజులు వాడరాదు.
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్
    లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు.
  • దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి (క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు.
  • COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.
  • EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు.
  • EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసుకోవచ్చు.
  • GO .MS NO.232, DT 16.9.2005
  • EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు భావిస్తారు.
  • GO. MS NO.129, DT 1.6.2007 
  • HALF PAY LEAVE (PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెల్లిస్తారు.
  • HALFPAY LEAVE కి? PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు.
  • HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును.
  • ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు.
  • ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి 8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెల్లిస్తారు. 
  • Surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసుకోవచ్చు.
  • SURRENDER LEAVE కి IR ఇవ్వరు.
  • MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును.
  • ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును.
  • ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును.
  • ఈ సెలవులో ఉండగా transfer  కొత్త ప్లేస్ report చేసి  సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును.
  • అబార్షన్ జరిగిన వారికి 6-week సెలవు ఇచ్చును.
  • GO MS NO 762, DT 11.08.1976 
  • PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.
  • CHILD CARE LEAVE అనేది 60 రోజులు.
  • ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు  పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేవరకూ అనుమతి..
  • ప్రత్యేక సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు.
  • దీనికి children date of birth certificate submit చేయాలి.
  • ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు.
  • 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి PREFIX, SUFIX వాడుకోవచ్చు
  • 10 రోజులు దాటని సెలవులకు ముందు, వెనుక రెండు రోజులు రావాలి.
  • 10 రోజులు లోపు సెలవులు వస్తే ముందు, వెనుక రోజుకు ముందు CL వాడుకోవచ్చు.

చైల్డ్ కేర్ లీవ్ గురించి తెలుగులో పూర్తి సమాచారం...అప్లికేషన్...మోడల్ ప్రొసీడింగ్స్....

చైల్డ్ కేర్ లీవ్ గురించి తెలుగులో పూర్తి సమాచారం...అప్లికేషన్...మోడల్ ప్రొసీడింగ్స్....

Mohan
APTF Updated at: December 03, 2019

CHILDCARE LEAVE CLARIFICATIONS IN TELUGU AND CHILD CARE LEAVE APPLICATION & PROCEEDINGS FOR PS,UPS & HIGH  SCHOOL TEACHERS


CHILD CARE LEAVE
మహిళాఉద్యోగులు, టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు 'మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో.209 తేది:21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

60 రోజుల సీసీయల్ ను మూడు విడతలుగా  మంజూరుచేయాలి.

180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.

వివరణ:
ఇక్కడ 60రోజులను మూడు విడుతలు తగ్గకుండా అంటే ప్రతి విడత 20 రోజులే తీసుకోవాలని కాదు అని గమనించవలేను.
  • 58+1+1(min 3times)✔
  • 57+1+1+1(above 3times)
  • 59+1(below 3times)✖
  • 30+30(below 3times)✖
  • 1+1+1.......60సార్లు 
  • (above 3times means here followed min 3times)✔
  1. కనీసం మూడు సార్లకు తగ్గకుండా (compulsory), 
  2. గరిష్టంగా 60 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు(optional)
  3. గరిష్టంగా ఎన్నిసార్లు ఉపయోగించుకోవాలో ఉపాధ్యాయురాలి ఐచ్ఛికం.
  4. childcare leave ఒక్కరోజు కూడా పెట్టవచ్చు.
  5. ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.
  6. 40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.
  7. ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
  8. మహిళా ఉద్యోగుల,టీచర్ల  పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్మం జూరుచేస్తారు.
  9. పిల్లల పరీక్షలు, అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.
  10. కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.
  11. శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.
  12. మంజూరు సమయంలో ఏ రకమైన సర్టిఫికెట్లు జతపరచవలసిన అవసరంలేదు.
  13. ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.
  14. ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.
  15. శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.
  16. ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.
  17. రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు.


DOWNLOAD...CHILD CARE LEAVE GO.132



DOWNLOAD....CHILD CARE LEAVE APPLICATION & PROCEEDINGS FOR PS,UPS



DOWNLOAD...CHILD CARE LEAVE APPLICATION & PROCEEDINGS FOR HIGH  SCHOOL TEACHERS

ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?

ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?

Mohan
APTF Updated at: September 17, 2019


  1. G.O.Ms.No.52 Fin తేది:1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు.అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును

మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా?

మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా?

Mohan
APTF Updated at: September 17, 2019


జీఓ.2391 తేదీ:3.10.1960 ప్రకారం వైద్య కారణాల పై ఏ ఇతర సెలవు నైనా ప్రసూతి సెలవు తో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఓ ను అనుసరించి మెడికల్ లీవ్ తో కలిపి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చు.

EOL కాలాన్ని మెడికల్ లీవ్ గా మార్చుకోవచ్చా?

EOL కాలాన్ని మెడికల్ లీవ్ గా మార్చుకోవచ్చా?

Mohan
APTF Updated at: September 17, 2019

సెలవు నిబంధనలు ప్రకారం ఒకసారి EOL గా మంజూరు చేఇ0చుకొన్న సెలవును మెడికల్ లీవ్ గా మార్చుకొనే అవకాశం లేదు

విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు?

విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు?

Mohan
APTF Updated at: September 17, 2019

విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు DY. EO,6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చే ఇంచుకోవాలి.

అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా?

అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా?

Mohan
APTF Updated at: September 17, 2019


జీఓ.28 తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.

నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?

నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?

Mohan
APTF Updated at: September 17, 2019


వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.

"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?

"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?

Mohan
APTF Updated at: September 17, 2019

1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.

CCL ఒకేసారి వాడుకోవచ్చా?

CCL ఒకేసారి వాడుకోవచ్చా?

Mohan
APTF Updated at: September 17, 2019


మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు.

మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?

మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?

Mohan
APTF Updated at: September 17, 2019

జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు

సాధారణ సెలవులు (Casual Leave ) ఉన్నప్పటికీ C.C.L వాడుకొనవచ్చునా ?

సాధారణ సెలవులు (Casual Leave ) ఉన్నప్పటికీ C.C.L వాడుకొనవచ్చునా ?

Mohan
APTF Updated at: September 17, 2019

Memo.No.934/Poll-B/63 - 2, Dated: 26 - 04 - 1963 ప్రకారం సాధారణ సెలవులు (Casual Leave )ఉన్నప్పటికీ C.C.L 's  వాడుకొనవచ్చును

CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు?

CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు?

Mohan
APTF Updated at: September 17, 2019


CL వరుసగా 10 రోజులు పెట్టుకోవచ్చు.

స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు?
ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు

మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?

మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?

Mohan
APTF Updated at: September 17, 2019


అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.

చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

Mohan
APTF Updated at: September 17, 2019

G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి.మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది

చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరంలో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా?

చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరంలో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా?

Mohan
APTF Updated at: September 17, 2019


♦G.O.Ms.No.132, Dated. 06.07.2016 ప్రకారం లీవు మూడు సార్లుకు తక్కువ కాకుండా అంటే ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 సంవత్సరాలు నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి. అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.

🔹Child Care leave of  two  months  can be  sanctioned in not less  than 3 spells  to look after two children up to the age of  18 years and with disabled children up to 22  years. The Child  Care leave would be  permitted  only  if  the  child is dependent on the Government  servant.

     Click here for G.O.Ms.No.132

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |