APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APSEC
Showing posts with label APSEC. Show all posts
Showing posts with label APSEC. Show all posts

NEP 2020 , రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ APSEC ఆధ్వర్యంలో నిరసన : నంద్యాల

Mohan
APTF Updated at: April 09, 2022

 జాతీయ విద్యా విధానం (యన్.ఈ.పీ.) 2020 ని, రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ.పీ.టీ.ఎఫ్.1938. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సాంబశివుడు, జిల్లా అదనపు కార్యదర్శి నగిరి.శ్రీనివాసులు మాట్లాడుతూ యన్.ఈ.పీ.అమలు లో బాగంగా ప్రాథమిక పాఠశాలలను విడదీసి 3.4.5.తరగతులను 3. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు అంతదూరం వెళ్ళలేక డ్రాపౌట్సు గా మారే ప్రమాదం ఉందని కాబట్టి దీనికి సంబంధించిన జి.ఒ.నెంబర్ 85   ను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను బలహీన పరుస్తూ 4674 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబర్  37 ను వెంటనే రద్దు చేయాలని ఉన్నత పాఠశాలలో విధిగా తెలుగు మీడియం ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీనియర్ నాయకులు యం.పుల్లయ్య, యం.రవి.మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులతో డీ.ఎస్సీ.ని ప్రకటించి, భర్తీ చేయాలని, వివిధ రకాల యాప్ లను తొలగించి ఉపాధ్యాయులకు బోధనచేసే స్వేచ్ఛ ను కల్పించాలని, అలాగే రాష్ట్రంలో సి.బి.యస్.ఈ. సిలబస్ ను అమలు చేయవద్దని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్న"నూతన జాతీయ విద్యా విధానం 2020" ని  రాష్ట్రం లో అమలు చేయకూడదని వారు డిమాండ్ చేశారు.

విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని కోరారు.

కావున ప్రభుత్వం వెంటనే విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో చర్చించి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.




ఈ నిరసన కార్యక్రమం లో గోపాల్ రావు, వై.విజయ కుమార్, యస్.వెంకటరమణ, డి.మౌలాలి. మద్దిలేటి,. రాంప్రసాద్,.యన్.రమణ., బత్తుల రవి కుమార్, యం.పవన్., కృష్ణమూర్తి., AISF సీటీ కన్వీనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.



ప్రాధమిక పాఠశాలలను ముక్కలు చెయ్యవద్దు. APSEC డిమాండ్ :: టెక్కలి

Mohan
APTF Updated at: April 09, 2022

        జాతీయ విద్యా విధానం 2020 అమలు పేరుతో రాష్ట్రం లోని ప్రాధమిక పాఠశాల లను ముక్కలు చేయవద్దని ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం టెక్కలిలో జరిగిన ప్రదర్శన లో 3,4,5 తరగతుల పిల్లలను మూడు కిలోమీటర్ ల దూరం లోని ఉన్నత పాఠశాలలకు తరలించడం తో డ్రాపౌట్ లు పెరుగుతాయని, అలాగే 1,2 తరగతుల పిల్లలను అంగన్వాడీలకు అప్పగించి ఇంటర్మీడియట్ విద్యార్హత గలవారితో బోధన చేయించే ఆలోచన విరమించాలని ఏపీటీయఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవసరమైన 25 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరుతుంటే అదిచేయకుండా ఉన్న యస్ జీ టీ పోస్టులను తరలిస్తూ ఉత్తర్వులను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమం ఉన్నత పాఠశాలల లో కోనసాగించాలని డిమాండ్ చేశారు.

        విద్యారంగ మేధావులు,విద్యా పరిరక్షణ కమిటీ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించి విద్యాప్రగతి కి దోహదపడాలని హితవు పలికారు.

           ఈ కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ మరియు ఏపి టీయఫ్ నాయకులు వై శేషగిరిరావు,కే.సూర్యనారాయణ, గున్న ప్రసాదరావు, యన్ సురేష్ కుమార్, వజ్జ ఆదినారాయణ, కళ్యాణ్ చక్రవర్తి, బమ్మిడి క్రిష్ణారావు, కే చిన్నారావు, శివానంద్, కాంతమ్మ,చిట్టెన్న, ఫల్గుణరావు, నారాయణరావు,వానయ్య,లోకు,నారాయణమూర్తి, మాధవరావు, బీ రామారావు, యం నారాయణమూర్తి, జీ శ్రీనివాసరావు, ఫల్గుణరావు, బీ నారాయణరావు, నాయుడు మోహన్, నాగరాజు, బీ వెంకటరావు తదితరులు కూడా పాల్గోన్నారు

        వివిధ రకాల యాప్ ల నిర్వహణ తో ఉపాధ్యాయులకు పనిభారం పెరగడంతో బోధనకు అవకాశం తగ్గినందున ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు.








ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు...APSEC & APTF బొబ్బిలి

Mohan
APTF Updated at: April 09, 2022

 ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం చేయొద్దు... విద్యా పరిరక్షణ సమితి ఏ పి టి ఎఫ్ బొబ్బిలి....... అప్రజాస్వామిక ,విద్యా ప్రతిబంధక నూతన విద్యా విధానాన్ని 2020 ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ వ్యతిరేకిస్తుంది .ఈరోజు బొబ్బిలి విద్యావనరుల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 నిరసన తెలియజేసింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చప్పా వెంకటరమణ మాట్లాడుతూ 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల వరకు తరలించే జిఓ నెంబర్ 85 ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 ఉండాలని,  ఉన్నత పాఠశాలలో  రెండు మాధ్యమాలను కొనసాగించాలని, 4674 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసేందుకు ఇచ్చిన జీవో నెంబర్ 37 రద్దు చేయాలని ,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యను ఉన్నది జాబితానుంచి రాష్ట్ర పరిధిలోకి వచ్చేటట్టుగా రాష్ట్ర చట్టసభల్లో తీర్మానం చేయాలని అన్నారు ప్రాథమిక పాఠశాల ముక్కలు చేస్తే తల్లిదండ్రులతో, ప్రజలతో ప్రజాతంత్ర పోరాటం చేయడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదనంతరం మండల విద్యాశాఖ అధికారి చల్ల లక్ష్మణ రావు గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ వినతిపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంట సత్యనారాయణ, బొబ్బిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తేంటుభాస్కర్ రావు ,కోట గోపాలకృష్ణ, ఎం ప్రసాద్ రావు చిన్ని కృష్ణ, సింహాచలం, వెంకటేశ్వరరావు చక్రధర్ పాల్గొన్నారు






AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన

Mohan
APTF Updated at: April 07, 2022

 



AIFRTE - APSEC పిలుపు మేరకు NEP & రాష్ట్రంలో అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ నేడు ప్రారంభ రోజు విజయవాడ లెనిన్ సెంటర్ లో డిమాండ్స్ బ్యానర్ ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది. ఏప్రిల్ 7,8,9 తేదీల్లో APSEC భాగస్వామ్య సంఘాలు నిర్దేశించుకున్న మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా శాఖలకు తెల్పడమైనది.         ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సంఘాలు APTF:1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: హృదయ రాజు, కులశేఖర రెడ్డి DTF రాష్ట్ర గౌరవ అధ్యక్షులు: కృష్ణయ్య , రెండు PDSU రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు రవిచంద్ర, రామకృష్ణ, రాజేష్ , APTF రాష్ట్ర కౌన్సిలర్ బిన్నీ, PDSU నాయకులు పాల్గొన్నారు


ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి!

Mohan
APTF Updated at: October 21, 2021


ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలింపును నిరసిస్తూ  రాష్ట్రంలో ఖళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని  అనంతపురం  డి ఆర్ ఓ గారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా కన్వినర్ జి. రవీంద్ర, ఎపిటిఎఫ్1938, జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యం.వెంకటసుబ్బయ్య, జిల్లా అదనపు ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్, నాయకులు నాగిరెడ్డి, షమీవుల్లా, డి టి ఎఫ్ నాయకులు జార్జి, సాలవేముల బాబు తదితరులు పాల్గొన్నారు.

APSEC ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో నూతన జాతీయ విద్యావిధానం అమలును నిరసిస్తూ నిర్వహించిన బ్యానర్ ప్రదర్శన కార్యక్రమం.

Mohan
APTF Updated at: October 02, 2021

 నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ వద్ద APSEC ,నెల్లూరు ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యానర్ ప్రదర్శన కార్యక్రమం







పై కార్యక్రమంలో పాల్గొన్న APTF,DTF, PDSU,AISF, PDSU కార్య కర్తలు కు ధన్యవాదాలు APSEC,Nellore


------------------------------------------

ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ పిలుపు మేరకు అనంతపురము జిల్లా విద్యాపరిరక్షణకమిటీ,ఎపిటిఎఫ్1938,డి టి ఎఫ్ ,పి డి యస్ యు,ఏ ఐ యస్ ఎఫ్,పిడియస్ యు,సమ్యుక్త భాగస్వామ్యంలో స్థానిక్ టవర్ క్లాక్ గాంధీ విగ్రహం ముందు ప్రజా వ్యతిరేక నూతన జాతీయ విద్యావిధానం అమలును నిరసిస్తూ బ్యానర్ ప్రదర్శన జరిపారు.ఈ కార్యక్రమానికి ఎపిటిఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కులశేఖరరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ...
‌1)ప్రజా వ్యతిరేక నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయరాదు.
‌2)రాష్ట్రంలో కాళీగా వున్న 23000 ఉపాద్యాయ ఖాళీలు భర్తీ చేయాలి.
3)ప్రాథమిక పాఠశాలల విభజన ఆపేయాలి.  తదితర డిమాడ్లు నినదించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అనంతపురం జిల్లా కన్వీనర్ జి.రవీంద్ర నాయకులు విశ్వనాధరెడ్డి,వెంకటరెడ్డి,వెంకటసుబ్బయ్య,పి.వ ప్రసాద్, శ్రీనివాసనాయక్,గంగిరెడ్డి,ఆంజనేయులు నాయక్,నరసింహులు ,అంకిరెడ్డి,వజీర్,ఆదినారాయణ, పిడుగు శ్రీనివాసులు,నారాయణరెడ్డి, లక్ష్మి నారాయణ ,నాగసైనారెడ్డి, ఫక్రుద్దీన్, రమేష్ రెడ్డి, గోవిందరెడ్డి, రాజ మోహన్ డిటి ఎఫ్ నాయకులు జార్జి,చలివేముల బాబు,పురుశోత్తం,ఫిడి యస్ యు నాయకులు వీరేంద్ర,శంకర్ ఏ ఐ యస్ ఎఫ్ నాయకులు మనోహర్,ఆనంద్ పాల్గొన్నారు


----------------------------------------------------------------------------

ఈ రోజు అనగా 02-10-2021గాంధీజయంతి రోజు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ సమితి పిలుపు మేరకు గిద్దలూరు గాంధీ బొమ్మ కూడలిలో ఏ. పి . టి. ఎఫ్. 1938 రాష్ట్ర కార్యదర్శి యల్లా. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  ఎన్. ఇ. పి. 2020 విద్యా విధానం అమలు చేయరాదని, 23వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలలు విడదీయరాదని డిమాండ్ చేశారు. 







 ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యల్లా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు యస్ హెచ్ కబీర్, జిల్లా కార్యదర్శి డి. వెంకటేశ్వర్లు, మండల నాయకులు వి. రవిశంకర్ డి. వి. పిచ్చయ్య, జి. పాండు, టి. పాండు రంగస్వామి, యం. వి. రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.







ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు-  APSEC  కన్వీనర్ & APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు- APSEC కన్వీనర్ & APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

Mohan
APTF Updated at: August 12, 2021

ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు- బలోపేతం చేయాలి! పువ్వల.ధనంజయ రావు, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణా కమిటీ కన్వీనర్ మరియు APTF1938 విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి
 


నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠశాలలను నిర్వీర్యం చేయడం  మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రాథమిక పాఠశాల నుండి  3 ,4, 5 తరగతుల ను విడదీసి ముక్కలు చేయవద్దని,ప్రాథమిక పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. అంతేకాక  ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 8880 ఉన్నాయని వాటిల్లో ఉపాధ్యాయులను  నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత స్థాయి వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగాలని, సమాంతర మాద్యమాలను కొనసాగించాలని తెలిపారు. కుల వ్యవస్థను ప్రేరేపించే జాతీయ విద్యా విధానాన్ని అందరూ తిరస్కరించాలని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో ఆరు రకాల పాఠశాలను ఏర్పాటు చేయడం, అందులో పాఠశాలను ముక్కలు చేయడం ద్వారా ప్రైమరీ విద్యార్థులు దూరంగా ఉన్న  ఉన్నత పాఠశాలలకి వెళ్ళ లేక బడి మానేసే ప్రమాదం ఉందని తెలిపారు.3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం వల్ల వేరు వేరు సమయ పట్టిక అమలు వలన పరిస్థితి చాలా గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలో కలపడాన్ని, ఉన్నత పాఠశాలలో +2(ఇంటర్మీడియట్)  విద్యను ప్రవేశపెట్టడాన్ని, ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.  పాఠశాలల్లో 20:1 చొప్పున విద్యార్థి  ఉపాధ్యాయ నిష్పత్తి ఉండేలా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని, మెమో 172ను  సవరించాలని కోరుతూ విజయనగరం లో కోట వద్ద  APSEC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో APSEC జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు APTF జిల్లా అధ్యక్షులు డి ఈశ్వర రావు, జిల్లా APTF బాధ్యులు  ఎన్ వి పైడి రాజు, దామోదర నాయుడు, ఎ వి శ్రీనివాస్, పి రాజశేఖరం, శ్రీనివాసరావు, కె మధుసూదన రావు,N కూర్మా రావు ,I Ch. సత్యనారాయణ, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను జయప్రదం చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా శాఖ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాము.

2020 జాతీయ విద్యా విధానం అమలు చేయొద్దు!

Mohan
APTF Updated at: August 12, 2021


కృష్ణాజిల్లా
జాతీయ విద్యావిధానం అమలును నిలుపుదల చేయాలని APSEC నిరసన ప్రదర్శన- కృష్ణాజిల్లా కలెక్టరేట్...ఎదుట
ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చెయ్యొద్దు!
25 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్...

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |