APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori SSC
Showing posts with label SSC. Show all posts
Showing posts with label SSC. Show all posts
SSC exams 2023 - SSC విద్యార్థుల వివరాలు లో ఏమైనా పొరపాట్లు ఉంటే 09.01.2023 లోపు ఆన్లైన్ లో ఎడిట్ చేసుకొనే అవకాశం

SSC exams 2023 - SSC విద్యార్థుల వివరాలు లో ఏమైనా పొరపాట్లు ఉంటే 09.01.2023 లోపు ఆన్లైన్ లో ఎడిట్ చేసుకొనే అవకాశం

Mohan
APTF Updated at: January 05, 2023

 


ఆన్లైన్ లో ఎంటర్ చేసిన SSC విద్యార్థుల వివరాలు లో ఏమైనా పొరపాట్లు గుర్తించినట్లు అయితే 


తేదీ : 09.01.2023 లోపు ఆన్లైన్ లో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడినది


కావున హెడ్మాస్టర్ లు అందరూ 

ప్రతి విద్యార్థి కి సంబందించి కింది వివరాలు 

వెబ్సైట్ లో చెక్ చేయండి.


1 అభ్యర్థి పేరు, 


2 తండ్రి పేరు, 


3 తల్లి పేరు మరియు

పుట్టిన తేదీ వంటి అన్ని ఎంట్రీలు అటెండెన్స్ రిజిస్టర్‌తో కాకుండా అసలు అడ్మిషన్ రిజిస్టర్‌తో  ధృవీకరించబడాలి. 


బోధనా మాధ్యమం, సబ్జెక్టులు, 1st, 2nd మరియు 3rd lanuages పాఠశాల రికార్డుల ఆధారంగా ధృవీకరించబడాలి.


కాంపిటెంట్ అథారిటీల నుండి పొందిన age condonation  ఆర్డర్‌లతో తక్కువ వయస్సు గల అభ్యర్థుల వివరాలు కూడా నామినల్ రోల్‌లో చేర్చబడ్డాయని ధృవీకరించాలి.


 2022-23 విద్యా సంవత్సరానికి పాఠశాల గుర్తింపు పొందిందని ధృవీకరించాలి.


పై వివరాలు అన్ని  అందరి విద్యార్థులకు చెక్ చేయాలి అవసరం అయితే ఎడిట్ చేయవచ్చు


విద్యార్థుల అందరి వివరాలు చెక్ చేసిన తర్వాత

ప్రతి కాండిడేట్ ను సెలెక్ట్ చేసుకుని


లిస్ట్ చివరన గల Generate pdf 

పై క్లిక్ చేసి నామినల్ రోల్ ప్రింట్ తీసుకోవాలి.


     _____

ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌  పరీక్షలు

ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు

Mohan
APTF Updated at: December 31, 2022

  •  ఈసారి ఆరు పేపర్లే.. సైన్స్‌లో ఒకటే
  • తొలిసారిగా రోజు మార్చి రోజు పరీక్ష
  • ఉదయం 9.30 నుంచి 12.45 వరకూ
  • 15న ముగియనున్న రెగ్యులర్‌ పరీక్షలు


 రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురే్‌షకుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. గతేడాది వరకూ సెలవులు వస్తే మినహా వరుస రోజుల్లో పరీక్షలు జరిగేవి. అయితే ఇప్పుడు తొలిసారిగా రోజు విడిచి రోజు పరీక్షల విధానం ప్రవేశపెట్టారు. ప్రతి రెండు పరీక్షల మధ్య కనీసం ఒకరోజు ఖాళీ ఉండేలా షెడ్యూల్‌ రూపొందించారు. అలాగే గతేడాది వరకూ సైన్స్‌ పరీక్షను రెండు రోజులు జరిపి మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరీక్ష ఒకరోజు మాత్రమే జరగనుంది. దీంతో మొత్తం పేపర్ల సంఖ్య ఆరుకే పరిమితమైంది. రెగ్యులర్‌ పరీక్షలన్నీ 15వ తేదీతోనే ముగుస్తుండగా, 17, 18 తేదీల్లో ఓరియంటల్‌ ఎస్‌ఎ్‌ససీ, ఒకేషనల్‌ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే ప్రథమ భాష పేపర్‌-2 (కాంపోజిట్‌ కోర్సు) పరీక్ష 9.30నుంచి 11.15 వరకు, ఎస్‌ఎ్‌ససీ ఒకేషనల్‌ కోర్సు థియరీ పరీక్ష 9.30 నుంచి 11.30 వరకు జరగనున్నాయి. ఇప్పటి వరకూ 6,60,859 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నిర్దేశిత రుసుము కంటే అదనంగా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.


♦️పరీక్షల షెడ్యూలు ఇలా..

తేదీ సబ్జెక్టు మార్కులు

▪️ఏప్రల్‌ 3 -  ప్రథమ భాష 100 /   ప్రథమ భాష-1 (కాంపోజిట్‌ కోర్సు) 70

▪️ఏప్రిల్‌ 6 ద్వితీయ భాష 100

▪️ఏప్రిల్‌ 8 ఇంగ్లిష్‌ 100

▪️ఏప్రిల్‌ 10 గణితం 

▪️ఏప్రిల్‌ 13 సైన్స్‌ 

▪️ఏప్రిల్‌ 15 సోషల్‌ స్టడీస్‌ 1

▪️ఏప్రిల్‌ 17 ప్రథమ భాష-2 (కాంపోజిట్‌ కోర్సు) 30

▪️ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 100

▪️ఏప్రిల్‌ 18 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 100

▪️ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ) 40, 30

SSC -Public Examinations, March /April -2023-MNR submission by Schools -Instructions -Reg

Mohan
APTF Updated at: December 30, 2022

 


పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో దివ్యాంగులయిన విద్యార్థులకు రాయితీలు, మినహాయింపులు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో దివ్యాంగులయిన విద్యార్థులకు రాయితీలు, మినహాయింపులు

Mohan
APTF Updated at: December 22, 2022

 ఆంధ్రప్రదేశ్ SSC బోర్డు నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వివిధ రకాల రాయితీలు, సదుపాయాలు, మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వంGO.MS. No. 86 ప్రకారం కల్పించింది. దివ్యాంగులయిన విద్యార్థులు అందరికీ పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడింది. హెచ్ఎంలు నామినల్ రోల్స్ పంపేటప్పుడు దివ్యాంగుల వివరాలను తప్పక పంపాలి. లేనిపక్షంలో, వారిని సకలాంగులుగా గుర్తించి వీరికి ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. కనుక అన్ని స్కూళ్లలో దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించి,  వారికి ఉన్న ప్రత్యేక సదుపాయాలు గురించి తప్పక తెలియజేయాలి.

 అందులో ముఖ్యమైనవి 

  • 1)  శారీరక వికలాంగులైన విద్యార్థులకు( Orthopedic) ఏదైనా ఒక భాష(Language) నుండి పరీక్ష రాయకుండా మినహాయింపు ఇవ్వబడింది. మిగిలిన పరీక్షలు అన్నిట్లో 35 మార్కులు తప్పక సాధించాలి.
  • 2) అదేవిధంగా అంధులకు( Blinds) కూడా ఏదైనా ఒక భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. కానీ మిగిలిన 5 సబ్జెక్టులలో కనీసం 20 మార్కులు సాధిస్తే పాస్  అయినట్లే.
  • 3) వినికిడి లోపం( Deaf) గల విద్యార్థులకు రెండు భాషల నుండి మినహాయింపు ఇవ్వబడినది.  మిగిలిన 4  సబ్జెక్టులలో 20 మార్కుల సాధిస్తే వారు పాస్ అయినట్లే.
  • 4) మాటలోపం( Speech Problem) గల విద్యార్థులకు   అన్ని (6) సబ్జెక్టులలో 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే.
  • 5)మానసిక వికలాంగులైన విద్యార్థులకు అన్ని పరీక్షలు రాయవలసిందే ,-కానీ వీరికి అన్ని సబ్జెక్టులలో 10 మార్కులు చొప్పున సాధిస్తే పాస్ అయినట్లే.
  • 6) అదేవిధంగా కుష్టు వ్యాది నయగ్రస్తులు ( Leprosy Cured),  సెరిబ్రల్ పాలసీ(CP), మరుగుజ్జులు( Dwarf),  కండర పక్షవాతం( Muscular Distrophy) మరియు యాసిడ్ దాడికి గురైన వారు మొదలగు వర్గాలకు ఏదైనా ఒక భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. అన్ని సబ్జెక్టులలో కనీస మార్కులు 10 సాధిస్తే పాస్ అయినటట్లే.
  • 7)బహుళవైకల్యం,  దీర్ఘకాలిక నరాలకు సంబంధించిన వైకల్యం,  పార్కిన్ సన్స్, హిమోఫిలియా, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా తదితర వైకల్యాలు గల విద్యార్థులకు మూడో భాష  ఇంగ్లీష్ నుండి మినహాయింపు ఇవ్వబడింది. వీరు 35 మార్కులు సాధిస్తేనే పాస్
  • 8) అభ్యసన వైకల్యం( Learning Disabled Students) కు ఇంగ్లీషు భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. మిగిలిన 5 సబ్జెక్టులలో 15 మార్కులు చొప్పున వస్తే పాస్ అయినట్లే.
  • 9) అందులకు,  చేతులకు సంబంధించిన వైకల్యం గల శారీరక వైకల్యం గల వారికి , MR, CP.  న్యూరో సమస్యలు గలవారిలో చేతులు స్వాధీనం లో లేనివారికి మాత్రమే ( Scribe) ఒక సహాయకుడిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రతి గంటకు 20 నిమిషాలు చొప్పున అధనపు సమయం కేటాయిస్తారు.

 CWSN. విద్యార్థుల కు వారి అవసరాన్ని బట్టి వివిధ పరికరాలు, కుర్చీలు, కంటి అద్దాలు, క్యాలిక్యులేటర్లు, శ్రావణ యంత్రాలు,  కృత్రిమ అవయవాలు, Care Takers సేవలను ఉపయోగించుకోవచ్చు. Scribe, ప్రత్యేక పరికరాలు, సదుపాయాలు కావాలనుకునే వారు ముందుగా విద్యాశాఖ అధికారులకు, పరీక్ష కేంద్రం Chief Examiner కు రాతపూర్వకంగా తెలిపి అనుమతి తీసుకోవాలి.

       పై సదుపాయాలు అన్నింటిని వైకల్యాల ఆధారంగా విద్యార్థులకు తప్పక అవగాహన కల్పించాలి. వికలాంగ విద్యార్థులు  సధరం వైకల్య సర్టిఫికెట్  లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్ అందించిన మెడికల్  సర్టిఫికెట్లు అందజేయాలి. 

        హెడ్మాస్టర్లు నామినల్ రోల్స్ పంపే సమయంలోనే దివ్యాంగుల కు ఆయా వైకల్య కోడ్ వేసి పంపితే , వారి వైకల్యాల ఆధారంగా వారికి మినహయింపులు ఇచ్చిన సబ్జెక్టు మినహా మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు మాత్రమే పరీక్ష కేంద్రాలకు పంపబడును.

Locomotor Disability means Orthopaedically Handicapped.

Intellectual Disability means MR.


టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు  గడువు 24 వరకు పొడిగింపు

టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు 24 వరకు పొడిగింపు

Mohan
APTF Updated at: December 20, 2022

 రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష లకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ, వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పొడిగింపు తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజులు చెల్లించాలని పేర్కొ న్నారు. ఆలస్య రుసుం రూ.50తో డిసెంబర్ 25 నుంచి 29 వరకు, రూ.200తో డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో జనవరి 4 నుంచి 9 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.



SSC EXAMINATION 2022-23 REVISED FFE DETAILS


🌴Without late fee :: 24-12-2022


🦋With late fee fine of Rs. 50/- :: 25-12-2022 to 29-12-2022


🌴With late fee fine of Rs. 200/- :: 30-12-2022 to 03-01-2023


⛱️With late fec fine of Rs. 500/- :: 04-01-2023 to 09-01-2021

డిజి లాకర్‌లో పదో  తరగతి మెమోలు

డిజి లాకర్‌లో పదో తరగతి మెమోలు

Mohan
APTF Updated at: December 10, 2022

  •  డిజి లాకర్‌లో పదో తరగతి మెమోలు
  • 2017 నుంచి 2022 వరకు అందుబాటులోకి


రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి మార్కుల మెమోలను డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 2017 నుంచి 2022 వరకు చదివిన అభ్యర్థుల మార్కుల మెమోలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల ధ్రువపత్రాల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షల విభాగాలను.. మార్కుల జాబితాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం మొట్టమొదటగా పదో తరగతి మెమోలను వెబ్‌సైట్‌లో పెట్టింది. త్వరలో 2004 నుంచి ఉన్న డేటాను అప్‌లోడ్‌ చేయనున్నారు. అభ్యర్థులు ఎవరైనా తమ మెమోలను పోగొట్టుకుంటే డిజి లాకర్‌లోకి వెళ్లి పొందవచ్చు. ఆధార్‌ నంబరు నమోదు చేసి, సర్టిఫికెట్‌ను పీడీఎఫ్‌ రూపంలో పొందొచ్చని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ఆధార్‌ కార్డులోని పేరు, సర్టిఫికెట్‌లోని పేరు ఒకేలా ఉంటేనే ఈ సాధ్యమవుతుందని వెల్లడించారు.


SSC Public Exams 2023- Revised Fee Payment Schedule - SSC Exam Fee Details

Mohan
APTF Updated at: December 09, 2022

 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది . గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 11 చివరి తేదీ కాగా .. దానిని 20 వ తేదీ వరకు పెంచినట్లు ఆ విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు .


 21 నుంచి 26 వరకు రూ .50 , 27 నుంచి జనవరి 2 వరకు రూ .200 , 3 నుంచి 9 వరకు రూ .500 అప రాధ రుసుముతో కలిపి చెల్లించవచ్చని వివరించారు












ఆన్లైన్లో టెన్త్ విద్యార్థుల  వివరాలు

ఆన్లైన్లో టెన్త్ విద్యార్థుల వివరాలు

Mohan
APTF Updated at: November 26, 2022

 అన్ని పాఠశాలల యాజమాన్యాలు 2020-23 విద్యాసంవత్సరం టెన్త్ విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి/ఏప్రిల్ - 2023లో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తుల నమోదు, ఫీజు చెల్లింపు ప్రక్రియకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు, ఆయా పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధానాలను www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల సూచనలు, యూజర్ మాన్యువల్ పేరుతో పొందుపరిచినట్లు వివరించారు. విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు అందులో పేర్కొన్న అన్ని విషయాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.


Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |