APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF GNT
Showing posts with label APTF GNT. Show all posts
Showing posts with label APTF GNT. Show all posts

APTF (1938) గుంటూరు జిల్లా క్యాలెండర్‌ ప్రారంభం

Mohan
APTF Updated at: January 01, 2023

 గుంటూరు:- ఎపిటిఎఫ్ (1938)గుంటూరు జిల్లా 2023 క్యాలెండర్‌ ను గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీ మతి పి.శైలజ గారి చే ప్రారంబించుటమైనది.అదే విదంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్  గారికి,గుంటూరు మండల విద్యాశాఖాధి కారి వారికి  మన సంఘం తరుపున నూతన  సంవత్సర శుభాకాంక్షలు తెల్పుతూ ఎపిటిఎఫ్ డైరీని బహుకరించాము.

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ గోవిందు వెళాంగణిరాజు, మేకల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కట్టెబోయిన నర్సిసింహారావు, జిల్లా సహాధ్యక్షులు శ్రీ పి.రమేష్, అదనపు కార్యదర్శి శ్రీ మోపిదేవి శివశంకర రావు తదితరులు పాల్గొన్నారు.







మేకల సుబ్బారావు ప్రధాన కార్యదర్శి ఎపిటిఎఫ్ గుంటూరు జిల్లా.

పెండింగ్ బకాయిలు,DA ల విడుదల కోసం APTF ధర్నా : గుంటూరు జిల్లా

Mohan
APTF Updated at: December 27, 2022

 

గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ యం.వేణుగోపాల రెడ్డి గారికి వినతిపత్రం ను అందించుచున్న ఎపిటిఎఫ్ (1938)నాయుకులు‌




APTF honouring the Architect of Indian Constitution Dr B.R.Ambedkar

Mohan
APTF Updated at: November 26, 2022

 బారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా  డాక్టర్  బి.ఆర్ . అంబేద్కర్ గారికి ఎపిటిఎఫ్ ఘన నివాళి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెబోయిన నరసింహారావు  గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు శ్రీ గోవిందు వెళాంగణిరాజు, మేకల సుబ్బారావు,  పల్నాడు జిల్లా అధ్యక్షుడు బెజ్జం సంపత్ బాబు, గౌరవ అధ్యక్షుడు శ్రీ పమ్మి వెంకటరెడ్డి, జిల్లా సహధ్యక్షుడు శ్రీ  పుల్లట రమేష్ కుమార్ లు పాల్గొన్నారు.






ఉపాద్యాయుల పి.యఫ్ సమస్యల ను వెంటనే పరిష్కారించండి....ఎపిటిఎఫ్ (1938).

Mohan
APTF Updated at: November 26, 2022

గుంటూరు:- ఉమ్మడి గుంటూరు జిల్లా పరిదిలోని ఉపాద్యాయుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో గత రెండు సంవత్సరాల నుండి నమోదు కాకుండ పెండింగ్‌లో నున్న వాటిని వెంటనే నమోదు చేయాలనీ ఎపిటిఎఫ్ గుంటూరు జిల్లా శాఖ,జిల్లా ముఖ్య కార్యనిర్వాహనాదికారి శ్రీ  శ్రీ నివాసరెడ్డి గారిని కోరడమైనదనీ,జి ల్లా ప్రధాన కార్యదర్శి మేకల సుబ్బారావు తెలిపారు.




    అదే విదంగా  ఇటివల బదలి అయిన  ఉపాద్యాయులకు వారి ఖాతాలకు వెంటనే. జమచేయాలనీ ,మార్చి ,2022 నుండి ఉపాద్యాయుల జీతాల నుండి మినహాయింపు చేసిన సోమ్ములను వారి ఖాతాలో జమచేయాలనీ కోరగా,శ్రీ యుత ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు సానుకూలంగా స్పందించి,సంబందిత అదికారులను పిలిపించి,మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తామనీ హామీ ఇచ్చారు.

    అదే విధంగా జిల్లాపరిషత్ వెబ్‌సైట్ ను ఆఫ్ డేట్ చేస్తున్నామనీ,త్వరలో  అన్ లైన్ లో ఉపాద్యాయులు పరిశీలించుకునే విధంగా ఆఫ్ డెట్ చేయబడుతుందనీ తెలియ చేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రదాన కార్యదర్శి మేకల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కట్టెబోయిన నరసింహారావు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ విజయానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ పి.రమేష్, సీనియర్ నాయుకులు శ్రీ యం.భాను, శ్రీ దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

మేకల సుబ్బారావు ప్రదాన కార్యదర్శి ఎపిటిఎఫ్ (1938)



C. P. S ను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎ.పి.టి.ఎఫ్ ( 1938)ధర్నా

Mohan
APTF Updated at: April 05, 2022

 APTF GNT :C. P. S  ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఎ.పి.టి.ఎఫ్ ( 1938)ధర్నా


గుంటూరు:-  ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎ.పి.టి.ఎఫ్ (  1938) గుంటూరు జిల్లా శాఖ ఆద్వర్యంలో ధర్నా :

   ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయం  నగరం పాలెం నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయంకు,అక్కడ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ  నిర్వహించి సి.పి.యస్   రద్దు చేసి పాత పెంక్షన్ కొనగించాలనీ,ఉన్నత పాఠశాల లో 3,4,5 తరగతులను విలీనం విరమించుకోవాలని పాఠశాల లలో ఆంగ్ల మీడియం తో పాటు తెలుగు మీడియం ను కూడ కొనసాగించాలనీ, ఉపాద్యాయులుకు ప్రభుత్వం చెల్లించవలసిన  మొత్తం బకాయులను వెంటనే చెల్లించాలని, 2018 జులై తరువాత పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాద్యాయులులకు గ్రాట్యుటి పెంపుదల వర్తింపు చేయాలనీ, డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు ధర్నా  నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం  రాష్ర ఉపాధ్యక్షుడు జె.విజయానంద్,జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శి లు జి.వి.రాజు,కె. నరసింహారావు, గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి ఏ .జోజప్ప జిల్లా నాయువకులు, సాయన్న మేకల సుబ్బారావు  యం.వి.ప్రసాద్, పి.రమేష్,శివశంకర్,ఓ. నాగార్జున, గణేష్, నాగమల్లేశ్వరరావు, వేణుగోపాలరావు,GSS ప్రసాదు,  PDSU రాష్ట్ర అధ్యక్షుడు గనీరాజు,మహిళానాయుకులు పవిత్ర, ఉదయశ్రీ , ఎలిజబెత్ నాగమణి, ,పద్మావతి, ఆలియా, కావటిశంకర్ రావు మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు  జిల్లా లోని వివిద ప్రాంతాల  ఎ.పి.టి.ఎఫ్ నాయుకులు కార్యకర్తలు   పాల్గాన్నారు.








గుంటూరు కార్పొరేషన్ లో ఎపిటీఎఫ్ సభ్యత్వ నమోదు!

Mohan
APTF Updated at: September 15, 2021

APTF GNT : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏపి టిఎఫ్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. విజయానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె .నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షులు ఓ. నాగార్జున, జిల్లా కార్యదర్శి గణేష్, నగర ప్రధాన కార్యదర్శి ఎ. జోజప్ప, జిల్లా మాజీ అధ్యక్షులు ఎమ్. వి. ప్రసాద్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరు టు విశాఖపట్నం బైక్ ర్యాలీ :: ఏపిటిఎఫ్ (1938) తరఫున పాల్గొన్న గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి

Mohan
APTF Updated at: February 14, 2021

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు_విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో  గుంటూరు టు విశాఖపట్నం బైక్ ర్యాలీ ప్రారంభం అయ్యింది ...ఈ సందర్భంగామన ఏపిటిఎఫ్ (1938) తరఫున గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు గారు   జిల్లా ఉపాధ్యక్షులు పుల్లట రమేష్ గారు పాల్గొన్నారు.

ఏపిటిఎఫ్ 1938 జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కీర్తిశేషులు జి బ్రహ్మానంద రాజుగారి దంపతులకు సంతాప సభ

Mohan
APTF Updated at: December 01, 2020

 ఏపిటిఎఫ్ 1938 జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కీర్తిశేషులు జి బ్రహ్మానంద రాజుగారి దంపతులకు సంతాప సభ:

 గుంటూరు జిల్లా వినుకొండ నగరంలో లో హనుమాన్ నగర్ నందు LFMHM గా పని చేయుచున్న బ్రహ్మానంద రాజుగారు మరియు వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలోLFMHM గా పనిచేయుచున్న జి దుర్గా రాణి గార్లు నాడు -నేడు కార్యక్రమం లో అవిశ్రాంతం గా పని చేయుచూ అసువులు బాసిన ఏపీటీఎఫ్ 1938 సీనియర్ నాయకులు సంతాప సభ ఏపిటిఎఫ్ 1938 జిల్లా కార్యాలయంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎం .దేవదానం బాబు గారు అధ్యక్షతన 29/11/20 ఉదయం 11 గంటలకు జరిగినది. ఈ కార్యక్రమమును జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కె నరసింహారావు ప్రారంభ ఉపన్యాసంలో బ్రహ్మానంద  రాజుగారు జిల్లా ఏపీటీఎఫ్ కార్యవర్గంలో గతంలో అదనపు కార్యదర్శి గాను, ప్రస్తుతం అసోసియేట్ అధ్యక్షులు గాను పనిచేస్తూ హాస్పటల్లో చేరిన తర్వాత కూడాను ఏపిటిఎఫ్ వినుకొండ వాట్సాప్ గ్రూపు లో ఈ మెసేజ్ లు పెడుతూ తన తుది శ్వాస వరకు ఫెడరేషన్ కోసం పనిచేశారని ఒక నిబద్ధత గల సీనియర్ కార్యకర్తలను కోల్పోవడం ఏ పి టిఎఫ్ కు తీరని లోటని తెలిపారు. ముఖ్యఅతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జె.విజయానంద్ గారు మాట్లాడుతూ బ్రహ్మానంద రాజు దంపతులు ఏపిటిఎఫ్ నకు చేసిన  సేవలను కొనియాడారు. వారి కుమారుడు శ్రీ వేణుగోపాల రావు గారికి సత్వరమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మరియు కోవిట్ కారణంగా చనిపోయిన నేపథ్యంలో వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ ఎమ్. వి ప్రసాద్ గారు మాట్లాడుతూ బ్రహ్మానంద రాజుగారు శావల్యాపురం ,వినుకొండ, బొల్లాపల్లి మండలాల్లో ఏపిటిఎఫ్ 1938 వ్యాప్తికి ఉద్యోగంలో చేరిన నాటి (1989 )నుండి పనిచేశారని భార్యాభర్తలు ఇరువురూ ఫెడరేషన్ కొరకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారని తెలియజేశారు.ఈ కార్యక్రమములో   జిల్లా ఉపాధ్యక్షులు P. రమేష్ కుమార్ జిల్లా అదనపు కార్యదర్శి M.సాయన్న గుంటూరు నగర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు శ్రీ D.సురేష్ , A.జోజప్ప గార్లు పాల్గొని సంతాపం తెలియజేశారు




Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |