ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు- బలోపేతం చేయాలి! పువ్వల.ధనంజయ రావు, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణా కమిటీ కన్వీనర్ మరియు APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి
నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠశాలలను నిర్వీర్యం చేయడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాథమిక పాఠశాల నుండి 3 ,4, 5 తరగతుల ను విడదీసి ముక్కలు చేయవద్దని,ప్రాథమిక పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. అంతేకాక ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 8880 ఉన్నాయని వాటిల్లో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత స్థాయి వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగాలని, సమాంతర మాద్యమాలను కొనసాగించాలని తెలిపారు. కుల వ్యవస్థను ప్రేరేపించే జాతీయ విద్యా విధానాన్ని అందరూ తిరస్కరించాలని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో ఆరు రకాల పాఠశాలను ఏర్పాటు చేయడం, అందులో పాఠశాలను ముక్కలు చేయడం ద్వారా ప్రైమరీ విద్యార్థులు దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలకి వెళ్ళ లేక బడి మానేసే ప్రమాదం ఉందని తెలిపారు.3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం వల్ల వేరు వేరు సమయ పట్టిక అమలు వలన పరిస్థితి చాలా గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలో కలపడాన్ని, ఉన్నత పాఠశాలలో +2(ఇంటర్మీడియట్) విద్యను ప్రవేశపెట్టడాన్ని, ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో 20:1 చొప్పున విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఉండేలా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని, మెమో 172ను సవరించాలని కోరుతూ విజయనగరం లో కోట వద్ద APSEC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో APSEC జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు APTF జిల్లా అధ్యక్షులు డి ఈశ్వర రావు, జిల్లా APTF బాధ్యులు ఎన్ వి పైడి రాజు, దామోదర నాయుడు, ఎ వి శ్రీనివాస్, పి రాజశేఖరం, శ్రీనివాసరావు, కె మధుసూదన రావు,N కూర్మా రావు ,I Ch. సత్యనారాయణ, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను జయప్రదం చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా శాఖ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాము.